Friday, April 17, 2026

ఇలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండండి నిజం తెలుసుకోండి..

ఇలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండండి నిజం తెలుసుకోండి..

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=yBh2VBg2HAk



Transcript:
(00:03) హాయ్ హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫెంటాస్టిక్ గా ఉన్నారా నేను కూడా చాలా బాగున్నాను ఫెంటాస్టిక్ గా ఉన్నాను ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియో తోటి మీ ముందుకు వచ్చేసానండి. అమ్మాయిలకి మంచిగా యూస్ఫుల్ గా ఉంటుంది. అదేంటంటే ఈ ఏడు రకాల అబ్బాయిలని మాత్రం అసలు నమ్మకండి ఆల్రెడీ మనం ఎలాంటి అమ్మాయిలతో లవ్ లో పడకూడదు అనే ఒక వీడియో చేసేసామండి ఆల్రెడీ అబ్బాయిల కోసం ఇదేంటంటే అమ్మాయిల కోసం అన్నమాట స్పెషల్ గా ఇటువంటి లక్షణాలు ఉన్న అబ్బాయిలతో మీరు గనుక లైఫ్ ని లీడ్ చేయాలి అని అనుకున్నారనుకో ఇదంతా అయిపోయినట్టే అయితే
(00:34) ఈ ఏడు రకాల అబ్బాయిలు ఎలా ఉంటారు ఎటువంటి వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అన్న పదం కంటే కూడా దూరంగా ఉండాలి అని అనటం చాలా మంచిది ండి ఇట్లాంటి అబ్బాయిలకి దూరంగా ఉండాలి. అవేంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన వీడియోస్ నచ్చినయి అనుకోండి లైక్ చేయడం షేర్ చేయడం అంతా మామూలే బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకున్నారు అంటే ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ గా వచ్చేస్తుంది.
(01:05) అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హైప్ కూడా చేసేసేయండి అలాగే ఓకేనా కొంతమంది అబ్బాయిలతో మనం జాగ్రత్తగా ఉండాలండి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మి లైఫ్ లోకి మనం ఆహ్వానించాము అనుకోండి తర్వాత మనం పడే కష్టాలు ఎవరు తీర్చలేరు అన్నమాట. అట్లా రాకూడదు ప్రతి అమ్మాయి సేఫ్ గా ఉండాలి అనింటే ఈ ఏడు రకాల మెంటాలిటీస్ ఉన్న వాళ్ళతో దూరంగా ఉండటం మంచిది.
(01:37) మీరు ఆల్రెడీ వాళ్ళతో ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఆల్రెడీ మీ లైఫ్ లోకి వచ్చేసిన వాళ్ళయతే వాళ్ళలో ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మాత్రం ఏం చేస్తామండి అని అనుకుంటున్నారా జస్ట్ తెలుసుకోవడానికైనా సరే యూస్ అవుతుంది కదా ఆ విధంగా అన్నమాట అయితే ఫస్ట్ నెంబర్ వన్ ఎక్కువగా మిమ్మల్ని అనవసరంగా పొగిడేవాళ్ళు మీ ఇన్నర్ బ్యూటీ కన్నా కూడా ఔటర్ బ్యూటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ మిమ్మల్ని ఎక్కువగా పొగుడుతూ ఉంటారు.
(02:03) వీళ్ళు అందానికి మాత్రమే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మనలో అందం కాకుండా ఇంకా చాలా విషయాలు ఉంటాయండి. మన ఇన్నర్ బ్యూటీ ఉంటుంది అది దేనితోని మనం సరిపోల్చలేమ అన్నమాట అట్లాంటి విషయాలు వీళ్ళ కంటికి ఏమాత్రము కనిపించవు ఎంతసేపు మీ అందం గురించి మాత్రమే పొగుడుతూ ఉంటారు. అయితే వాళ్ళకి బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం ఒకటి ఉంటుంది అని అది ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది అని అసలు అది చాలా ఇంపార్టెంట్ అన్న విషయం కూడా తెలియకుండా ఉంటారున్నమాట. చాలా సిల్లీగా ఉంటూ ఉంటారు.
