Tuesday, April 6, 2021

అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రం స్థాపించి అందులో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం.

💚🍋 అమ్మవారితోనే పాచికలాడి శ్రీచక్రం స్థాపించి అందులో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం 🍋💚
🌷🌻 మధుర మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ ఆదిశంకరులు శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం 🌻🌷
🌺 పంచశత శక్తిపీఠాల్లో మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.
🌺 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.
🌺 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!
🌺 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.
🌺 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.
🌺 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు.
🌺 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో, ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క" అని పాండ్యరాజు వేడుకున్నాడు.
🌺 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు. పాండ్యరాజు హతాశుడైయ్యాడు.
🌺 దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు.
🌺 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.
🌺 ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.
🌺 పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.
🌺 ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి? నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.
🌺 క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా.
🌺 ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్క రించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !
🌺 అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి?
🌺 అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.
🌺 ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు.
🌺 ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది? ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!" ఆనుకుంది అమ్మవారు.
🌺 "ఎవరు నాయనా నీవు ? నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.
🌺 ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది.
🌺 "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి" మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు".
🌺 " నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించకఅనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు.
🌺 "బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"
🌺 "కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.
🌺 పసితనపు అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు"
🌺 "మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను".
🌺 "అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని.ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.
🌺 ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే ఉబలాటము ఆమెలో వచ్చేసింది.
🌺 "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"
🌺 "తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.
🌺 జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి, తన సంహారకార్యక్రమం కొనసాగించాలని ఆలోచించింది.
🌺 ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.
🌺 "ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి. చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది. మరి మీఇష్టము!" అన్నది. సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు.
🌺 ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.
🌺 నీ లలితాసహస్రనామంలోని కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.
🌺 సంఖ్యాశాస్త్రప్రకారము పావులు కదులుతూ ఉన్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది.
🌺 ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి.
🌺 "విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.
🌺 పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది. ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది.
🌺 "గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.
🌺 ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది.
🌺 పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు.
🌺 వెంటనే అతనిహృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది.
🌺 అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.
🌺 "ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనేఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు.
🌺 "తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు.
🌺 "నాయనా! చివరి పందెంనాది. నాపావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.
🌺 "నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.
🌺 "నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!" అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు.
🌺 దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు.
🌺 అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ! తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ! నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను చూడుతల్లీ!"
🌺 44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి.
🌺 "అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చనగదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూవస్తున్నాను".
🌺 "ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు కించిత్ లజ్జ, కించిత్ వేదనతో బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు.
🌺 "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు.
🌺 ఒకవైపు అహం తగ్గిపోయినఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళుతెరిచాడు. చిరునవ్వునవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి.
🌺 భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.
మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత.
🌺 పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు. ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.
🌺 అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్కఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైననాకు మాత్రమే తెల్సు.
🌺 కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు. బ్రష్టులయ్యారు. కానీనీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణంతప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్వికకళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు.
🌺 అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలైఉంటాడని
భయబ్రాంతుడయ్యాడు.
🌺 రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు.
🌺 సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది.
🌺 ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృస్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి".
🌺 "నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.

Source - Whatsapp Message

ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది.

మహాభారతంలో ఒక కధ ఉంది... కకుద్మి అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి రేవతి అనే అందమైన కూతురు ఉండేది. అయితే ఆ అమ్మాయి అందానికి తగిన వరుణ్ణి వెతకడం ఆ రాజుకి పెద్ద తలనొప్పి అయ్యింది. అందుకని ఆ రాజు తనకున్న తపశ్శక్తిని ఉపయోగించి తన కూతుర్ని వెంట పెట్టుకుని బ్రహ్మ లోకానికి వెళ్తాడు. అయితే ఆ సమయానికి బ్రహ్మ లోకంలో సంగీత కార్యక్రమం జరుగుతుండడం వల్ల కొద్దిసేపు వేచి ఉన్నాడు.

ఆ సంగీత కార్యక్రమం ముగిసిన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్లి తన కూతురికి తగిన వరుణ్ణి తన రాజ్యంలో గాని పక్క రాజ్యంలో గానీ ఉంటే చెప్పమని ప్రార్ధిస్తాడు. అప్పుడు బ్రహ్మ ఆ రాజుతో నువ్వు నీ కూతుర్ని తీసుకురావడం చాలా మంచిది అయ్యింది అన్నాడు. అదేంటి అని అడిగాడు రాజు. నీకు తెలియదా భూమిపై సమయానికి, బ్రహ్మ లోకంలో సమయానికి వ్యత్యాసం ఉందని. నువ్వు ఇక్కడ ఉన్న ఈ కాస్త సమయంలో భూమి పై 27 చతుర్యుగాలు గడిచి పోయాయి. ఇప్పుడు అక్కడ నీవారు గానీ, నీ రాజ్యం గానీ లేదు అన్నాడు.

దిగ్భ్రాంతి చెందిన ఆ రాజు బ్రహ్మను వేడుకుని ఇప్పుడు తాను ఏం చేయాలో సెలవియ్యమన్నాడు. అప్పుడు బ్రహ్మ.. ఇప్పుడు భూమిపై 28 వ చతుర్యుగము నడుస్తుంది. అక్కడ మహా విష్ణు అవతారం అయిన శ్రీ కృష్ణుని అన్న బలరాముడు నీ కూతురికి తగిన జోడి. కాబట్టి అతనికిచ్చి నీ కూతుర్ని వివాహం చెయ్యి అన్నాడు బ్రహ్మ...

ఇప్పుడు ఒక ప్రముఖ హాలీవుడ్ చిత్రం గురించి మాట్లాడదాం...

ఆ చిత్రం పేరు "Interstellar" ఈ చిత్రం 2014 లో వచ్చింది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే ఈ చిత్రం లో కథానాయకుడు గతంలో నాసాలో పైలట్ గా చేసి ప్రస్తుతం తన ఊరిలో వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అతనికి ఒక కూతురు, కొడుకు ఉంటారు.
కూతురంటే అతనికి ప్రాణం.

ఒకరోజు అతని కూతురు తన గదిలో ఉన్న పుస్తకాల అర నుండి తరచూ పుస్తకాలు వాటంతట అవే పడడం గమనించి ఆ గదిలో దెయ్యం ఉందని తండ్రితో చెబుతుంది. అప్పుడు ఆమె తండ్రి అదేమీ కాదని వివరించి గతంలో నాసాలో పనిచేసిన తన ప్రొఫెసర్ని కలిసి దీని గురించి వివరిస్తాడు.
తన కూతురు గదిలో దూళి చారలు ఏర్పడ్డాయని, తన జేబులోంచి పడిన నాణాన్ని ఆ దూళి చారలు ఆకర్షించాయని, వాటిని పరిశీలించి చూసి దానిని డీకోడ్ చేశానని, ఎక్కడో ఇతర లోకాల్లో ఉన్న జీవులు భూమిపై ఉన్నవారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెబుతాడు ఆ హీరో. అయితే భూమిపైకి వస్తున్న ఆ పాజిటివ్ తరంగాలపై పరిశోధన చేయగా అవి శని గ్రహానికి(Saturn) దగ్గరలో ఉన్న ఒక పాలపుంతలోని(Galaxy) ఒక గ్రహం నుండి వస్తున్నాయని చెబుతాడు ఆ ప్రొఫెసర్.

అయితే అది భూమి ఉన్న పాలపుంత కాకపోవడం వల్ల ఆ పాలపుంతలోకి వెళ్ళడానికి ‘వార్మ్ హోల్’ (Warm hole) ద్వారా చేరుకోవచ్చని కొంతమంది బృందాన్ని తయారు చేసి ఒక వ్యోమ నౌక మీద వారి అందరినీ పంపిస్తాడు ఆ ప్రొఫెసర్ హీరోతో పాటుగా. వార్మ్ హోల్ అంటే ఒక గాలక్సీ నుండి ఇంకో గాలక్సీకి వెళ్ళడానికి దగ్గరి దారి. అయితే వారి లక్ష్యం ఏంటంటే ఆ పాలపుంతలో మానవ జీవనానికి అనువుగా ఉండే గ్రహాన్ని కనిపెట్టి భూమిపై మనుషుల్ని అక్కడికి తరలించాలని.. వగైరా వగైరా(etc etc..).. అప్పటికి ఆ హీరో కూతురు వయ్యస్సు 10 సంవత్సరాలు (ఇక్కడ ఈ విషయం గుర్తుంచుకోవాలి). ఆ తరువాత కధ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఆ హీరో ఆ పాలపుంతలో ఉన్న కృష్ణ బిలంలోనికి (Black hole) ప్రవేశిస్తాడు. అయితే అది 4D లోకం. మనం ఉన్నది 3D ప్రపంచం. నాలుగవ డైమెన్షన్ కాలం.

అంటే నాలుగవ డైమెన్షన్ ప్రపంచంలో మనం కాలంలో కూడా ప్రయాణించవచ్చన్న మాట..
అంటే ఇప్పుడు ఆ హీరో కాలంలో ప్రయాణించ గలడన్న మాట. అయితే ఆ హీరో కాలంలో ప్రయాణించి తన కూతురు గదిలోకి వెళ్తాడు. అప్పుడు గదిలో ఉన్న తన కూతురికి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూ పుస్తకాల అరలో నుంచి పుస్తకాలను కింద పడేస్తాడు.

ఇప్పుడు అర్ధం అయ్యిందా... అంటే వేరే లోకం నుండి భూమిపై ఉన్నవారికో సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నది భవిష్యత్తులో ఉన్న హీరోనే.
ఇక ఆ తరువాత కొంత కధ నడిచాక ఆ హీరో భూమిపైకి తిరిగి వస్తాడు. అయితే అప్పటికే తన కూతురు ముసలిది అయిపోతుంది. కాని హీరో వయసు మాత్రం మారదు. ఎందుకంటే హీరో వెళ్లిన గ్రహంలో ఒక గంట భూమిపై ఏడు సంవత్సరాలలో సమానం..

పైన మహా భారతంలోని కథను చదివి మనం దాన్ని ఒక కధగానే తీసుకుంటాం. కాని ఆ కధలో నేటి సైన్స్ కన్నా ఎంతో ముందే "సమయ విస్ఫారణం"(Time dilation), "కృష్ణ బిలం"(Black hole), "వెచ్చని రంధ్రం” (Warm hole) వంటి ఆధునిక సైన్స్ చెబుతున్న వాటిని ఎప్పుడో మన హిందూ సనాతన ధర్మము యందు చెప్పడం జరిగింది..

అందుకే స్వామీ వివేకానంద అన్నారు.. "సైన్స్ అభివృద్ధి అయ్యేకొద్దీ సనాతన ధర్మం మరింత బలపడుతూ ఉంటుంది" అని.

ఇతర లోకాలకు, మనకు ఉన్న ఈ కాల వ్యత్యాసాన్నే "సమయ విస్ఫారణం” (Time dilation) అని నేటి సైన్స్ చెబుతుంది. మనం మహాభారతంలో చదువుకున్నాం. పాండవులు చివరి రోజులలో స్వర్గాన్ని చేరుకోవడానికి హిమాలయాలు మీదుగా ప్రయాణం చేయడం. కాని.. స్వర్గం ఉండేది భూమిపై కాదు. మరి స్వర్గాన్ని చేరుకోవడానికి భూమిపై ఉన్న హిమాలయా

లు వెళ్లడం ఏంటి అని అనుమానం వస్తుంది.. నాక్కుడా వచ్చింది..

పైన చెప్పిన వార్మ్ హోల్ సిద్ధాంతం ఇక్కడ మనం అర్ధం చేసుకోవాలి.. హిమాలయాల్లో స్వర్గానికి చేరుకునే వార్మ్ హోల్ ఉన్నాయన్న మాట.. అలాగే ఆది శంకరాచార్యుల వారు బద్రీనాథ్ వద్ద అంతర్ధానం అయిపోయారని ఆయన చరిత్ర చెబుతుంది. అంటే అక్కడ వార్మ్ హోల్ ద్వారా ఆయన పరంధామం చేరుకున్నారని అర్ధం అవుతుంది...

మన హిందూ సనాతన ధర్మము ప్రకారం.. మరియు గరుడ పురాణం బట్టి చూసినా చనిపోయిన వారికి 11 -15 రోజుల వరకూ ప్రతీరోజూ పిండ ప్రధానం చేస్తారు. ఆ తరువాత సంవత్సరం వరకూ నెలకొక్కసారి చేస్తుంటారు. ఆ తరువాత సంవత్సరానికి ఒకసారి చేస్తుంటారు..

ఎందుకో తెలుసా... చనిపోయిన 11 – 15 రోజుల వరకూ జీవుడు భూమిపైనే ఉంటాడు. అందుకే ప్రతీరోజు పిండ ప్రధానం చేస్తాం. ఆ తరువాత జీవుడు స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరు కోవడానికి ఒక సంవత్సర కాలం పడుతుంది గరుడ పురాణం ప్రకారం. ఆ సమయంలో భూమిపై నెలరోజుల కాలం ఆ లోకంలోని వారికి ఒకరోజుతో సమానం. అందుకే నెలకొకసారి చేస్తే వారికి రోజు కొకసారి పెట్టినట్టు.. ఇక సంవత్సరం తరువాత స్వర్గానికి గానీ నరకానికి గానీ చేరుకుంటారు. అప్పుడు సంవత్సరానికి ఒకసారే పెడతాం.

