Tuesday, October 14, 2025

 🌹. *జీవాత్మ ప్రపంచ నియమాలు* 🌹
✍️. భావనగరి

Q:-- మనం కొన్నిసార్లు అమాయకులం, మనమేమి తప్పు చేయలేదు, అయినా అందరూ నిందిస్తున్నారు అనుకుంటాం, దీనికి కారణం ఏమై ఉండవచ్చు?

విస్పీ అనే ఆత్మ ఆత్మలోకం నుండి టెలిపతిక్ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళ అమ్మకు అందించిన ఆత్మలోక విషయాలే ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు. 

A:--1) మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, మనం నిశ్చయముగా ఎవరికి హాని గాని, బాధ గాని తలపెట్టామా అని ప్రశ్నించుకోవాలి, అలా కనుక చేసుంటే ఖచ్చితంగా శిక్షను అనుభవించాలి.

2) మనం ఎవరినైనా కష్టపెట్టి ఉండవచ్చు, గత జన్మలో పాపం చేసి ఉండొచ్చు, దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తుంటాం.

3) మనం సహజంగా ఎదగాలనుకుని భూమి మీద జన్మ తీసుకుని ఉండచ్చు, ఏ సమస్య ఎదురవ్వక పోతే ఎలా ఎదుగుతాం.

4) మనం మంచివాళ్ళం, సదాత్మలం అనుకుంటాం, కానీ మనం చేసే పనులు నిస్వార్థంగా చేసామా, కపటం లేకుండా చేస్తున్నమా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. 

మనం గనుక స్వార్ధ ప్రయోజనం తో ఆలోచించి ఇప్పుడు నేను హెల్ప్ చేస్తే రేపు నాకు వీళ్ళు help చేస్తారు అనుకుని గాని, ఇప్పుడు నేను సేవ చేస్తే స్వర్గానికి వెళ్తాను అని గాని, ఈ మంచి పని చేస్తే నా పాపాలు పోతాయని గాని, ఈ విధంగా ఏ కర్మ చేసిన మనల్ని మనం మోసం చేసుకుంటున్నట్లే.

మనం మంచి చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ ఇది కూడా పాపం చేస్తున్నట్లే,ఇలాంటి పనుల వల్ల మనకు ఏ విధంగానూ ప్రయోజనం ఉండదు.

5) ఎవరి గురించైనా తప్పుగా ఆలోచించారా, లేదా ఎవరినైనా తప్పుదారి పట్టించారా ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.

6) పేరు ప్రఖ్యాతుల కోసం, కోరికతో, ఆశతో, హాని చేశారా, తప్పుదారి పట్టించారా, ఒక్కసారి ఆలోచించండి.

7) మన స్వార్ధ ప్రయోజనాల కోసం ప్రత్యక్షంగా గాని,పరోక్షంగా గాని ఎవరినైనా బాధించారా అని ఒక్కసారి ఆలోచించండి.

8) చెడ్డ వ్యక్తుల్ని ప్రోత్సహించారా?చెడ్డ వ్యక్తితో మంచిగా ఉంటే చెడ్డ వ్యక్తిని ప్రోత్సహించినట్టే గుర్తుంచుకోండి,వారి పాపం లో మీరు భాగస్వాములైనట్టే,గుర్తుంచుకోండి.

భగవంతుడు ఎవ్వరికి అన్యాయం చెయ్యడు, ఒకవేళ మనం నిజంగా అమాయకులం అయితే దానిని అందరి ముందు రుజువు చేస్తాడు,

మనం ఇప్పుడు భూలోకం లో ఉంది వీటన్నింటిని పాటించి ఉన్నత ఆవరణకు చేరుకోవడం కోసమే,నిస్వార్థంగా ఇతరులకు సాయం చేయండి,సమస్యల్ని చిరునవ్వుతో ఎదుర్కొండి, చెడుని ఎదుర్కొండి.

సర్వశక్తిమంతుడు అయిన భగవంతుని నిందించడం మానేయండి,ఆయన ఎవ్వరికి అన్యాయం చేయడు.


No comments:

Post a Comment