(02:31) ఇట్లాంటి అబ్బాయిలకు మీరు మీ అందాన్ని పొగుడుతున్నారు కదా అని చెప్పేసి దగ్గరయ్యారు అని అనుకోండి మీరు ఎప్పుడైనా సరే అందం గ్యారెంటీ లేదు కాబట్టి అందవిహీనంగా అయిపోయినప్పుడు ఏమాత్రము మిమ్మల్ని లైక్ చేయరు అన్నమాట. అందుకని ఇలాంటి అబ్బాయిలకు కూడా దూరంగా ఉండటం మంచిది. ఇక నెంబర్ టూ లైఫ్ ని ఎప్పుడూ సీరియస్ గా తీసుకోరండి వీళ్ళకి జీవితంలో ఎటువంటి గోల్స్ ఉండవు.
(02:56) ఏదో తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళతో కూడా లైఫ్ కొంచెం కష్టంగా ఉంటుందండి ఫస్ట్ కొంచెం ఎక్సైట్మెంట్ తో ఉన్నా సరే అరే ఏది కూడా పట్టించుకోవట్లేదు చాలా సిల్లీగా ఉంటున్నాడు చాలా ఏదైనా సరే కామెడీగా తీసుకుంటున్నాడు సీరియస్ గా తీసుకోవట్లేదు వీడితో ఉంటే మా లైఫ్ సంతోషంగా ఉంది అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి.
(03:16) ఎందుకంటే వీళ్ళు ఏది సీరియస్ గా తీసుకోరు మిమ్మల్ని కూడా సీరియస్ గా తీసుకోరు లైఫ్ ని సీరియస్ గా తీసుకోరు. అలాగే గోల్ ని కూడా సీరియస్ గా తీసుకోరు వీళ్ళకి ఎటువంటి గోల్స్ అనేవి ఉండవు అన్నమాట ఇట్లాంటి వాళ్ళతో గనుక మీరు లైఫ్ ని స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ గోల్స్ ఏమో గానీ మీకు ఎక్కువ గోల్స్ అయిపోతాయి అన్నమాట మీరే సంపాదించి వాళ్ళని పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది స్టార్టింగ్ లో బాగుంటుంది పోను పోను ఆ కష్టం ఏంటో మీకు తెలిసి వస్తుంది కాబట్టి లైఫ్ లో ఎటువంటి గోల్స్ లేని వ్యక్తులని నమ్మే ముందు జాగ్రత్త అట్లాంటి వాళ్ళు మీ లైఫ్ లో ఉన్నట్లయితే
(03:47) దూరంగా ఉండండి. రాను రాను వాళ్ళ మెంటాలిటీ అనేది బయటికి వస్తూ ఉంటుందండి అప్పుడు మనం చూసుకొని వాళ్ళని దూరంగా పెట్టడం మంచిది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు సీరియస్ గా లైఫ్ ని లీడ్ చేయడానికి పనికిరారు అన్నమాట. నెంబర్ త్రీ ఎక్కువగా మిమ్మల్ని అనుమానించే వాళ్ళు వాళ్ళు మీ లైఫ్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కంప్లీట్ గా వాళ్ళ అధీనంలోకి తీసేసుకుంటారు మీకంటూ ఇంకా ఇష్టా ఇష్టాలు ఏమీ లేకుండా చేసేస్తూ ఉంటారు.
(04:17) మీరు ఎవరితోటి మాట్లాడకూడదు మీకు ఫ్రెండ్స్ సర్కిల్ అనేది ఉండకూడదు పేరెంట్స్ తో కూడా మాట్లాడకూడదు మీకు అసలు అసలు ఏమీ ఉండకూడదు అన్నమాట వాళ్ళు తప్ప మీరు మాట్లాడటానికి ఒక వ్యక్తి కూడా లేకుండా అలా అయిపోతూ ఉండాలి అట్లా అయితేనే వాళ్ళు మిమ్మల్ని లవ్ చేస్తారు లేదు అనుకోండి మిమ్మల్ని ఇష్టపడరు ఏమాత్రము మీ మీద సెంటిమెంట్స్ ఉండవు అన్నమాట ఎంతసేపు మిమ్మల్ని కంట్రోల్ లో పెట్టాలని చూస్తూ ఉంటారు.
(04:40) ఇట్లాంటి అబ్బాయిలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి వాళ్ళని మనం నమ్మాము అనుకోండి నట్టేట్లో ముంచేస్తారు. మన అన్న వాళ్ళఅందరినీ దూరం చేసేసి వాళ్ళు మాత్రమే మన లైఫ్ లో ఉంటారు. మనకి రేపటి రోజున ఏదైనా కష్టం వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి ఒక మనిషి కూడా ఉండరు ఎందుకంటే వీళ్ళకి అనుమానం అన్నమాట. మనం ఆడవాళ్ళతో మాట్లాడిన అనుమానమే మగవాళ్ళతో మాట్లాడిన అనుమానమే మనల్ని ఒంటరిగా చేసేసి వాళ్ళ దగ్గర కూర్చోపెట్టుకుంటాను.