ఎందుకంటే అక్కడ ఒక రోజు, భూమిపై ఒక సంవత్సరంతో సమానం. ఇలానే ఎన్నో లోకాలు, ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయి. ఈ లోకాల మధ్య ఉన్న కాల వ్యత్యాసమే "సమయ విస్ఫారణం"(Time Dilation) అంటాం..

ఇట్లానే.. బ్రహ్మ దేవుఁడు శ్రీకృష్ణుని స్నేహితులను అపహరించినపుడు కూడా ఒక క్షణం పాటు అది ఒక సంవత్సరం అయ్యింది. అప్పుడు కృష్ణుడే అన్ని రూపాలుగా మారి అందరి పిల్లలుగా, జంతువులుగా మారి బ్రహ్మకు గుణపాఠం చెప్తాడు...

ఇలా మన పురాణాలలో ఎన్ని విషయాలు ఉన్నాయో కూడా తెలియని ఈ ప్రస్తుత సమాజం మన సంస్కృతిని కాదని ఏ తల తోక లేని పరమతం మాయలో పడుతున్నారు.. మన తరువాత ఎప్పుడో వచ్చిన ఎడారి మతాలు ఇలాంటి విజ్ఞానానంలో మన హిందూ సనాతన ధర్మమునకు దరిదాపుల్లో కూడా రాలేవు..

కుదిరితే ఈ వ్యాసం అందరికి పంపండి.. కనీసం చదువుకున్న వాళ్లకు అర్థం అవుతుంది...

|| ఓం నమః శివాయ ||

Source - Whatsapp Message

మంచి మాట..లు

మంగళవారం --: 06-04-2021 :-- ఈరోజు మంచి మాట..లు

జీవితంలో తన వైపు ఇతరులు విసిరే రాళ్లతో తన ఎదుగుదలకు పునాదులు వేసుకునే వాడే తెలివైన వ్యక్తి ఒక్కటే గుర్తుంచుకోండి మనం ఏపని చేసినా అది అందరికి నచ్చదు ఎంతమంచి పనిచేసినా కొంతమంది మూర్కులు విమర్శిస్తూనే వుంటారు అందుకే అన్నారు కదా పెద్దలు లోకులు కాకులు అని !.

నిజంగా నువ్వంటే ఇష్టం ఉన్న వారు , నీపై ప్రేమ ఉన్న వారు నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీవు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నన్ను మాత్రం ఎప్పటికి వదులుకోకు . ఈ మాట బాగా గుర్తుంచుకో నేస్తమా .

మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంత ఉందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో.మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో . మనం ఇచ్చింది మరచిపోవడం , యితరులవద్ద పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం .

సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 💐🤝🙏

Source - Whatsapp Message

Monday, April 5, 2021

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం

రామునికి — సీత
కృష్ణునికి — రాధ
ఈశునకు — ఈశ్వరి
మంత్రపఠనంలో — గాయత్రి
గ్రంధ పఠనంలో — గీత
దేవుని యెదుట - వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా శ్రద్ధ

*మన దినచర్యలో భాగంగా
ఉదయానికే — ఉష, అరుణ
సాయింత్రం — సంధ్య
చీకటైతే — జ్యోతి, దీప
రాత్రి మత్తులో — నిషా
పడుకున్నాక — స్వప్న
చూచేటప్పుడు — నయన
వినేటప్పుడు — శ్రావణి
మాట్లాడునప్పుడు — వాణి
ఓరిమిలో - వసుధ వడ్డించేటప్పుడు - అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు — హంస
నవ్వుచున్నప్పుడు — హాసిని, ప్రసన్న
అద్దంలో చూస్తే — సుందరి
చేసేపనికి - స్పూర్తి
పని చేయడానికి — స్పందన
మంచి పనికి — పవిత్ర
ఇష్టంగాచేసే పనికి — ప్రీతి
నీరు త్రాగునపుడు — గంగ
ఐస్క్రీమ్ తినేటప్పుడు — హిమజ
సినిమా చూస్తున్నప్పుడు — చిత్ర
అబద్ధ మాడునపుడు — కల్పన
నిజం చెప్పేటపుడు — సత్యవతి, నిర్మల
ఆలోచనలప్పుడు — ఊహా, భావన చదువుచున్నప్పుడు — సరస్వతి
వ్యాపారంలో — ప్రతిభ , ప్రగతి
సంతోషంలో — సంతోషి
కోపంలో — భైరవి
ఆటలాడునప్పుడు — ఆనంది
గెలుపు కోసం — జయ, విజయ
గెలిచిన తర్వాత — కీర్తి
సరిగమలు నేర్చునపుడు — సంగీత
పాటలు పాడునపుడు — శృతి, కోకిల
తాళం వేయునపుడు — లయ
నాట్యమాడునపుడు — మయూరి
సాహిత్య గోష్టిలో — కవిత
నగరాన్ని కాపాడుతూ — ప్రకృతి
జీవిత గమనంలో మనతో
విద్యాభ్యాసంలో — విద్య
సంపాదనప్పుడు — లక్ష్మి
చేసేవృత్తిలో — ప్రేరణ పని చేసి వచ్చాక — శాంతి
చిన్నతనంలో — లాలన మధ్యవయస్సులో -మాధురి
ముసలితనంలో- కరుణ, మమత
జీవితాంతం మనతో — స్త్రీ

Source - Whatsapp Message

అనుభవాల గనులు నేటి వ్రుద్దులు.

అనుభవాల గనులు నేటి వ్రుద్దులు.

మూలన పడేస్తే వృద్ధులు, వ్యర్థులు..

ముంగిట్లో కూచోబెడితే ఇంటిని కాచే పార్వతీ పరమేశ్వరులు..

బతుకు బాటలో గతుకుల్ని ముందుగా హెచ్చరించి, కాపాడే సిద్ధులు వృద్ధులు..

వృద్ధులు సారధులైతే యువకులు విజయులౌతారు..

అనుభవాల గనులు ఆపాత బంగారాలు..

వదిలేస్తే వృద్ధులు మంచానికి బద్ధులు..

చేయూతనిస్తే ప్రతి వృద్ధులు ఓ బుద్ధులు..

నిర్లక్ష్యంగా చూస్తే కేవలం మూడు కాళ్ల ముసలి..

తగిన గుర్తింపునిస్తే విజయాన్నిచ్చే త్రివిక్రములు..

ఒకనాటి బాలురే ఈనాటి వృద్ధులు..

మూలన పడ్డారని చులకనగా చూడకు...పోయాక మూరెడు కట్టెల చితిలో కాల్చేస్తానని ఎదురు చూడకు..

బతికినన్నాళ్లు నాలుగు మెతుకులు పెట్టి ఇంత అరుసుకో..

వారు లేని నువ్వెక్కడ..నీ జీవితమెక్కడ..

ఎప్పుడు పోతారా అని ఎదురు చూసి..పోయాక దినాల రోజు వరకు తిని, తాగి కడుపులు కడుక్కోవడమేనా..

నువ్వు కొన్నాళ్ళకు వృద్దుడివే అవుతావు.. అప్పుడు నీ గతి ఏంటో ఆలోచించు..

నువ్వు నీ తల్లి దండ్రులను, ఎలా చూసుకున్నావో..నీ వారసులు గమనిస్తూనే ఉన్నారు..నీకు అదే గతి పట్టేనేమో చూసుకో..

తనను పట్టించుకోకున్నా నువ్వు పచ్చగా ఉండాలని తపించే ఉదాత్తములు వృద్ధులు..
పలకరిస్తే చాలు పాలకడలిలా పొంగులు వారే పసివారు వృద్ధులు..

వృద్ధులంటే పై పైన చూస్తే జుట్టు తెల్లబడిన ఫలిత కేశాలవారు..

అంతర్గతంగా తలపండిన పండితులు..🙏

అందుకే మన పూర్వీకులు వృద్ధులకు అమిత గౌరవాన్నిచ్చేరు, ఇమ్మన్నారు..

సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

శ్రీ స్వామి వివేకానందులు తన శరీరాన్ని విడిచే ముందర చెప్పిన మాటలు..

శ్రీ స్వామి వివేకానందులు తన శరీరాన్ని విడిచే ముందర చెప్పిన మాటలు..
🕉🌞🌎🌙🌟🚩

ఇక దేనికీ నేను విచారపడను. ఊహాతీతమైన ప్రశాంతతను పొందుతున్నాను. అది సుఖం కాదు, దుఃఖమూ కాదు. వాటికి అతీతమైనది.. ఇప్పుడు నేను ఆ ప్రశాంతతను సమీపిస్తున్నాను. అది శాశ్వత నీరవత (నిశ్శబ్దం). ఇప్పుడు నేను విషయాలను వాటి యథార్థ స్థితిలో, ప్రతిదాన్ని, ఆ ప్రశాంతతకి, దాని పరిపూర్ణ స్థితిలో చూడగోరుతున్నాను.


"ఎవడి ఆనందం వాడిలోనే ఉందో, ఎవడి కోరికలు వాడిలో మాత్రమే ఉన్నాయో, అతడు తన పాఠాలు నేర్చుకున్న వాడు.." అనేక జన్మల, స్వర్గాల, నరకాల, పరంపరలనుండి, మనం ఇక్కడ ఉండి నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఇదే - తన ఆత్మను తప్ప కోరదగింది, అడగవలసింది మరొకటి లేదు. "నేను పొందగల సర్వోత్కృష్టమైనది నా ఆత్మే.." "నేను ముక్తుణ్ణి..", కాబట్టి నేను ఆనందించడానికి మరేమి అవసరం లేదు. "అనంత కాల పర్యంతం నేను ఒక్కణ్ణే. ఎందుకంటే నేను భూతకాలంలో ముక్తుణ్ణి. ఇప్పుడు వర్తమానంలోనూ ముక్తుణ్ణి. ఇక భవిష్యత్తులోనూ ఎల్లప్పుడూ ముక్తుణ్ణిగానే ఉంటాను.." ఇది వేదాంతతత్త్వం. ఇంతకాలం సిద్దాంతాన్ని బోధించాను. కాని ఓ, ఆనందం..! నేనిప్పుడు దాన్ని నిత్యం సాక్షాత్కరించుకుంటున్నాను. అవును, నేను "ముక్తుణ్ణి.." "నేను ఏకమేవా ద్వితీయం (రెండవది లేని వాడనుగా ఉన్నాను..)"


మాసిపోయిన బట్టను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటకు పోవడం మంచిదయుండవచ్చు. కాని పని చేయడం మాత్రం విరమించను. భగవంతునితో ఐక్యాన్ని లోకంలోని యావన్మంది గుర్తించే వరకు నేను వారికి ప్రేరణను కల్పిస్తూనే ఉంటాను..


నా ఆశయాన్ని క్లుప్తంగా ఇలా చెప్పవచ్చు:- మానవాళికి వారిలోని దివ్యత్వాన్ని బోధిస్తూ, ఆ దివ్యత్వాన్ని జీవితంలో ప్రతిక్షణం ఎలా అభివ్యక్తం చేయాలో నేర్పడం.

- స్వామి వివేకానంద.

🕉🌞🌎🌙🌟🚩

Source - Whatsapp Message

నేటి మంచిమాట

🌹నేటి మంచిమాట🌹
🎊💦🌹🦚🦜💜

తన స్వార్థం, తన ప్రయోజనం,
తన లబ్ధి తప్ప ఇంకేవీ పట్టని,
ప్రమాదకర "సంస్కృతి" మనిషిని చుట్టేస్తున్నది.!
బతికితే గొప్పోడిగా బ్రతుకు,
ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉండు,
కష్టాన్ని నమ్ముకో...
అంతే తప్పించి.. కుళ్లిపోయిన ఆలోచనలు కలిగిన,
జీవితం మాత్రం కోరుకోకు.!

సరైన జీవితం కావాలి అంటే.?
సరైన వారితోనే తిరగాలి,
సరికాని వారితోనే తిరిగి,
సరైన జీవితం కోరుకుంటే...
అది సరి కాని కోరిక అవుతుంది.!
రెండు పడవల ప్రయాణం,
ఎన్నటికైన ప్రమాదమే జాగ్రత్త!!
క్యారెక్టర్ ఉన్నోడికి,
కావాల్సినోళ్లంటూ ఎవరూ ఉండరు.?
వాడి బ్రతుక్కి "వాడే రాజు.. వాడే బంటు.."

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబసభ్యులకు శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ ప్రసన్న రామలింగేశ్వర స్వామి వారి అనుగ్రహం తో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాను.. జీవితంలో ఏమి ఉన్న లేకున్నా తృప్తి ఆనందం ఉంటే చాలు హాయిగా బతికేస్తాం అత్యాశకు పొతే అన్ని కష్టాలే.. మీ AVB సుబ్బారావు 💐🤝🙏
ఈ రోజు AVB మంచి మాట.. లు
సోమవారం --: 06-04-2021 :--

జీవితం అంటే అనిపించింది చేయటం కాదు అనుకున్నది చేయటం . అనుపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు అనుకున్నది చేస్తే సాదించేందుకు బ్రతుకుతున్నట్లు .

తండ్రి ఎప్పుడూ కొడుకుని తిడుతూ పెంచుతాడు . ఎందుకంటే అయన తర్వాత కుటుంబ బాధ్యత మోసేది కొడుకే కనుక , కుతూర్ని ఎప్పుడూ ప్రేమతో పెంచుతాడు ఎందుకంటే అత్తారింట్లో ప్రేమను పంచేది కొడలే కనుక .

బ్రతిమిలాడి ఎవరినీ కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోకండి . ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా ఎదుటి వారి మనసులో నుండి రావాలి అలా బ్రతిమిలాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా కొంత కాలమే ! ఆ తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని ఇష్టాన్ని ప్రేమను చూపించినా మీ మనసు పడే ఆవేదన మోస్తున్న బాధన నువ్వు తెల్పినా సరే వారికి అర్థం కాదు . అడిగే కొద్ది మీరు వారికి ఇంకా అసలు అయిపోతారు .

సేకరణ ✒️*మీ ... AVB సుబ్బారావు 💐🤝🙏

Source - Whatsapp Message

త్వరలో అంతరించబోతున్న పాత తరం...

త్వరలో అంతరించబోతున్న పాత తరం...

రాబోయే 10/15 సంవత్సరాలలో ఒక క్రమశిక్షణ కలిగిన, కష్టపడిన తరం ఈ ప్రపంచం నుండి కనుమరుగు అవ్వబోతోంది.
అవును ఇది ఒక చేదు నిజం !

ఆ తరం ప్రజలు అతి సామాన్య వ్యక్తులు.
రాత్రి పెందరాళే పడుకునే వాళ్ళు !
ఉదయం పెందరాళే లేచేవాళ్ళు !
నడక అలవాటు ఉన్నవాళ్ళు!
మార్కెట్ కి నడిచి వెళ్ళే వాళ్ళు
ఉదయమే వాకిట కళ్ళాపు చల్లేవాళ్ళు !
ముంగిట్లో ముగ్గులు పెట్టేవాళ్ళు!
మొక్కలకు నీళ్ళు పెట్టేవాళ్ళు!
పూజకు పూలు కోసే వాళ్ళు !
పూజ కాకుండా ఏమీ తినని వాళ్ళు !
మడిగా వంట వండేవాళ్ళు !
దేవుడి గదిలో దీపం వెలిగించే వాళ్ళు!
దేవుడి గుడికి వెళ్ళే వాళ్ళు !
దేముడి మీద విశ్వాసం ఉన్నవాళ్ళు !!!
మనిషిని మనిషిగా ప్రేమించే వాళ్ళు.!!
అందరితో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు!
కుశల ప్రశ్నలు వేసేవాళ్ళు !
స్నేహంగా మెలిగే వాళ్ళు!
తోచిన సాయం చేసేవాళ్ళు !
చేతులు జోడించి నమస్కారం చేసేవాళ్ళు !
ఉత్తరం కోసం ఎదురుచూసిన వాళ్ళు !
ఉత్తరాల తీగకు గుచ్చిన వాళ్ళు !
పాత ఫోన్ లు పట్టుకు తిరిగే వాళ్ళు!
ఫోన్ నెంబర్ లు డైరీ లో రాసిపెట్టుకునే వాళ్ళు!
పండుగలకూ, పబ్బాలకూ అందరినీ పిలిచే వాళ్ళు!
కుంకుడు కాయతో తలంటుకున్నవాళ్ళు !
సున్నిపిండి నలుగు పెట్టుకున్నవాళ్ళు !
పిల్లలకు పాలిచ్చి పెంచినవాళ్ళు !
తీర్థయాత్రలు చేసేవాళ్ళు !
ఆచారాలు పాటించే వాళ్ళు !
తిధి, వారం , నక్షత్రం గుర్తుపెట్టుకునే వాళ్ళు !
పుట్టిన రోజు దీపం వెలిగించి జరుపుకునేవాళ్ళు !
.
చిరిగిన బనియన్లు తొడుక్కుని ఉండేవాళ్ళు !
లుంగీలు, చీరలు కట్టుకుని ఉండేవాళ్ళు !
చిరిగిన చెప్పులు కుట్టించుకుని వాడుకునే వాళ్ళు!
అతుకుల చొక్కాలు కట్టుకున్నవాళ్ళు !
వాళ్ళు ....
తలకు నూనె రాసుకునే వాళ్ళు !
జడగంటలు పెట్టుకున్నవాళ్ళు !
కాళ్ళకు పసుపు రాసుకునేవాళ్ళు !
చేతికి గాజులు వేసుకునే వాళ్ళు !
ఇప్పటిలా మనుష్యులను వాడుకుని వస్తువుల తో స్నేహం కాకుండా... వస్తువులను వాడుకుంటూ మనుషుల తో స్నేహంగా గడిపిన తరం.....
.
ఈ తరాన్ని చూసి మూగబోయిన వాళ్ళు
మీకు తెలుసా ?
వీళ్ళంతా నెమ్మది నెమ్మదిగా మనల్ని వదిలి పెట్టి వెళ్ళిపోతున్నారు.
మన ఇళ్ళల్లో ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమె ఉన్నారు.
మీ ఇంటిలో ఇలాంటి వాళ్ళు ఉంటె దయచేసి వాళ్ళను బాగా చూసుకోండి
.లేదంటే .....
.లేదంటే .....
.లేదంటే .....
ఇప్పటి తరం చాలా కోల్పోవలసి వస్తుంది.
.వాళ్ళ ప్రపంచం, వస్తువులతో కాకుండా, మనుషులతో మానవత్వం తో,స్నేహం తో కూడి ఉండే తరం...
సంతోషకరమైన జీవనం గడిపిన తరం అది ,!
స్పూర్తిదాయక జీవనం గడిపిన తరం అది !
కల్లాకపటం లేని జీవనం గడిపిన తరం అది!
ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా ధైర్యంగా మాట్లాడగలిగిన తరం
ద్వేషం, మోసం లేని స్నేహ జీవనం గడిపిన తరం అది!
సాత్విక ఆహారం తిని జీవనం గడిపిన తరం అదే

లోకానికి తప్పు చేయడానికి భయపడి జీవనం గడిపిన తరం అది !
ఇరుగుపోరుగుతో కలసిమెలసి జీవనం గడిపిన తరం అది!
తనకోసం కొంత మాత్రమే వాడుకుని, తన సంతానం వృధ్ధి కోసం పరితపించిన తరం
.
వారినుండి మనం నేర్చుకోకపోతే ముందు తరాల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుంది
మీ కుటుంబం లో పెద్దవారిని మీరు గౌరవించడం ద్వారా మీ పిల్లకు మంచి సంస్కారం అందివ్వండి. .
సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజాలతో స్నేహంగా వుండేట్టు వారిని తయారు చేయాలి..

సంస్కారం లేని దేశం ... సంస్కృతి లేని దేశం గా ఈ భారతాన్ని మార్చేయ్యకండి !!!

తప్పులను సరిదిద్దగలది సంస్కారమే
సర్కారు చేసే చట్టాలు కాదు....

*రాబోయే తరాలకు ఆస్తులనే కాదు ... ఆప్యాయతలను,స్నేహాన్ని కూడా అందిద్దాం.. లేకుంటే రాబోయే తరాలవారిని మనుషులుగా కాక మర యంత్రాలుగా పిలుస్తారు..🙏

Source - Whatsapp Message

తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా..

🍃🌟 తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి చేసుకుంటున్న విన్నపం ఏమనగా..

అయ్యా 🌷

✍ క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు.

తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.

క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.

పిల్లలకి బడిలో భయంలేదు. ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.

గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం.

గురువంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?

కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు! ఒకవేళ కొట్టినచో బడి ముందు ధర్నా! టీచర్ పై దాడి! పోలీస్ కేసు!

6వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగినజీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.

దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా ఏమికాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.

ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు

ఇదే అలుసుగా పిల్లలు టీచర్ ఏదన్నా అనగానే పోలీస్ స్టేషన్కు పోతున్నారు.

పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.

కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తాదా?

భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట! అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.

స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యమ్?

మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?

మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.

తల్లిదండ్రులకు నా మనవి... పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో... ఒకటో అరో... ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. 99శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యదార్ధం. ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు.

మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని దారుణంగా కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగుకోసమే అని అనుకునేవారు.
మొక్కయి వంగనిది మానై వంగున!!!!!

ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.*

Source - Whatsapp Message

Sunday, April 4, 2021

నేటీ జీవిత సత్యం.

నేటీ జీవిత సత్యం. మనిషి శారీరకంగా ఆర్ధికంగా బలహీనమైనపుడు.. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా అంతకుముందు మన మననును బాధ పెట్టినా అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా.. వారిని ఆదరించి నీకు మేమున్నాం అని భరోసా కల్గించడం మానవీయ లక్షణం. రోగాన్ని రోగ గ్రస్త శరీరాన్ని మనం నయంచేయలేకపోయినా అప్పటి వారి మానసిక స్థితి శరీర దౌర్భల్యానికి ఆదరణతో కూడిన సేవ సాంత్వన కల్గించే మాటలను తప్పకుండా అందించాలి. మనుషుల హృదయాలు రాతి హృదయాలు కరగనివయితే కాదు.. కదా!
మంచిమనుషులకు కోపం తాటాకు మంటలాంటిదంటారు.. కదా.. అలా వుండగల్గాలి. ఎవరూ తప్పులు చేయనివారు లోపాలు లేని వారు వుండరు. క్షమ మనిషిని మహోన్నత శిఖరాల మీద కూర్చుండబెడుతుంది అంటారు కదా.. నిజానికి చాలామంది డబ్బు లేక సరైన వైద్యం లేక పోరాడి అలసి అలసి నిస్సహాయస్థితిలో మరణిస్తారు. కొంతమంది అహంకారంతో అన్నీ వుండి కూడా ఆత్మీయులు లేక అలమటిస్తారు.
మనం భగవంతుని ముందు క్షమసత్వం చెప్పుకున్నట్టే మనవారి ముందు చెప్పుకోవాల్సిన పనిలేదు. ప్రేమ వాత్సల్యం ఎరిగినవారు వారే గ్రహిస్తారు. ఎన్ని కన్నీళ్ళు కుమ్మరించిన మాట చేసిన గాయం మానదు.. అయినా వారినీ క్షమించాలి.

ఉమర్ ఖయ్యామ్ రుబాయీ కి చలం తెలుగు అనువాదం చూడండి.

“భరించే నీక్షమ నాకండగా వుండగా
నా పాపభారాన్ని చూసి నాకేం భయంలేదు.
నా చరిత్ర ఎంత నల్లనిదైనా
నీ కరుణ నన్ను కడిగి శుభ్రంచేస్తే
నీ సమక్షంలో నిలవడానికి నేను జంకను”.
ఇలా అని మనం భగవంతుని ముందే కాదు మన వారి వద్ద అన్నాము అనిపించుకోవడానికి అభిజాత్యం ప్రదర్శించవద్దు. గంగ లాగ పొంగి వచ్చి యమునలా సంగమించేదే ప్రేమ. ప్రేమించడానికి ఒక సాప్ట్ కార్నర్ వుంటుంది ప్రతి ఒక్కరిలో. దాన్ని వాడండి శత్రువుల హృదయాన్ని కుడా గెలుచుకొండి. ఎందుకంటే ఈ భూమి మీద ఇంకా ఎంతకాలం ఉంటామో మరలా మానవులు గా ఈ విచక్షణతో పుడతామో లేదో తెలియదు. కాబట్టి ఈ చిన్ని జన్మలో ఇన్ని కల్మషాలు మనకు ఎందుకు? ఆలోచించండి? కుదిరితే ఒక పులకరింపు... లేకపోతే ఒక పలకరింపు......

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

నిగ్రహంతోనే అనుగ్రహం

నిగ్రహంతోనే అనుగ్రహం

మనిషికి మనో నిగ్రహం అవసరం. దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అవసరం. కళ్లు, చెవులు, ముక్కు, నోరు జ్ఞానేంద్రియాలు. మానవునికి ప్రపంచం ఏమిటో తెలుసుకోవడానికి ఉప యోగపడే సాధనాలు ఇవి. అలాగే కాళ్లు, చేతులు కర్మేంద్రియాలు. ఇవి మనం కోరుకున్న వాటిని పొందడానికి పని చేసే పరికరాలు. ప్రకృతిలో అందమైన దృశ్యాలను చూడటానికి కళ్లు ఆరాట పడతాయి. శుభవార్తలను, మంచి మాటలను వివడానికి చెవులు ఇష్టపడతాయి. అలాగే, సువాసనలను, స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ముక్కు ఉపయోగపడుతుంది. నాలుకకు రుచులు అంటే అత్యంత ప్రీతి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు ఎల్లప్పుడూ లోబడి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహంతోనే ఇవి అదుపులో
ఉంటాయి. అందుకే మనిషికి ఇంద్రియ నిగ్రహం అవసరం. మనం ఇంద్రియాలకు లోబడి ఉండకూడదు. ఇంద్రియాలే మన ఆధీనంలో ఉండాలి. అలా ఉండాలంటే, మన సును ముందుగా మన అదుపులో ఉంచు కోవాలి. మనసును నిలకడగా ఉంచడం అంత సులువు కాదు. అది చూసిన ప్రతి దానినీ పొందాలని తాపత్రయపడుతుంది. ఇంద్రియాల మీద నిరంతరం అది ఒత్తిడి తెస్తుంటుంది. దాంతో అనేక రకాల ఇబ్బందులు తలెత్తు తుంటాయి. ఈ సంఘర్షణే మానసిక అశాంతికి దారితీస్తుంది.