(05:06) ఇట్లాంటి అబ్బాయిలు కూడా మీకు ఉంటే అది పొజెసిసివ్నెస్ అనుకొని సరిపెట్టుకోకండి. ఈ రెండిటికీ కొంచెం తేడా ఉంటుంది అనుమానించే వాళ్ళకి పోసేసివ్నెస్ తో ఉండే వాళ్ళకి తేడా ఉంటుంది అన్నమాట. అనుమానం అంటే మనల్ని అందరి దగ్గర నుంచి దూరం చేసేసి మనల్ని ఒంటరిని చేసేసి ఒక దగ్గర కూర్చోబెడతారు పోససివ్నెస్ అంటే నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం నువ్వు నాకు మాత్రమే దక్కాలి అన్న ఒక స్వార్థంతో ఉంటారు గుర్తించండి ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా లేని వాళ్ళు వీళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి డబ్బులక ఏమి కొదవ ఉండదు కానీ వీళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉండదు అన్నమాట డబ్బుల్ని
(05:37) విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ప్రతిదానికి డబ్బుల్ని విపరీతంగా ఖర్చు పెట్టడం అవసరం ఉన్నా లేకపోయినా మనీ వాల్యూ అనేది తెలియకుండా ఉంటా ఉంటారు. వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఖర్చు పెడుతున్నారు అందులో మనక ఏంటండీ అని మీరు అనుకోవచ్చు ఎంత డబ్బులు ఉన్నా సరే దాని విలువ తెలియకుండా ఎలా పెట్టుబట్లు పెట్టాలి ఎలా ఫైనాన్షియల్ గా ఇంకా దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి అన్న ఐడియాస్ గనుక లేకుండా ఉన్నారు అనిఅంటే వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే వేస్టేనండి.
(06:02) డబ్బుని సీరియస్ గా తీసుకోవాలి అది మనకి ఆపద కాలంలో కాపాడుతుంది అట్లాంటి విషయాలు తెలుసుకోకుండా విచ్చలవిడిగా ఉన్నప్పుడు ఖర్చు పెట్టేసారు అనుకోండి లేనప్పుడు కష్టపడాల్సి వస్తుంది కాబట్టి మనీ విలువ తెలియకుండా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని కూడా దూరంగా పెట్టేసేయండి ఎందుకంటే మనిషికి డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ సర్వకాల సర్వావస్థల యందు మనల్ని ఆదుకునేది డబ్బు అని మాత్రం గుర్తుపెట్టుకోండి.
(06:24) ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఫోర్త్ పాయింట్ ఎమోషనల్ గా డిపెండ్ అయిపోవటం వీళ్ళకి ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ అవుతూ ఉంటారండి అంటే వీళ్ళకి మెంటల్లీ అంత మెచూరిటీగా ఉండరు అన్నమాట ప్రతిదానికి మీ మీద ఆధారపడుతూ ఉంటారు. ప్రతిదాన్ని ఏ విషయమైనా సరే డెసిషన్ తీసుకోవాలి అనింటే వాళ్ళకి సొంతంగా ఒక అవగాహన ఉండదు. మిమ్మల్ని సంప్రదించి మాత్రమే డిెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు మాటి మాటికి మీకు ఫోన్ చేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు సలహాలు మంచిదే కదండీ మనల్ని అడిగి డెసిషన్ తీసుకుంటే అంతకన్నా ఇంకేం కావాలని మీరు పంగిపోవచ్చు మాటిమాటికి మనం మనకి ఫోన్
(06:59) చేసే అదృష్టం కూడా ఉండాలి కదండీ అని మీరు చాలా సంతోషంగా ఉండొచ్చు కానీ ఫస్ట్ లో బాగుంటుందండి పోను పోన ఏమవుతుందంటే మీకు టార్చర్ గా అయిపోతుంది మాటి మాటికి ఫోన్ చేసి ప్రతిదానికి సలహా అడగటం మెంటల్లీ మీ మీద డిపెండ్ అయిపోవటం ఏ నిర్ణయము తీసుకోలేకుండా చాలా వీక్ గా మెంటాలిటీతో ఉండటం ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ప్రతిది మనమే దగ్గరు ఉండి వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది.