మనో నిగ్రహం పొందాలంటే..
మనో నిగ్రహం పొందాలంటే మనసును దైవ ధ్యానం మీద లగ్నం చేయాలి. అర్థం లేని ఆలో చనలు మనసును చుట్టుముడితే ఇష్టదైవ నామాన్ని జపించాలి. అస్టమాను గుడికి వెళ్లడానికి కుదరకపోయినా బాధపడాల్సిన పనిలేదు. మనసు భగవంతుడి మీద నిమగ్నం చేయగలిగితే చాలు. మనసు నిర్మలంగా ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మనో నిగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా బాహ్య ప్రపంచంలో తిరగడం వల్ల, మంచి పుస్తకాలు చదవడం వల్ల, మంచి మాటలను వినడం వల్ల, మంచి వ్యక్తులతో, సత్సంగాలు చేయడం వల్ల మనకు తెలియని అనేక విషయాలు తెలిసి వస్తాయి. తెలియని కొత్త కొత్త మంచి విష యాలను తెలుసుకోవడమే జ్ఞానం. తెలివైన
వాళ్లు దేనికీ భయపడరు. ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా చేయగలుగుతారు. అంతేకాక ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించగలుగుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత కూడా ఉండనే ఉంది కదా!. దీనిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథులను, స్నేహితులను ఆదరించి వారితో ఏ విధమైన పరుష వాక్యాలు పలకకుండా మంచిగా మాట్లాడాలి. అంతేగాని చీటికీమాటికీ అబద్ధాలు, లేనిపోని గొప్పలు మాట్లాడకూడదు. మనం ఆత్మీయంగా మాట్లాడితే అందరూ మనం అంటే ఇష్టపడతారు. గౌరవిస్తారు. మన మాటకు విలువ ఇస్తారు. కోరికలకు పగ్గాలు వేయాలి..
అలాగే, కోరికలు అనంతాలు. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కొన్ని కోర్కెలు తీర్చు కోవచ్చు. మరికొన్ని తీర్చుకోవడానికి వీలు కాదు. ఆ కోర్కెలు ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే పరిష్కారం లభించకపోగా, కుటుంబంలో, మనసులో లేనిపోని అలజడులు కలుగుతాయి. మనసులో అలజడి రేగితే భార్యాభర్తలు, పిల్లలతో ఆనందాన్ని పంచుకోలేం. వారితో సంతోషంగా ఉండలేం. స్నేహితులతో సరిగా ఉండలేం. ఏ పనీ మనసు పెట్టి చేయలేం. దేనిపైనా శ్రద్ధ చూపలేం. నిద్రపట్టదు. మనసు గతి తప్పుతుంది. ఇన్ని బాధలు పడుతూ కోర్కెలు పెంచుకోవడం అనేది అవివేకం. అధికమైన, తీరని కోర్కెలు కలగకుండా మనసుసు అదుపులో ఉంచుకోవాలి. అందుకు దైవ ధ్యానమే సరైన మార్గం. జపం ఎంత ఎక్కువగా చేస్తే మనసులోని కోర్కెలు అంత త్వరగా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా, బుద్ధి నిలకడగా ఉంటుంది. రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, తలనొప్పులు మొదలైన రోగాలు కూడా దరిచేరవు.

ఉదయాన్నే లేస్తే ఎన్నెన్నో మార్పులు..
నేటి యాంత్రిక జీవితాలలో రాత్రి చాలా పొద్దుపోయే వరకు మెలకువగా ఉండటం, తెల్లవారాక ఎంత ఆలస్యంగా నిద్రలేస్తే అంత శ్రమపడ్డాం, అంత గొప్పవారం అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే ఎంత నష్టమో గమనించాలి. పిల్లలైనా, పెద్దవారైనా ఎవరైనా సరే తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. అది ఆరోగ్యదాయకమైన లక్షణం. తెల్లవారుజామునే నిద్రలేచి బయట తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల నక్షత్రాల కాంతి శరీరానికి మెరుపును ఇస్తుంది. వీచే చల్లని గాలి శ్వాసకోశాలను శుభ్రపరచడమే కాక రోజంతా ఆహ్లాదాన్ని ఇచ్చే మానసిక ఆనందాన్ని కలుగుచేస్తుంది. ఉదయించే సూర్యకిరణాలు శరీరంపై పడటంతో ఎటువంటి చర్మవ్యాధులు దరిచేరవు. చాలామంది తెల్లవారుజామునే లేవలేం, పని చేయలేం అంటారు. కానీ, మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు కదా! మనసు ఉంటే మార్గం ప్రతీ దానికీ ఉంటుంది. వారం రోజులు క్రమం తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేస్తే అదే అలవాటు అవుతుంది. చీకటితోనే లేస్తే దైవ ధ్యానం చేసుకోవచ్చు. పనులు చేసుకుని, పిల్లలను చదివించవచ్చు. హడావుడి లేకుండా స్కూళ్లకు పంపించి ఆరామముగా ఆఫీసులకు వెళ్లవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి రావడం వల్ల పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ధ్యానం (మెడిటేషన్‍) నేర్పడానికి అనేక కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఇంట్లో దైవ ధ్యానం చేయడానికి కుదరని వారు రోజూ ఏదో సమయంలో ఈ కేంద్రాలకు కానీ, గుడికి కానీ, ఖాళీ ప్రదేశాలకు కానీ వెళ్లి ధ్యానం చేయవచ్చు. లేదా ప్రశాంతంగా గడపవచ్చు. తద్వారా ఆరోగ్యానికి, మనసుకు స్వాంతన చేకూరుతుంది. వ్యాపకం లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఏదో ఒక పనితో సతమతం అయ్యే వారు ఈ పేరుతోనైనా బయటకు వస్తే బాహ్య ప్రపంచం గురించి తెలుస్తుంది. నలుగురితో పరిచయాలు పెరిగి అందరితోనూ ధైర్యంగా మాట్లాడగలుగుతారు. యువతరానికి కూడా ధ్యానం అనేది తప్పనిసరి. అందులో నేటి తరం వారికి అన్ని రంగాల్లోనూ పోటీ విసరీతంగా పెరిగి వారి మనసుపై ఒత్తిడి అధికమవుతోంది. కొందరు బలహీనులైన వారు ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఉదంతాలను మనం చూస్తున్నాం. అటువంటి సున్నిత మనస్కులు మానసిక ఆందోళన చెందకుండా నిదానంగా ఆలోచించి పోటీని తట్టుకుని, సరైన మార్గంలో పయనించాలంటే వారికి మనో నిగ్రహం చాలా అవసరం. ధ్యానం ద్వారా మాత్రమే దానిని పొందగలం. ధ్యానాన్ని ఒక సాధనగా చేసుకోగలిగితే కనుక మనం జీవితంలో చాలా సాధించగలం. .

హృదయంతో జీవించాలి..
ధ్యానం, ప్రశాంతత.. ఇవన్నీ సాధించడానికి ముందు మనం అసలు ‘హృదయం’తో బతకాలి. మనం జీవించడానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన సాధనం హృదయం. కానీ, దురదృష్టవశాత్తూ మనం హృదయం లేకుండానే బతికేస్తున్నాం. జీవులన్నిటిలో మనిషే ఉత్తముడు. అతనికి హృదయమే ప్రాణం. అక్కడే ఆలోచనలు.. అవి మంచివైనా, చెడ్డవైనా ప్రాణం పోసుకుంటాయి. మనలో ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటే మనం ఆ రకంగా రూపుదిద్దుకుంటాం. అటువంటి పవిత్ర హృదయ స్థానంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకుంటే మనం సాక్షాత్తూ భగవంతుడిలా మారిపోగలం. హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠించుకుంటే, మనకు జీవితంలో ఏ లోటుపాట్లూ రావు. ఒడిదుడుకులు ఉండవు. కాబట్టి మొదట హృదయంతో జీవించడం అలవాటు చేసుకోవాలి. అది మనలోనే ఉంది. దానిని గుర్తించి, దానిని దారిలో పెట్టుకోగలిగితే చాలు ఇక మన పయనమంతా పూలబాటే.

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

సత్యవ్రతుడు

సత్యవ్రతుడు

కొన్ని వేల సంవత్సరాల క్రితం సత్యవ్రతుడనే రాజు ఉండేవాడు. ఆయన గుణగణాలు, పరిపాలనా దక్షత తెలియనివారు లేరు. ఆయన ధర్మదీక్ష, కీర్తి ప్రతిష్ఠలు దేవలోకం వరకు వ్యాపించి ఉండేవి.

అటువంటి ఆ మహారాజు ఒకనాటి రాత్రి రెండవజామున రాజ్యపు దక్షిణద్వారం వద్ద పచార్లు చేస్తున్నాడు. ఆ సమయంలో ఎవరో ఒక దేవతా స్త్రీ మూర్తి రాజ్యపు ప్రధాన ద్వారాన్ని దాటుకొని పోతూ కనబడ్డది ఆయనకు.

ఆయన ఆమెను ఆపి, గౌరవంగా "ఎవరు తల్లీ, నువ్వు? ఇంత రాత్రి సమయంలో రాజ్యాన్ని విడిచి ఎందుకు వెళ్తున్నావు?" అని అడిగాడు.

"రాజా, నేను ధనలక్ష్మిని. ఏ ఒక్కచోటా ఆగటం నా స్వభావంలో లేదు. అయినా ఇన్నేళ్లుగా నీ రాజ్యంలో నేను ఆగిపోయాను. ఇక ఆగను. వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నది ఆమె.

మహారాజు "తల్లీ! నిన్ను ఆపటం నావల్ల ఎలాగూ కాదు. సంతోషంగా వెళ్లు" అని ఆమెను సాగనంపాడు.

ఆమె అటు వెళ్లిందో, లేదో- ఇటుగా ఒక దివ్య పురుషుడు బయలు దేరాడు బయటికి. "అయ్యా! మీరెవరు? ఎటు వెళ్తున్నారు?" అని అడిగాడు రాజు, ఆయనను.

"రాజా నేను దానాన్ని. ధనం ఉన్నచోట దానం ఉంటుంది. ధన సంపద లేని నీ రాజ్యం ఇప్పుడు నాకు న్యాయం చేయజాలదు. నేనూ ధనాన్ని అనుసరించాల్సిందే. నీ రాజ్యాన్ని విడిచి వెళ్లేందుకు నన్ను అనుమతించు" అన్నాడు ఆ దివ్య పురుషుడు.

"సంతోషంగా వెళ్లండి" అని సాగనంపాడు మహారాజు.

అంతలోనే మరొక దేవతామూర్తి బయటికి పోతూ కనబడింది ఆయనకు. "తల్లీ! నువ్వెవ్వరు? ఎందుకు నన్ను వదిలి పోతున్నావు?" అడిగాడు రాజు.

"రాజా! నేను కీర్తికాంతను. ధన సంపత్తీ, దాన సంపదా లేని ఈ రాజ్యంలో నేను ఉండజాలను. నన్ను వెళ్లనివ్వు" అన్నది ఆ దేవతామూర్తి.

"సరేనమ్మా! నీ ఇష్టం వచ్చినట్లే కానివ్వు." అన్నాడు రాజు.

ఇంకొంతసేపటికి మరొక దివ్య మూర్తి బయటి దారి పట్టింది. రాజుగారు అడిగారు "స్వామీ! మీరెవ్వరు?" అని.

"రాజా! నేను శుభాన్ని. సంపదా, దానం, కీర్తీ లేని ఈ రాజ్యంలో నేను ఉండీ ప్రయోజనం లేదు. అందువల్ల నేను వారిని అనుసరించి పోవటమే మంచిది. నన్ను క్షమించి, పోనివ్వు" అన్నాడా దివ్యమూర్తి. రాజుగారు శుభాన్నీ సాగనంపారు.

'ఇంకా ఏమి చూడాల్సి వస్తుందోనని రాజుగారు విచార పడుతుండగానే మరో దేవతా మూర్తి బయటికి పోతూ కనబడ్డది. "తల్లీ! నువ్వెవ్వరు?" అని అడిగాడు సత్యవ్రతుడు.

"రాజా, నేను సత్య లక్ష్మిని. ధనలక్ష్మీ, దాన లక్ష్మీ, యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఇక నీకు నా అవసరం ఉండదని, నేనూ పోనెంచాను. నాకూ అనుమతినివ్వు" అన్నది సత్యం.

రాజుగారు వెంటనే ఆమె పాదాలపై పడి " తల్లీ! నీకు ఆ అవసరం ఏమున్నది? వేరే ఏ సంపదనూ నేను కోరలేదు- వారంతట వారువచ్చారు; వారంతట వారు వెళ్ళారు. కానీ తల్లీ, నేను నీ పూజారిని. సత్యాన్ని కోరి, సత్యం కోసమే జీవించే నన్ను వదిలి వెళ్లటం నీకు భావ్యం కాదు. నన్ను వదిలి వెళ్ళకు!" అన్నాడు.

సత్యం సంతోషపడింది. సరేలెమ్మన్నది. తిరిగి రాజ్యంలోకి వెళ్లిపోయింది.

రాజుగారు నిట్టూర్చారు. సూర్యోదయం కాబోతున్నది. రాజుగారు కూడా వెనుదిరిగి తమ మందిరానికి పోబోతున్నారు- అంతలోనే ఒక దివ్యమూర్తి- ఈమారు ఆమె ప్రధాన ద్వారం గుండా రాజ్యంలోనికి ప్రవేశిస్తూ కనబడింది; చూడగా, ఆమె ధనలక్ష్మి! "ఏం తల్లీ! మళ్ళీ వస్తున్నావు?" అడిగారు రాజుగారు.

"అవును సత్య వ్రతా! సత్యం లేనిచోట నేనూ ఉండలేను. అందుకే తిరిగి వస్తున్నాను" అన్నది ధనలక్ష్మి.

అంతలోనే దానలక్ష్మీ, ఆపైన యశోలక్ష్మీ, సౌభాగ్యలక్ష్మీ ఒకరి తరువాత ఒకరు తిరిగి వచ్చారు రాజ్యానికి.

మళ్లీ రాజ్యం కళకళలాడింది.

ఉపనిషత్తులలోని ఈ కథ, సత్యం ఎంత గొప్ప సంపదో వివరిస్తున్నది. అన్ని విషయాల్లోనూ నిజం చెప్పగల్గటం అన్నది నిజంగానే గొప్ప సంపద. ప్రపంచంలో మనకు అబద్ధమే రాజ్యమేలుతున్నట్లు అనిపిస్తుంది కానీ, అంతిమంగా నిలిచేది సత్యమే, సందేహం లేదు.

Source - Whatsapp Message

ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు వస్తే ఏమి చెయ్యాలి?

Happy morning to all masters👏🏻👏🏻👏🏻💐

🐥ధ్యానంలో విపరీతమైన ఆలోచనలు వస్తే ఏమి చెయ్యాలి?🐥

🐥ముందుగా ఆలోచనలను గురించి కొంత స్పష్టత తెక్చుకుందాం:

🐭మొట్టమొదటగా, ఆలోచనలు చెడ్డవి కావని తెలుసుకోవాలి. ఆలోచనలు లేకపోతే జీవితమే లేదు. ఆలోచనతోనే మనిషి మనుగడ సాగేది. మన మనుగడ సాగడానికి మనకు మంచి ఆలోచనలు అవసరం.

🐭అయితే ఈ ఆలోచనల్లో నకారాత్మకమైన ఆలోచనలు, సకారాత్మకమైన ఆలోచనలు, దివ్యమైన ఆలోచనలు అన్నీ ఉంటాయి.మన ఆధునిక మానసిక శాస్త్రజ్ఞుల పరిశోధన ప్రకారం, మనిషికి ప్రతి రోజూ సుమారు 70, 000 కు పైగా ఆలోచనలు వస్తాయి. అందులో అరవై శాతం పనికిరాని నకారాత్మకమైన ఆలోచనలే ఉంటాయి. ఇవి మన శక్తిని పీల్చేస్తాయి. నకారాత్మకమైన ఆలోచనలు చాలా బరువైన ఆలోచనలు.

🐭ఈ ఆలోచనలన్నీ పుట్టేది మనసులోనే. అందుకే మనసును క్రమశిక్షణలో పెట్టడం అవసరం. దానికి ద్యానం తప్ప మరో మార్గం లేదు.

🐭అయితే ఈ ఆలోచనలు కళ్ళు తెరచి ఉన్నప్పుడు కంటే కూడా మూసుకున్నప్పుడే ఎక్కువగా వస్తున్నట్లు అనిపిస్తాయి. కాని ఇది వాస్తవం కాదు. కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా అలాగే వస్తుంటాయి కాని మనం లోపలికి చూడకపోవడం మూలాన లేనట్లనిపిస్తాయి.

🐭మన ఇంద్రియాలన్నీ బయట వస్తువులను గమనించడమే అలవాటు మూలాన, లోపలికి అంతరంగ లోకి చూడటం అలవాటు లేకపోవడం మూలాన కూడా ఈ ఆలోచనలు భంగపరుస్తున్నట్లుగా అనిపిస్తుంది.
🐭ధ్యానం చేసినప్పుడు కళ్ళు మూసుకుంటాం కాబట్టి, మిగిలిన అన్ని ఇంద్రియాలను మూసివేస్తాం కాబట్టి అవి ధ్యాన భంగం విపరీతంగా చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

🐭మనం కళ్ళు మూసుకొని హృదయంలో దివ్యమైన వెలుగు ఉందన్న ఆలోచనతో కూర్చున్నప్పుడు, అన్ని రకాల ఆలోచనలు దండేత్తి రావచ్చు. వాటిపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే, వాతంతట అవే రాలిపోతాయి.

🐭ఆలోచనలకు స్వతహాగా వాటికి శక్తి ఉండదు. మనం వాటిపై దృష్టి సారించినప్పుడే వాటికి మనం బలం ఇచ్చినవాళ్ళమవుతాం. అందుకే వాటిని పట్టించుకోకుండా ఉంటే అభ్యాసం చేయగా-చేయగా వాటంతట అవే రాలిపోతాయి. కొన్ని రోజులకు బాగా తగ్గిపోతాయి.

🐭వాటిని పిలువకుండా వచ్చిన అతిథులుగా భావించాలి. అవే తగ్గిపోతాయి, అంటారు. నిర్లక్ష్యం చేయడమే దీనికి ఏకైక ఆయుధం.

🐭ఆలోచనలతో పోరాడవద్దు, ఆపే ప్రయత్నం చేయకూడదు; రానివ్వండి, కాని వాటిని పట్టించుకోకండి. ఇది అభ్యాసం వల్ల కొన్ని రోజుల్లోనే పట్టు వస్తుంది. అభ్యాసం చాలా చాలా చాలా అవసరం..
💐👏🏻💐👏🏻💐👏🏻💐
మీ...పి.సారిక

Source - Whatsapp Message

Saturday, April 3, 2021

మనిషి జీవితం...జీవనం...నేటి ప్రవర్తన.

మనిషి జీవితం...జీవనం...నేటి ప్రవర్తన.

తల్లి కడుపులోనే తంటాలు...
నవమాసాల ఇరకాటాలు...

అమ్మ వేదనతో భూమిని చేరినప్పుడు ...
మాట లేదు, నడక రాదు...

అమ్మ చెబితేనే నాన్న తెలుసు...
సహోదరుల సంగతే తెలియదు...

కులమంటే ఏమిటో...
మతమంటే ఏలాంటిదో...
డబ్బులంటే ఎందుకో...
తెలియనే తెలియవు...

చనుబాలతో, ప్రకృతి అందించిన...
ఆహర,పానీయాలతో...
దేహము పెరుగుతూ...
నడక వచ్చింది,మాటలు తెలిశాయి...

ధనం,అధికారము,హోదా...
ఎక్కువ,తక్కువనే తారతమ్యాలు...
ఎక్కడ సృష్టించ బడ్డాయో తెలియదు ...

ఎవ్వరి స్వలాభాల గురించో...
తెలుసు కోవాలనే ఆశ లేదు...
అనుభవించాలనే ఆతృత రాదు...

మరి నేటి కొద్ది మంది కృత్రిమ జీవనాలను చూస్తే...
బ్రతుకులు భారం అవుతున్నాయి...

ఈనాటి మనిషి ఇసుకలో సౌదం చూస్తాడు. రాయిలో శిల్పం చూస్తాడు. లోహంలో ఆభరణం చూస్తాడు. ఆకులో ఔషధం చూస్తాడు. అద్దంలో అందం చూస్తాడు. కానీ సాటి మనిషిలో మాత్రం, ద్తెవాన్ని చూడడు.

మరి ఇది తెలియాలంటే ఒక్కటే మార్గం. థ్యానం చేయాల్సిందే!
👏👏👏👏

Source - Whatsapp Message

పలకరించండి.

పలకరించండి. మనుషులకు మాత్రమే వున్న వరమిది. మానవీయ సంబంధాల వారధి. మనసు వ్యాకులతల పారద్రోలు మంత్రమిది.

పలకరింపులు లేని సమాజం సమూహం ఒట్టి నిర్జీవంగా గోచరిస్తాయి. ఒక్క పలకరింపుతో నూతనోత్తేజమేదో తొంగి చూస్తూంటుంది. పలకరింపు అనేది మనిషితనానికి, కలిసి బతికే మనిషితనానికి నిదర్శనంగా నిలుస్తుంది.

నేటి అత్యంతాధునిక అనేక సౌకర్యాల, విలాసాలననుభవిస్తున్న కాలంలో మనం పోగొట్టుకుంటున్న గొప్ప మానవాంశం పలకరింపు. ఇది చాలా చిన్న విషయంగానే అనిపించవచ్చు. ఒక్క చిన్న మాటే పలకరింపై వెలగవచ్చు. కానీ ఎన్ని డబ్బులు పోసినా దొరకని అమూల్య సంపద పలకరింపు.

ఒక ప్రాణాన్ని నిలబెట్టవచ్చు. ఒక బాధని తొలగించవచ్చు. ఒక ఆలోచనను రేకెత్తించవచ్చు. ఒక ఆశను చిగురింపచేయొచ్చు. మనసు గాయాలను, గాట్లను మాన్పించవచ్చు !

పలకరింపుకు అంత శక్తి వుంది. పలకరించడమనే సమస్య నేడు ఇండ్లల్లో వృద్ధులు విపరీతంగా ఎదుర్కొంటున్నారు. తమ జీవితమంతా కుటుంబం కోసం, పిల్లల కోసం వెచ్చించి, వృద్ధాప్యంలో ఏమీ చేయలేని స్థితిలో ఇంట్లో వున్న పెద్దల్ని పనికిరాని వస్తువుల్ని చూసినట్లు చూస్తున్నారు. వారి శ్రమఫలమే వర్తమానపు మన కళ అని మరిచి పోతున్నారు. అట్లాంటి పెద్దలను ఆప్యాయంగా పలకరించాలి.

ఒక మాట మాట్లాడాలి. ఒక్కసారి పలకరింపుతో వాళ్ళను కదిపి చూడండి. బండెడు అనుభవాలను మీ ముందుంచుతారు. ఆ అనుభవాలు ఇప్పటికీ మనకు దివిటీలా పని చేస్తాయి.

పలకరింపులు పెద్దలకు ఆరోగ్యాన్నిచ్చే మందులా పని చేస్తుంది. పెద్దలనే కాదు ఎవరినైనా పలకరిస్తూ వుండాలి. దాంతో స్నేహం, బంధం, ప్రేమ, అనుబంధం పెరుగుతూ వుంటుంది. ఇవి కేవలం మనుషులు సాధించేవి.

ప్రముఖ కథా రచయిత్రి ఇల్లిందల సరస్వతీ దేవిగారు తీయని పలకరింపు అని ఒక కథను రాశారు. అందులో ఒక రిటైర్డు పెద్దాయన, పలకరింపులు లేక పడుతున్న బాధను చక్కగా చిత్రించారు. ''నేను డబ్బులు బాగా సంపాదిస్తూ ఉద్యోం చేస్తున్నపుడు నన్ను చాలా మందే పలకరించేవాళ్ళు. ఉద్యోగ విరమణ చేసి, ఆదాయం తగ్గిపోయిన క్షణం నుంచి పనికిరాని వాడిలా పలకరింపుకు నోచుకోలేక వృద్ధాశ్రమం చేరాను'' అని పాత్రలో వివరిస్తుంది.

డబ్బులు మాత్రమే ముఖ్యంగా మారిన నేటి తరాలకు మనుషుల మధ్య సంబంధాలు అప్రధానమై పోయి ఈ పరిస్థితులు దాపురించాయి. ఇది లాభాల ఆర్జన కోసం సరుకుల మీద వ్యామోహాన్ని పెంచిన సాంస్కృతిక దాడి ఫలితం. దీన్ని మార్చకపోతే మనమూ ఒకప్పటికి బాధితులుగా మిగులుతాం.

లాక్‌డౌన్‌ మూలానా ఇంట్లోనే అందురున్నప్పటికీ వారి మధ్య దూరాలేవీ తగ్గలేదు. మరింత పెరుగుతూనే వున్నాయి. ఎవరి చేతుల్లో వాళ్ళు సెల్‌ఫోన్‌లతో యియర్‌ ఫోన్లతో తమలో తామే, తమకు తామే గడిపేస్తున్నారు. కుటుంబ సంబంధాల్లో విపరీత దూరాలు పెరుగుతున్నాయి.

మనసుల్లో దాగిన భావాలు, అభిప్రాయాలు పలకరించి అడిగితేనే తెలుస్తాయి. తెలిసినపుడే వాటిని సరిచేయడమో, చర్చించి మనం సరికావడమో చేయవచ్చు. కొన్ని అపోహలూ తొలిగిపోవచ్చు. కుటుంబంలోనే కాదు ఇంటి పక్కన వాళ్ళను, దూరానవున్న మిత్రులను ఖాళీ సమయం దొరకగానే ఒకసారి పలకరించండి.

కరోనా బాధితులను, దాని వల్ల భయపడుతున్న వాళ్ళను పలకరించాలి. పది మందితో గల సంబంధమే జీవితం.

నాకు తెలిసిన ఒక పెద్దాయన అన్ని హంగులు ఉండి కూడా, తాను, తన భార్యాబిడ్డలు, సన్నిహితులతో ఏసి లాంటి సకల సౌకర్యాలు అనుభవిస్తూ, వృద్ధురాలు తన తల్లిని మాత్రం ఔట్ హౌస్ కొట్టుగదిలో ఉంచాడు. తనని పలకరించితేనే భార్య అనుగ్రహానికి దూరమైపోతానేమో అని భావించి, దూరంగానే ఉంచిన ప్రబుద్ధుడు.

''నాకేమీ పెట్టాల్సిన అవసరం లేదు. నేనేమీ అడగటమూ లేదు. రోజు ఏం చేస్తున్నావమ్మా, ఏం తిన్నావు, బాగున్నావా'' అని నన్ను అడిగితే చాలని ఎనభై యేండ్ల తల్లి నాతో చెబుతూ దు:ఖించింది. అంటే పలకరింపుల విలువేమిటో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆమె పోయిన తరువాత అతను కార్చిన మొసలికన్నీరుకి ఏ అవార్డు ఇవ్వొచ్చో అర్థం కాలేదు !

అందుకే.. పలకరించండి. పలుకులేమీ బంగారం కాదు. మనిషి మంచి తనానికి ఆనవాళ్ళు !

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

నీ జీవితం లో నిన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయాలనీ చూడకు ఎందుకంటే నమ్మకం ప్రాణం లాంటిది ఒక్కసారి నమ్మకం పోతే మళ్ళీ తిరిగి రాదూ .

జీవితం అంటే మనం చనిపోయేంతవరకూ బ్రతికి ఉండటం కాదు పది మంది మనసులలో పది కాలాల పాటు జీవించి ఉండటమే జీవితం .