(07:21) రాను రాను మనకి అది చాలా చిరాగ్గా అనిపిస్తుంది సమర్థత లేని వ్యక్తులు అంటారు ఇటువంటి వాళ్ళని సమర్ధవంతంగా లేని వ్యక్తుల దగ్గర ఎంత డబ్బు ఉన్నా సరే ఎన్ని తెలివి తేటలు ఉన్నా సరే అవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి డబ్బు ఎక్కువ ఉందా తక్కువ ఉందా ఇవన్నీ కాదండి ఇంపార్టెంట్ సమర్థత ఉందా లేదా అనేదే ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ ఫైవ్ ఎక్కువగా మనీకే ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు ప్రతి విషయానికి మనీతో పోలుస్తూ ఉంటారు ఇది ఇంత ఇది ఇంత అని చెప్పేసి ఎక్కువగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట అట్లాంటి వాళ్ళతో గనక మనం లైఫ్ లో ఉన్నాము అనింటే మన ఫీలింగ్స్ కి ఏమాత్రము
(07:58) ఇంపార్టెంట్ ఇవ్వరు అసలు వీళ్ళకి లైఫ్ లో ఎటువంటి సెంటిమెంట్స్ ఉండవు అన్నమాట డబ్బుకి మాత్రమే ఇంపార్టెంట్ ఇస్తారు. లైఫ్ ని కూడా ఒక వ్యాపారంగా చూస్తూ ఉంటారు. మీ చిన్న చిన్న పేస్టులు కూడా చంపుకొని వీళ్ళతో బతకాల్సి వస్తుంది. డబ్బు ఉంటే ఏముందండి సంతోషమే కదా మనం కావాల్సినవన్నీ కొనుక్కోవచ్చు కదా ఇక అందులో సంతోషం లేకపోవడం ఏమి ఉంటుంది చెప్పండి అని మీరు అనుకోవచ్చు.
(08:22) ఫస్ట్ లో మీరు ఏదైతే వస్తువులన్నీ కొనుక్కొని సంతోషపడుతూ ఉంటారో పోను పోను పోను పోను మీకే అర్థమవుతుంది ముఖ్యంగా ఎఫెక్షన్స్ ఎమోషన్స్ మనం డబ్బుతో కొనలేము అని మీకే అర్థంవుతుంది అప్పుడు ఇటువంటి వ్యక్తిని నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అనేసి బాధపడాల్సి వస్తుంది అలా జరగకూడదు అనిఅంటే ఎక్కువగా డబ్బుకే ప్రయారిటీ ఇస్తూ మీకు సెకండ్ ప్రయారిటీ ఇచ్చేవాళ్ళని లైఫ్ లో ఏది కూడా సీరియస్ గా తీసుకోకుండా డబ్బును మాత్రమే సీరియస్ గా తీసుకునే వాళ్ళని డబ్బుని మాత్రమే ప్రేమించే వాళ్ళని దూరంగా పెట్టండి పాయింట్ నెంబర్ నెంబర్ సిక్స్ ఎక్కువగా కోపం చూపించే వాళ్ళని అవునండి
(08:56) వీళ్ళకి చాలా ఎక్కువ కోపం అన్నమాట ప్రతిదానికి కోపపడిపోతూ ఉంటారు వాళ్ళు చెప్పిందే మనం వినాలి అంటా ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా మీరు వాళ్ళు చెప్పిన మాటే వినాలి మీ అభిప్రాయాలకి ఏమాత్రము విలువ ఇవ్వరు మన అభిప్రాయాలకి విలువ ఇవ్వకపోయినా సరే మనల్ని బాగా చూసుకుంటే చాలు కదండీ కానీ కొద్ది రోజుల తర్వాత ఈ బాగా చూసుకోవటం అనే కాన్సెప్ట్ కూడా దెబ్బ తింటుంది అని అది ఎలాగ అంటే ప్రతి దాంట్లో వాళ్ళ మాటే నెగ్గాలి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఒక స్టేజ్ కి వచ్చేసరికి డామినేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట. మీలో ఎంత టాలెంట్స్ ఉన్నా సరే
(09:27) వాటిల్ని తొక్కేసి మీ ముందు వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు కాబట్టి మై డియర్ గర్ల్స్ ఇట్లాంటి అబ్బాయిలకి కూడా దూరంగా ఉండండి. ఇక పాయింట్ నెంబర్ సెవెన్ కొంతమంది అబ్బాయిలు, కొంతమంది అబ్బాయిలు చాలా జాలీగా ఉంటూ ఉంటారండి. జాలీగా ఉండటంలో ఏంటండి తప్పు అంటే ప్రతి విషయాన్ని కూడా సీరియస్ గా తీసుకోకుండా జాలీ మూడ్లోనే ఉంటూ ఉంటారున్నమాట ఎప్పుడు చూసినా లైఫ్ లో మనకి కొన్ని విషయాల్లో సీరియస్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది.