కన్న వాళ్ళ మీద కొడుకుల కంటే కూతుర్లకే అనురాగం ఎక్కువ ఎందుకంటే కొడుకులు ఆస్తులు పంచుకుంటే కూతుర్లు మాత్రం అలా కాదు అనురాగాన్ని పంచి ఇస్తారు .

మనిషికి కాలం విలువ తెలుసు మనిషికి డబ్బు విలువ తెలుసు మనిషికి స్వేచ్ఛ విలువ తెలుసు మనిషికి బంధాల విలువ తెలుసు మనిషికి ప్రాణం విలువ తెలుసు , ఇవన్ని తెలిసిన మనిషికి ఇంకో మనిషి విలువ ఎందుకు తెలియడం లేదు ?

సంతోషం అనేది మనకు గొప్ప ఖజానా , ఈ ఖజానా సంపన్నంగా ఉన్న వారు భాగ్యవంతులు , ఏదో చేస్తేనే సంతోషం వస్తుంది అని బ్రమ పడకూడదు . మనం సంతోషంగా ఉండగలిగితే ఏదైనా సరే సాధిస్తామని అర్థం చేసుకోవాలి . మీరు సంతోషంగా ఉండంది మీ వద్దకు వచ్చిన వారికి కూడా సంతోషాన్ని పంచుతూ ఉండండి మనం ఎదుటి వారికి సంతోషాన్ని ఎంత పెంచుతామో అంత సంతోషం రెట్టింపు అవుతుంది మీకు . అందుకే ఎదుటి వారికి మనం సంతోషం పంచడమే అన్నింటికన్నా గొప్ప గుణం

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

సత్- చిత్- ఆనందం

సత్- చిత్- ఆనందం
తినడం, పనిచేయడం, నిద్రపోవడం... మనిషే కాదు- జంతువులూ చేస్తాయి. ఆహారం కోసం తిమింగిలం లాంటి సముద్ర జీవులు వందలు, వేల మైళ్ల దూరం ప్రయాణం చేస్తాయి. అడవి జంతువులు ఆహారం కోసం వేటలో ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాయి. జీవులు బతకడం, బతికి ఉండటం కోసం ఒక యుద్ధమే చేస్తాయి.

మనిషి అందరికీ భిన్నమైనవాడు. మనిషిలో దివ్యత్వం ఉంది. అది కంటికి కనబడకుండా ఉంది. నిక్కచ్చిగా చెప్పాలంటే- అనుభవానికి మాత్రమే తెలుస్తుంది.

మొదటిది, మనిషిని కదిలించే చైతన్యం. మనిషిని సుఖస్థితిలో ఉంచే ఆనందం. ఇవే పరమావధిగా నిలిచే జీవనసత్యం. వీటిని కలిపి వేదాంత పరిభాషలో సత్తు, చిత్తు, ఆనందం అంటారు. వెరసి సచ్చిదానందం అని పేరు.

ఈ సచ్చిదానందం గొడుగు కిందకు సర్వజీవులూ వస్తాయి. ఇవి మనిషికి తప్ప ఏ ఇతర జీవికైనా అనుభవంలో ఉన్నా- జ్ఞానంలోకి రావు.

సచ్చిదానందంలో మునిగి తేలుతున్నాడు ఆ మహానుభావుడు అంటారు. సచ్చిదానందం ఉంటే ఆహారం అక్కరలేదా? సచ్చిదానందం మనసుకు ఆహారం. శరీరానికి ఆకలి తీర్చేది సాధారణ భోజనం. మనసు ఆకలిని తీర్చగలిగేది సచ్చిదానందమే!

మనిషి తన తల్లిదండ్రులు పెట్టిన పేరు మరిచిపోయినా, దైవం తనకు ప్రసాదించిన సహజదశ అయిన సచ్చిదానంద స్థితిని మరిచి పోకూడదు.

చైతన్యం లేకపోతే మనిషి చనిపోయాడంటారు. ఆనందం లేకపోతే మనసు చనిపోయిం దంటారు. సత్యమే లేకపోతే శూన్యంలో పడి కొట్టుకుంటున్నాడంటారు.

తాను ఎప్పుడూ సచ్చిదానంద స్వరూపమేనని తెలుసుకున్న తరవాత అతడిలోని దివ్యత్వం బయటకు వస్తుంది. లోకానికి అతడు పూజ్యనీయుడు అవుతాడు అంటారు స్వామి వివేకానంద.

పక్షికి, పాముకు, గొర్రెకు సత్యం గురించి తెలియదు. చైతన్య ఆనందాల గురించి అనుభవంలో ఉండవచ్చు. కాని వాటికి ఆ జ్ఞానం ఉండదు. అయినా అవి సచ్చిదానందం కారణంగానే బతుకుతున్నాయి. సచ్చిదానందం లేకుండా ప్రకృతి లేదు. ప్రపంచం లేదు. సచ్చిదానందమే విశ్వ సహజరూపం.

మనిషిలో సత్యం ఉంది. మనిషి సత్యం కాడు. మనిషిలో చైతన్యం ఉంది. మనిషి చైతన్యం కాడు. మనిషిలో ఆనందం ఉంది. మనిషి ఆనందం కాడు.

ఆధ్యాత్మిక ప్రయాణం మొత్తం పూర్తి చేసిన తరవాత మనిషి తాను తెలుసుకున్నది ఈ సత్య, చైతన్య, ఆనందం అనే మూడు విషయాలే. సచ్చిదానంద స్వరూపుడైన దైవాన్ని కొలుస్తూ, తానుకూడా సచ్చిదానందంలో ఒక భాగమని మనిషి గ్రహిస్తాడు. గ్రహించాలి.

నిజానికి సచ్చిదానందం పేరుతో ఉన్న మూడూ ఒకటే. వాటిని కలిపి ఉపనిషత్తులు ‘సత్యం’ అని చెబుతున్నాయి. ఆ సత్యాన్ని మనిషి గ్రహించాలి. సత్యం అనే చెట్టుకు మొలిచిన రెండు కొమ్మల్లాంటివి చైతన్య ఆనందాలు.

వీటి గురించి తెలుసుకోకపోతే మనిషి జీవించలేడా, తెలుసుకునే తీరాలా అంటే- తెలుసుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి. అజ్ఞానమయమైన జీవితాలు వెయ్యింటిని గడపవచ్చు. వాటిని అంతం చేసే జ్ఞాన జీవితం కావాలంటే సచ్చిదానందం గురించి తెలుసుకుని, అనుభూతి చెంది దివ్యమైన మానవుడనిపించుకోవాలి. ఆ లక్ష్యం సాధించడానికే మనం ఈ భూమ్మీద ఉన్నాం!

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message

మంచి మాట.. లు

ఆత్మీయ బంధుమిత్రులకు శనివారపు శుభోదయ శుభాకాంక్షలు, మా ఇంటి దైవం శ్రీ గుంటిఆంజనేయస్వామి వారు, తిరుత్తణి వల్లి దేవసేన సమేత శ్రీ సుభ్రమణ్యస్వామి వారు మరియు లక్ష్మి పద్మావతి సమేత శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ AVB సుబ్బారావు
శనివారం --: 03-04-2021
ఈ రోజు
AVB మంచి మాట.. లు
మనకు కొన్ని
పరిచయాలు మొదట్లో ఎంత సంతోషపెడుతాయో చివరికి అంతే బాధపెడతాయి . నా వల్ల ఎవరు బాధ పడకండి తెలియక మీ జీవితాల్లోకి వచ్చాను మిమ్ముల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి . నేను ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను .

మీరు
కంటితో చూడని , మీ చెవితో వినని వాటిని నమ్మొద్దు వాటిని ఇతరులతో అస్సలు పంచుకోవద్దు ఎందుకంటే అసూయాపరులు చెప్పే అబద్దాల వలన అనుబంధాలు చచ్చిపోతాయి .

నీ
నీడను చూసి నీ బలం అను కుంటే పొరపాటే ఎందుకంటే నీడ కూడా వెలుగును బట్టే తన తీరును మారుస్తుంది . మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి పిలుపు అవకాశాన్ని బట్టి తమ తీరు మారుస్తారు .

మన మానవ
జీవితాన్ని అర్థవంతంగా తీర్చిదిద్దుకోవడానికి కావాల్సిన ఒకే ఒక ఆయుధం ఆలోచన ఆలోచనలు మంచివైతే నీ పయనం మంచి వైపు ఆలోచనలు చెడువైతే నీ దారి చెడువైపు .

సేకరణ ✒️
మీ ... AVB సుబ్బారావు 💐🤝🙏

Source - Whatsapp Message

Thursday, April 1, 2021

కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన
➖➖➖✍️

కర్మలు చేయుటయందే నీకు అధికారం. ఫలితాన్ని ఎప్పుడూ కోరవద్దు. ఫలాలు కోరేవాడు పిసినిగొట్టు -

కృపణా ఫల హేతవః - అని అన్నారు.

ఇది భగవద్గీత సారమేగాదు. అది చెప్పిన భగవానుని జీవితసారం కూడా ఇదే...

1. దేవకీ వసుదేవులకు జన్మించినా తల్లిదండ్రుల వాత్సల్యాన్ని కోరలేదు.

2. నంద గోకులంలో వెన్న దొంగిలించినా తనకోసం కాదు, స్నేహితులకు కోతులకు పెట్టేవాడు.

3. కంసుని చంపినా రాజ్యాధికారాన్ని
కోరలేదు, ఉగ్రసేనునికే కట్టబెట్టాడు.


4. జరాసంధుని చంపించినా రాజ్యాన్ని అతడి కుమారునిడినే పట్టాభిషిక్తుని చేశాడు.

5. శిశుపాలుని వధించినా అతని కుమారుడు దృష్టకేతువుకే రాజ్యాన్ని అప్పగించాడు. నరకుని చంపి అతని కుమారుడు భగదత్తునినే రాజుగా చేశాడు.

6. దంతవక్త్రుని చంపి అతడి రాజ్యాన్ని అతని కుమారునికే ఇచ్చాడు

7. పౌండ్రక వాసుదేవుని చంపి అతని కుమారుడినే రాజ్యాభిషిక్తుని చేశాడు.

8. దుర్మార్గుడైన దుర్యోధనుడు సాయం కోరితే తన సైన్యం మొత్తాన్ని త్యాగం చేశాడు. నాకేం ఇస్తావు? అని అడగలేదు.

9. పాండవులకు ఎంతమేలు చేసినా, యుద్ధం లో ఎంత సాయపడినా తానేమీ ఫలితాన్ని కోరలేదు. రాజ్యంలో వాటా కోరలేదు.

10. రథాన్ని తోలేపని అప్పగించినా అప్పగించిన పనిని శ్రద్ధగా - సక్రమంగా నిర్వర్తించాడే గాని ఏ ఫలితాన్ని ఆశించలేదు. ఇంత చిన్నపనియా? అనలేదు

ఆయన ఏపని చేసినా, ఆ పనిని సక్రమంగా నిర్వర్తించటమే గాని కర్మఫలంపై ఏమాత్రం ఆసక్తి లేదు. దేనినీ కోరలేదు.

మరి మనం మాత్రం ఏఫలితం లేకుండా ఎందుకు కర్మలు చేయాలి అంటాం కదా?

సూర్యుడు వెలుగునిచ్చి నీవద్ద నుండి ఏం కోరుతున్నాడు?

వాయుదేవుడు గాలినిచ్చి నీ ప్రాణాన్ని నిలబెడుతూ ఏం కోరుతున్నాడు?

నదులు నీటిని ఇచ్చి దప్పిక తీర్చి నీనుండి ఏమి కోరుతున్నాయి?

భూమి నీకు ఆధారంగా ఉండి, పంటల నిచ్చి ఏమి కోరుతున్నది?

చెట్లు ఫలాలను, పుష్పాలను, నీడను ఇచ్చి ఏమి కోరుతున్నాయి?

చంద్రుడు చల్లదనాన్నిచ్చి ఏమి కోరుతున్నాడు?

మన సమస్త ఇంద్రియాలకు శక్తి నిచ్చి పరమాత్మ ఏమి కోరుతున్నాడు?

అందుకే కర్మణ్యే వాధికారస్తే మాఫలేషు కదాచన ఈ భగవద్ వాక్యాన్ని పాటించడానికి వీలైనంత కృషి చేద్దాం..✍️

(ఈ విషయాలను మన పిల్లలకు విశదంగా చెప్పనవసరముంది కదా?)
🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

Source - Whatsapp Message

KomalIAS-కోమల్ గనత్ర, కష్టాలు దాటుకుని సివిల్స్ ర్యాంకు సాధించి గృహహింస బాధితురాలనే ముద్ర చెరిపేసుకుని ఐఏఎస్ అధికారిగా కొత్త జీవితం మొదలుపెట్టిన కోమల్ ఎందరికో ఆదర్శం.

⬆️మాది గుజరాత్ లోని అమ్రేలీ జిల్లాలో ఉన్న సమర్ కుండ్ల. నాన్న టీచర్ . ఆ ప్రాంతంలో అమ్మాయిల పట్ల వివక్ష ఉన్నా మా నాన్న మాత్రం బాగా చదువుకోవాలని నన్ను ప్రోత్సహించేవారు. ఆయన టీచర్ కావడంతో ఇంట్లోనూ ఎప్పుడూ చదువు గురించే మాట్లాడేవారు. అందుకేనేమో నేనెప్పుడూ చదువులో ముందుండే దాన్ని. పదో తరగతి, ఇంటర్ గుజరాతీ మాధ్యమంలో పూర్తి చేశాక రాజ్ కోట్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చదివా. ఆ తరవాత మూడు వేర్వేరు యూనివర్సిటీల నుంచీ సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషల్లో బీఏ లిటరేచర్ పూర్తిచేశా. ప్రైమరీ టీచర్ ట్రైనిం!గ్ సర్టిఫికెట్ కూడా పొందా. అప్పటికే నాకు ఇరవై ఐదేళ్లు నిండాయి. మా బంధువులూ, ఇరుగుపొరుగు వారూ ఇంకా ఎన్నాళ్ళు చదివిస్తారు... మీ అమ్మాయికి పెళ్ళి చేస్తారా అసలు’ అని వెటకారంగా మాట్లాడేవారు. నేను పట్టించుకోకుండా సివిల్స్ పైన దృష్టి పెట్టా.

ఇంతలో మ్యారేజ్ బ్యూరో ద్వారా రాజ్ కోట్ నుంచి ఓ సంబంధం వచ్చింది. అబ్బాయికి న్యూజిలాండ్ లో ఉద్యోగం. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఆస్తులూ ఉన్నాయి. ‘నాకూతురువిదేశాల్లోస్థిరపడుతుంది’ అనుకున్నారు నాన్న. వెంటనే సంబంధం ఖాయం చేశారు. నేనూ న్యూజిలాండ్ జీవితాన్ని ఊహించుకొని ఎంతగానో మురిసిపోయా. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టా. అక్కడకు వెళ్ళి ఒక్కరోజైనా గడవకముందే- తమకిచ్చిన కట్నం_చాలదనీ అదనంగా మరికొంత కట్నం డబ్బూ, బైకూ, కారూ తీసుకురావాలనీ డిమాండ్ చేశారు. ‘నాన్నది చాలీచాలని జీతం. అవన్నీ ఇచ్చే స్తోమత ఆయనకు లేద’ంటే కొట్టేవారు. అన్నం పెట్టకుండా పస్తులుంచేవారు. అమ్మానాన్నలకు ఈ విషయాలు తెలిస్తే బాధ పడతారని చెప్పేదాన్ని కాదు. ఎంత తిట్టినా కొట్టినా పుట్టింటికి వెళ్లకుండా వాళ్లడిగినవి తేకుండా ఉండటంతో నన్ను వదిలించుకోవాలనుకున్నారు. ఒక రోజు రాత్రి... నన్ను ఇంటి బయట పడుకోమని, నేను నిద్రపోయాక కనీసం మాటమాత్రమైనా చెప్పకుండా ఇంటికి తాళం వేసుకుని నా భర్త తన తల్లిదండ్రులతో సహా న్యూజిలాండ్ వెళ్లిపోయాడు.

అతడిని శిక్షించాలని...

కాళ్ల పారాణి ఆరకముందే... పెళ్లైన పదిహేను రోజులకే కట్టుబట్టలతో పుట్టింటికి చేరాల్సి వచ్చింది. నేను ఒంటరిగా వెళ్లడం చూసి బెంగతో వచ్చాననుకున్నారు అమ్మానాన్నలు. నేను చెప్పిన విషయం విన్నాక గుండెలు బాదుకున్నారు. అమ్మ దిగులుతో మంచం పట్టింది. నా భర్త మనసు మార్చుకుని తిరిగి వచ్చాడేమోనని మధ్య మధ్యలో మా అత్తారింటికి వెళ్లి చూసి మూసిన తలుపుల ముందే కాసేపు కూర్చుని వచ్చేదాన్ని. ఒకరకంగా చెప్పాలంటే పిచ్చిదానిలా ప్రవర్తించేదాన్ని. ఎన్ని ప్రయత్నాలు చేసినా న్యూజిలాండ్ లో అతడి వివరాలు తెలియలేదు. అతడు నన్ను అంత అవమానకరంగా వదిలేసి వెళ్లిపోయాడనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయా. కట్నం కోసం, కారు కోసం నన్ను వదిలేశాడనే బాధకంటే మోసం చేశాడనే కసే నాలో పెరిగింది. ఎలాగైనా అతడిని వెతికి పట్టుకోవాలని మ్యారేజీ బ్యూరోని సంప్రదించా. ‘పెళ్లి కుదర్చడం వరకే మా పని’ అంటూ వారు మాతో మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేద్దామంటే పరువు పోతుందని అమ్మ గోల చేసింది. చివరికి న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మెయిల్ కూడా పెట్టా. నెలలు గడిచినా ఎవరూ స్పందించకపోయేసరికి గవర్నర్ జనరల్ కు లేఖ రాశా. ‘అతనెవరో తెలుసుకుంటాం’ అని తిరుగు సమాధానం పంపారు తప్ప ఏ చర్యా తీసుకోలేదు. నా నిస్సహాయ స్థితికి బాధేసింది. దాదాపు ఆరునెలలపాటు తిండీ, నిద్రా మరచి జీవచ్ఛవంలా బతికా. ఏడ్చీ ఏడ్చీ కళ్ళల్లో నీళ్ళు ఇంకిపోయాయి. రోజులు గడిచే కొద్దీ నాకు నేను సర్ది చెప్పుకోవడం మొదలుపెట్టా. అటకెక్కిన పుస్తకాలు బయటకు తీశా. చదువు గురించి తప్ప మరో ఆలోచన చేయదల్చుకోలేదు. కానీ నేను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది. భర్త మోసం చేయడంతో పుట్టింటికి తిరిగొచ్చిన కూతుర్ని ఆదరించడం తమ బాధ్యతని అమ్మానాన్నలు అనుకున్నా మా వదిన మాత్రం అలా అనుకోలేకపోయింది. నా వల్ల వాళ్ళ డబ్బు ఖర్చయిపోతోందని సాధించేది. ఇరుగుపొరుగు వాళ్లూ రకరకాలుగా మాట్లాడేవారు. ఎంత పట్టించుకోవద్దనుకున్నా ఏదో ఒక సందర్భంలో ఆ మాటలు మనసును నలిపేసేవి. ఆత్మాభిమానం చంపుకుని అలా పుట్టింట్లో ఉండటం సరికాదనిపించింది.

అందరికీ దూరంగా...

నా కాళ్ళమీద నేను నిలబడాలని టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశా. మా సొంతూరుకు యాభై కిలోమీటర్ల దూరంలోని భావ్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా ఉద్యోగమొచ్చింది. ఒంటరిదాన్ని కావడంతో ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ఓ స్టూడెంట్ తల్లిదండ్రులకు నా గురించి అంతా చెప్పి ఎలాగైనా ఇల్లు అద్దెకి ఇప్పించమని అడిగా. వాళ్లింట్లోనే ఓ గది అద్దెకిచ్చారు. పగలంతా టీచర్ గా పని చేస్తూ సివిల్స్ సాధన మొదలుపెట్టా. కానీ ఆ పల్లెటూళ్ళో ఇంటర్నెట్ , స్మార్ట్ ఫోన్లూ, ఇంగ్లిష్ పత్రికలూ, ల్యాప్ టాపులూ... ఏవీ అందుబాటులో ఉండేవి కాదు. నాకు టీచర్ గా వచ్చేది ఐదు వేల రూపాయల జీతం. అది నెల గడవడానికి తప్ప పుస్తకాలు కొనుక్కోడానికి సరిపోయేది కాదు. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు తెలిసినవాళ్లు అహ్మదాబాద్ లో ప్రభుత్వం సివిల్స్ సాధించాలనుకునే ఔత్సాహికులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న సర్దార్ పటేల్ అకాడమీ గురించి చెప్పారు. అక్కడకు వెళితే వారాంతంలోనూ శిక్షణ ఇస్తామన్నారు. దాంతో ప్రతి శనీ, ఆదివారాలు వెళ్లి ట్రైనింగ్ తీసుకోవాలని చేరిపోయా. కానీ భావ్ నగర్ నుంచి నాలుగు బస్సులు మారి నూట డెబ్భై కిలోమీటర్లు ప్రయాణం చేసి అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.

ఈ క్రమంలో నేను ఇంటికి చేరుకునే సరికి అర్ధరాత్రి అయ్యేది. ఊళ్ళో చాలామంది ‘ఈ అమ్మాయి చదువుకే వెళుతుందో ఇంక దేనికన్నా వెళుతుందో’ అంటూ సూటిపోటి మాటలనేవారు. ఉబికివచ్చే కన్నీళ్ళను గుండెల్లోనే అదిమిపట్టి చదువు మీదే దృష్టి పెట్టేదాన్ని. ఒక్కోసారి ఒంటరితనాన్ని తట్టుకోలేకపోయేదాన్ని. నా జీవితమే ఇలా ఎందుకైందని వెక్కివెక్కి ఏడ్చేదాన్ని. మానసికంగా శారీరకంగా ఒత్తిడి తట్టుకోలేక నాల్రోజులు విశ్రాంతి తీసుకోవాలనిపించేది. కానీ ఒక్కపూట స్కూలు మానేసినా జీతం రాదు. అందుకే ఆరోగ్యం పాడైనా స్కూలుకెళ్లడం కానీ, కోచింగుకు వెళ్ళడం కానీ మానలేదు.

నాలుగు ప్రయత్నాలు చేసి...

2009లో మొదటిసారి యూపీఎస్ సీ ప్రవేశ పరీక్ష రాశా. ఉద్యోగం, ట్రైనింగ్ కోసం ప్రయాణాల వల్ల అంత మెరుగ్గా ప్రిపేర్ కాలేదనిపించింది. ఎంపికవుతానన్న నమ్మకం లేకపోయింది. అనుకున్నట్టుగానే అయింది కానీ నేను నిరుత్సాహపడలేదు. అదొక అనుభవం అనుకున్నా. రెండోసారి మాత్రం పట్టుదలతో రాశా. ర్యాంకు వస్తుందని ఆశపడ్డా. కానీ మళ్ళీ నిరాశ తప్పలేదు. చాలా బాధనిపించింది. పైగా నా గురించి తెలిసిన వాళ్లు ఫలితాలొచ్చిన ప్రతిసారీ ‘ఐఏఎస్ అంటే అంత ఈజీనా... నీకు ఎప్పుడు రావాలీ...’ అంటూ హేళనగా మాట్లాడేవారు. ఆ మాటలకి బదులు చెప్పి తీరాలని 2011లో మూడోసారి మరింత కష్టపడి పరీక్ష రాసినా ర్యాంకు రాలేదు. ఫలితాన్ని అంత తేలిగ్గా జీర్ణించుకోలేకపోయా. అమ్మ ఒళ్లో తల పెట్టుకుని ఏడవాలనిపించింది.

కానీ, ఓడిపోయి కన్నీళ్లతో ఆ గుమ్మం తొక్కి నలుగురిలో పలచన కాకూడదని నన్ను నేనే సముదాయించుకున్నా. చివరి ప్రయత్నంగా మరొక్కసారి పరీక్ష రాసి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నా. మూడు ప్రయత్నాల్లో చేసిన తప్పులేంటో విశ్లేషించుకున్నా. ప్రిపరేషన్ పరంగా బలాలూ, బలహీనతల్ని జాబితాగా రాసుకున్నా. బలాలు మరింత పెంచుకుంటూ బలహీనతల్ని తగ్గించుకునే ప్రయత్నం చేశా. కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోయేదాన్ని. కొన్నిసార్లు ఆ కాస్త నిద్ర కూడా పట్టేది కాదు. పరీక్షకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి ఒక యుద్ధమే చేశా. 2012లో పరీక్ష రాశా. ఈసారి అంచనా తప్పలేదు. 591వ ర్యాంకు వచ్చింది. ఐదేళ్ళపాటు నేను పడిన కష్టం గుర్తొచ్చి కన్నీళ్ళు ఓ పట్టాన ఆగలేదు.
ర్యాంకు ఆత్మవిశ్వాసాన్నిచ్చింది...
అమ్మానాన్నా ఇంటికి రమ్మన్నారుగానీ నేను అట్నుంచి అటే ముస్సోరీ శిక్షణ కేంద్రానికి వెళ్లా. ఆ శిక్షణ పూర్తిచేసుకున్నాకే- ఐదేళ్ల తర్వాత- అమ్మావాళ్లింటికి వెళ్లా. నా గురించి తెలిసి మా ఊళ్లో వాళ్లంతా వచ్చారు. ఒకప్పుడు విమర్శించిన వారే మా పిల్లలకి నువ్వే ఆదర్శమంటూ తెగ మెచ్చుకున్నారు. అప్పటి వరకూ భర్త వదిలేసిన మహిళగా బయటకు రావాలంటే ఏదోలా అనిపించేది. సివిల్స్ సాధించాక అలాంటి ఆలోచనలన్నీ పోయాయి. అందరూ గౌరవంగా చూస్తున్నారు.

శిక్షణ అయ్యాక దిల్లీలో డీఆర్ డీవో(డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ )లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్నా. ప్రస్తుతం డీఆర్ డీవో డైరెక్టర్ హోదాలో ఉన్నా. ఈ ఆరేళ్లలో అమ్మానాన్నల అప్పులన్నీ తీర్చా. అన్నయ్య మంచి ఉద్యోగంలో స్థిరపడేలా చూశా. కుటుంబమంతటినీ విమానంలో దేశవిదేశాలన్నీ తిప్పా. అంతేకాదు సివిల్స్ సాధించాక మా అత్తింటి వాళ్లు రాజ్ కోట్ వచ్చారని తెలిసి అక్కడికి వెళ్లా. ‘జరిగిందేదో జరిగిపోయింది మమ్మల్ని క్షమించు’ అంటూ మా అత్తగారు నా కాళ్లు పట్టుకున్నంత పనిచేసింది. నాకు మాత్రం వాళ్లని వదిలిపెట్టాలనిపించలేదు. కానీ మా నాన్న ‘గౌరవమైన హోదాలో ఉన్నావు. కేసులూ, గొడవలని మనసు పాడుచేసుకోకు. విడాకులిచ్చెయ్ ’ అని చెప్పారు. అలానే చేశా. నాలుగేళ్ల క్రితం ఓ ఉన్నతస్థాయి వ్యక్తి నన్ను ఏరి కోరి పెళ్లాడాడు. మా పాపకిప్పుడు రెండున్నరేళ్లు. చిన్న సమస్యలకే ప్రాణాలు తీసుకోవాలని ఆలోచించే వారికి నేను చెప్పేది ఒక్కటే- నన్నూ నేను పడిన కష్టాల్నీ సాధించిన విజయాల్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకోమనీ, ధైర్యంగా అడుగు ముందుకు వేయమనీ...