(09:55) అయినా సరే వీళ్ళు వాటిల్ని ఏమి పట్టించుకోకుండా వీళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే చూస్తూ ఉంటారు వీళ్ళు చాలా స్వార్ధపరులుగా ఉంటారున్నమాట వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తారు మిమ్మల్ని కూడా లెక్క చేయరు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం పక్కన పెట్టేసి వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి ఎప్పుడు వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి ఎప్పటికీ ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారున్నమాట ఇక్కడ ఏమవుతుందంటే మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని అనుకోవట్లేదు వాళ్ళు మాత్రమే హ్యాపీగా ఉండాలి అని చూస్తున్నారు మిమ్మల్ని అసలు లెక్కచే చేయట్లేదు
(10:25) ఇట్లాంటి వాళ్ళతో కూడా రిలేషన్షిప్ స్టార్టింగ్ లో బాగుంటుందండి పోను పోను మనల్ని ఏంట్రా అసలు పట్టించుకోవట్లేదు లెక్క చేయట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారుఅన్నమాట కానీ అయినా సరే పర్వాలేదండి వాళ్ళు సంతోషమే నా సంతోషం వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి వాళ్ళు సంతోషంగా ఉండటమే నాకు కావాలి నా సంతోషాలు అన్నిటిని కూడా వాళ్ళ కోసమే నేను దారబోద్దాం అనుకుంటున్నాను.
(10:45) అంతే కదండీ అబ్బాయి చాలా బాగున్నాడు ముద్దుగా ఉన్నాడు బొద్దుగా ఉన్నాడు చాక్లెట్ బాయ్ లాగా ఉన్నాడు. వీరితో అడ్జస్ట్ అయిపోవడంలో ఏమాత్రం తప్పు లేదండి అని మీరు అనుకున్నారు అనుకోండి. మీ లైఫ్ సంకనాకి పోబోతుంది దానికి రెడీగా ఉండండి. అర్థమైందా అండి ఈ ఏడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఈ ఏడు లక్షణాలు ఉన్న అబ్బాయిలకి దూరంగా ఉండండి ఆల్రెడీ మీరు ఇట్లాంటి వాళ్ళ లవ్ లో ఉన్నట్లు అయితే ఒకసారి చెక్ చేసుకోండి.
(11:13) ఇట్లాంటి రిలేషన్షిప్ చివరి వరకు నడిపించలేము. మధ్యలో బ్రేకప్స్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా బాధ్యతగా ఉండే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు అంత అందంగా లేకపోయినా సరే మానసిక సౌందర్యం అనేది వాళ్ళకి ఉంటుంది. యస్ ఏ హస్బెండ్ వైఫ్ ని ఎలా చూసుకోవాలి లైఫ్ లో ఎలా ఉండాలి డబ్బు విషయంలో గాని ప్రతి విషయంలోనూ వీళ్ళకి కొన్ని క్లారిటీస్ ఉంటాయి ఇట్లాంటి అబ్బాయిలు గనుక మీ జీవితంలోకి వచ్చారు అనుకోండి ఇక మీ లైఫ్ పండగే అన్నమాట ఇట్లాంటి అబ్బాయిలు గనుక మీకు దొరికితే అట్లాంటి వాళ్ళని వదులుకోకండి మీరు ఇప్పటికే ఇలాంటి ఈ ఏడు సింటమ్స్ ఉన్నవాళ్ళ
(11:50) అబ్బాయిల లవ్ లో ఉన్నట్లయితే కాస్త చూసుకోండి మీకుేమన్నా యూస్ఫుల్ గా ఉంటుందేమో చూసేసాం కదండీ ఏడు పాయింట్స్ ఎస్పెషల్లీ అమ్మాయిల కోసం ఈ వీడియో ఇలాంటి అమ్మాయిలకు దూరంగా ఉండండి అన్న వీడియోని నేను ఆల్రెడీ చేశనండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(12:15) నెక్స్ట్ టైం మరో మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ జై హింద్. ఆ

No comments:

Post a Comment