ఐదేళ్లు ఇంటిముఖం చూడలేదు!

పరీక్షలు తప్పితే... ప్రేమలో విఫలమైతే... కాపురంలో మనస్పర్ధలొస్తే...ఆత్మహత్యే పరిష్కారమనుకుంటారు చాలామంది. ఒక్క కారణం చూపి ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతారు కానీ, ధైర్యంగా బతికి చూపడానికి వందల దారులుంటాయని మర్చిపోతారు. కోమల్ గనత్ర మాత్రం అలా చేయలేదు.కష్టాలు దాటుకుని సివిల్స్ ర్యాంకు సాధించి గృహహింస బాధితురాలనే ముద్ర చెరిపేసుకుని ఐఏఎస్ అధికారిగా కొత్త జీవితం మొదలుపెట్టిన కోమల్ ఎందరికో ఆదర్శం.
నాకు రోజుకి కనీసం ఓ ఇరవై ఫోన్ కాల్స్ వస్తుంటాయి. వాటిలో ‘మా కాలేజీకి లేదా స్కూల్ కి మోటివేషనల్ స్పీకరుగా వచ్చి మీ జీవితపాఠం చెబుతారా’ అని అడిగే కాల్స్ పదైనా ఉంటాయి. సమయం కుదిరితే తప్పకుండా వెళ్లి నా గురించి చెప్పొస్తుంటా. ఇలా రోజూ నాకు ఫోన్లు రావడానికి కారణం నేను ఆరేడు నెలల క్రితం ‘జోష్ టాక్స్ ’ అనే యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడటమే. అది చూసి వివిధ పత్రికలు నా గురించి రాశాయి. ఫలితమే- పలు విద్యాసంస్థలూ సివిల్స్ కోచింగ్ సెంటర్లూ మోటివేషనల్ స్పీకరుగా నన్ను ఆహ్వానించడం. ఈ మధ్యనే గాంధీనగర్ , బొంబే ఐఐటీల నుంచీ పిలుపొచ్చింది. త్వరలోనే ఆ విద్యార్థులకీ నా గురించి చెప్పబోతున్నా....

నేను చెప్పేది.
========
1.మహిళలను తక్కువగా చూడొద్దు
2.విదేశాల సంబంధాలు అని మురిసిపోవద్దు
3.ఓటమికి నిరుత్శాహపడవద్దు.
Last one but main point
4.ఇరుగుపొరుగు వాళ్ళ మాటలు అసలు పట్టించుకోవద్దు.👍🙏

#KomalIAS

Source - Whatsapp Message

దైవాన్నే సందేహిస్తే!

దైవాన్నే సందేహిస్తే!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

ఒక అర్ధరాత్రి సమయంలో తోటలోనుండి చప్పుడు వినిపిస్తూంటేపరిగెత్తుకొనివచ్చాడుతోటకాపలావాడు. తోటలోపడి ఎద్దు ఒకటి చెట్లను, మొక్కలను ధ్వసం చేయడం చూశాడు. ఎద్దుని ఎలాగైనా పట్టు కోవాలని పట్టుదలగా దాని తోక పట్టుకొన్నాడు.
తక్షణమే ఆ ఎద్దు పైకి ఎగరసాగింది.
అప్పుడే తెలిసింది..

అదిపరమశివుని నంది అని. నంది కైలాసం వైపు ఎగుర్తూండగా అతను కూడా దాని తోకపట్టుకొని ఎగుర్తూవున్నాడు. ఇద్దరూ కైలాసంచేరుకున్నారు. అక్కడపరమశివుని చూడగానే
" దేవా ఇది న్యాయమా ,మీ నంది నా తోటని నాశనంచేసింది" అని మొరపట్టుకొన్నాడు.

"బాధ పడకు , నష్ట పరిహారం యిస్తున్నాను..సంచి నిండాబంగారు కాసులు".. అని ఒక సంచి యిచ్చాడు భగవంతుడు. స్వామికివందనం చేసి సంచీ తీసుకొని
నంది సాయంతో భూలోకానికితిరిగివచ్చాడు.

ఇల్లు చేరగానే, " ఇవి నిజంగా బంగారు కాసులేనా?
అనే సందేహం అతనికి కలిగింది. వెంటనే ఒక కాసు మాత్రం తీసుకొని, ఒక స్నేహితుని నగల దుకాణానికి వెళ్ళాడు. బంగారు కాసుస్నేహితునికి యిచ్చి, మంచిబంగారమౌనో కాదో గీటుపెట్టి
చూసి చెప్పమన్నాడు. స్నేహితుడు గీటుపెట్టి చూశాడు. " అరే , ఇది మేలిమి బంగారం..ఇది వీనికి ఎలా దొరికింది ? ' ఆ బంగారాన్ని తన సొంతం చేసుకోవాలనే దురాశపుట్టింది.

అతనుఆలోచించి తోటకాపరితో
'ఇది ఇత్తడి , నిన్ను ఎవరో మోసం చేశారు.
చేసినది ఎవరు ? అని అడగగా, తోట కాపరి జరిగిన విషయం స్నేహితునికి చెప్పాడు.

ఆ రాత్రి మళ్లీ నంది వచ్చింది. ఇత్తడి యిచ్చి నన్ను
మోసగిస్తావా ? నీకు న్యాయమా ? అని శివుడిని అడగాలనుకుని, నంది తోకను పట్టుకొన్నాడు. నంది పైకి లేచింది. దాని తోక పట్టుకొని
వేళ్ళాడసాగాడు తోట కాపరి. అప్పుడు , ఎవరో తన కాలుపట్టుకుని లాగుతున్నట్టనిపించి క్రిందికి చూశాడు.

" దేవుడిచ్చిన బంగారు కాసులు ఇత్తడి అని అబధ్ధం చెప్పిన అతని స్నేహితుడు కూడా వస్తున్నాడు. నంది కైలాసం వేపుఎగుర్తుండగా ఆ
స్నేహితుడు అడిగాడు " నీకు ఎన్ని బంగారు కాసులు ఇచ్చారు ? అని.వెంటనే నంది తోక పట్టు కొన్న
తోటకాపరి , ఉత్సాహంగారెండు చేతులు చాపి,
ఇన్ని కాసులు అన్నాడు.అంతే ఇద్దరూ భూమి మీద వున్న వారి తోటలోకి వచ్చిపడ్డారు.

కధలోని నీతి..
తోక పట్టుకొన్న తోటకాపరిసత్యాన్ని సందేహపడ్డాడు.
కాలు పట్టుకొన్న స్నేహితుడుదురాశపడ్డాడు. సత్యాన్నిసందేహించిన వారికి, దురాశాపరులకు యిదేగతి. అని

సనాతన ధర్మం తెలియజెప్పుతున్నది.🙏

ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః🙏

Source - Whatsapp Message

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?

కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.

మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.

మనసూ అంతే! మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే!
నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి.

మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది- తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.


ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా లోకం అతణ్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్న లాంటిది. దానధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్ళించడంతో లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది

Copied

Source - Whatsapp Message

సత్సంగం

🌻 సత్సంగం 🌻

🌻 కురిసే వానకు స్వార్థం లేదు...
పండే పంటకు స్వార్థం లేదు...
నింగి నేలకు లేని స్వార్థం...
మధ్య ఉన్న మనిషికెందుకు???
పుట్టినప్పుడు పట్టుకురాడు...
పోయినప్పుడు పట్టుకుపోడు.
మూడునాళ్ళ ముచ్చట కోసం మోసాలెందుకు???
ద్వేషాలెందుకు???

🌻శాంతంగా ఉంటేనే దృఢత్వం...
చల్లగా ఉన్నప్పుడు దృఢంగా ఉండే ఇనుము కూడా...వేడెక్కితే బలహీనమైపోతుంది.

🌻 ఎప్పుడైతే ఎక్కువగా మంచినే చూడటం మొదలుపెడతామో...అప్పుడు అన్ని అడ్డంకులూ...అడ్డుగోడలూ తొలగడం మొదలుపెడతాయి.
మెల్లగా జీవితంలోకి చిన్న చిన్న అద్భుతాలు వచ్చి...జీవితమే మారిపోతుంది.

https://chat.whatsapp.com/CqNvf1IMgcFFBs7HoU0iEl

🌻సమస్య వచ్చినప్పుడు సర్దుకుపోవడం...
చాలా గొప్ప గుణం. అది అహంకారాన్ని దూరం చేస్తుంది...పరిష్కారాన్ని చేరువ చేస్తుంది...బంధాలను భద్రపరుస్తుంది...
బాధ్యతలను గుర్తుచేస్తుంది.

🌻మిమ్మల్ని ప్రేమించే వారి మనసును ఎప్పుడూ గాయపరచకండి...ఎందుకంటే వారు మిమ్మల్ని ఏమీ అనలేరు...
మౌనంగా మీ జీవితం నుంచి నిష్క్రమించడం తప్ప.

🌻మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది...ప్రేమ, ద్వేషం పగ, ప్రతీకారం, నిరాశ ఏదైనా...కానీ దేన్ని పెంచుకోవాలన్నా నిర్ణయం మనదే.

🌻ఒక్కక్షణం కోపాన్ని ఆపుకుంటే...
ఎన్నో వేల క్షణాల బాధనుంచి తప్పించుకోవచ్చు...

T.me/namonarayanaya

సర్వేజనా సుఖినోభవంతుః...✍️✍️


🌻🌻🌻🌱🌱🌱🌻🌻🌻

Source - Whatsapp Message

నేటి నీతికథ.

నేటి నీతికథ.
తెలివితేటలుంటే ఏదైన సాద్యమే అని మన తల్లీదండ్రులు అంటూవుంటారు.తెలివితేటలకు పెద్దవాళ్లు చిన్నవాళ్లు అని తేడా లేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితో పెద్దవాళ్లను ఆశ్చర్య పరిచే ప్రతిభ ప్రదర్శిస్తుంటారు.


లింగాపురం అనే ఊరిలో సుబ్బయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు.వారిలో ఒకరికి తన వ్యాపారం బాద్యతలు అప్పగించాలిని అనుకుంటున్నాడు సుబ్బయ్య.   అయితే ఇద్దరి కొడుకుల్లో ఎవరు తెలివైనవారో తెలుసుకుని వారికీ వ్యాపారాన్ని అప్పజెప్పాలని ఆలోచిస్తాడు. దీనికోసం ఇద్దరు కొడుకులుకు ఒక పరీక్షపెడతాడు సుబ్బయ్య. అందులో ఎవరు నెగితే వారికీ వ్యాపారం బాధ్యతలను అప్పజెబుతానని కొడుకులతో అంటాడు.కొడుకులిద్దరకి కొంత డబ్బును ఇచ్చిన సుబ్బయ్య ఈ డబ్బుతో ఎవరైతే ఇంటినిపూర్తిగా నింపగల వస్తవులను కొని తెస్తారో వారికే వ్యాపారం అప్పజెబుతానని అంటాడు.దీనితో తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఉన్నపళంగా మార్కెట్ వైపుకు వేగంగా వెళ్ళాడు పెద్దకొడుకు.మార్కెట్లో ఉన్న వస్తువులన్నిటి గురుంచి 


అడిగి తెలుసుకున్నాడు. తండ్రి యించిన డబ్బుతో మొత్తానికి గడ్డి కొని నింపసాగాడు. ఎంత గడ్డి వేసినా ఇల్లు నిండలేదు. 


రెండోకొడుకు  మాత్రం తండ్రి అప్పజెప్పిన పనిని ఎంత తెలివితేటలతో పూర్తిగా చేయాలని దీర్ఘంగా ఆలోచించాడు. చివరకి ఒక రూపాయని ఖర్చుచేసి ఒక కొవ్వతిని కొని ఇంటికి తెస్తాడు. వెంటనే దాన్ని వెలిగించగానే ఇల్లంతా వెలుగు వెంటనే దానిని వెలిగించగానే ఇల్లంతా వెలుగు పరుచుకుంటుంది. దీన్ని చూసిన సుబ్బయ్య తెలివితేటలతో ఇంటినంతా వెలుగుతోనింపిన చిన్న కొడుకు ఆలోచనకు సంతృప్తి చెంది అతడికి వ్యాపార భాద్యతలను అప్పజెబుతాడు. సారిక ఆలోచించలేక గడ్డితో ఇంటిని నింపుతున్న పెద్ద కొడుకు అవస్థను చూసి దగ్గరకి పిలిచి తమ్ముడికి సహాయంగా వ్యాపారం చూసుకోమని చెబుతాడు సుబ్బయ్య. తెలివితేటలతో ఎంత పెద్ద సమస్యనైనా సులభంగా పరిష్కరించవచ్చు అలాగె తెలివితేటలతో దేనినైనా సాధించవచ్చు.నిజజీవితంలో చాలా మంది చదువు లేకపోయినా తెలివితో వ్యాపారం చేస్త్తున్నారు.....!!

సేకరణ మానస సరోవరం.

Source - Whatsapp Message