Friday, April 17, 2026

అందరికీ సమర్థవంతమైన భర్తలు రారు గుర్తుంచుకోండి# sunita's world # life motivation #

అందరికీ సమర్థవంతమైన భర్తలు రారు గుర్తుంచుకోండి# sunita's world # life motivation #

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=U-WH6X4cYCM



Transcript:
(00:00) కొంతమంది ఆడవాళ్ళు పెళ్లి అవ్వగానే ఇక మొత్తం అయిపోయేసింది అనుకుంటారండి ఇక మొత్తం భారమంతా నా భర్త మీద వేసేసి నేను హాయిగా గుండెల మీద చెయ్యి వేసేసుకొని పడుకుంటాను ఇక నాకు ఏ దిగులు లేదు మొత్తం ఆయనే చేసేసుకుంటాడు అని అంత లేదండి అర్థమైందా సమర్థవంతమైన భర్తలు అందరికీ రారండి దయచేసి అలా అనుకోకండి అంతా అయిపోయింది ఇక వాళ్ళే చూసుకుంటారు చూసుకోరు ఎన్ని సంవత్సరాలు అయినా సరే నిన్ను నువ్వు చూసుకోవాలి నీకోసం నువ్వు బ్రతకాలి నీ కనీసం అవసరాలు ఏంటో అవి నువ్వు తీర్చుకోవడానికి నీ దగ్గర స్టామినా ఉండాల్సిందే ఆర్థికంగా గాని మానసికంగా గాని ఫిజికల్ గా గాని ఏ విధమైన శక్తి
(00:36) సామర్థ్యాలు అయినా సరే నీ దగ్గర కొన్ని అట్టే పెట్టుకోవాల్సిందే ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడ్డావు అనిఅంటే అది సొంత పిల్లలైనా సరే కట్టుకున్న భర్త అయినా సరే తల్లిదండ్రులు అయినా సరే ఇక నువ్వు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నట్టే ఎవరిని ఆధారపడకు ఎవరిని ఆశించకు ఎవరి కోసమ ఎదురు చూడకు నీ జీవితం నీది పెళ్లి అయిపోయింది అన్నంత మాత్రం చేత నీ భారమంతా వేరే వాళ్ళ మీద వేసాను అని మాత్రం అనుకోకు అలా మనల్ని కంప్లీట్ గా భరించేవాళ్ళు దొరికితే మన అదృష్టం అలా రాలేదు అనుకోండి నిరుత్సాహవంతులుగా మారిపోయి నా జీవితం ఇంతే అనేసి బాధపడుతూ కూర్చోకూడదు. మీకున్న
(01:12) శక్తి సామర్థ్యాలు ఏంటో వాటిని తెలుసుకొని షైన్ చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళడానికి చూడాలి కానీ ఒకళ్ళ మీద భారాన్ని వేసేసి నేను హాయిగా ఉంటాను అని అనుకోవడం చాలా చాలా తప్పండి ఈ రోజుల్లో అయితే అస్సలు మ్యాచ్ కాదన్నమాట ఎవరు వస్తారో ఎవరు పోతారో ఎంతకాలం ఉంటారో ఎప్పుడు వదిలేస్తారో ఏది కూడా మనకి తెలియదు మన జీవితంలో నుంచి ఎవరు ఎప్పుడు ఎందుకు ఎలా పోతారో కూడా తెలియదు.
(01:37) అటువంటప్పుడు మనల్ని మనం స్ట్రాంగ్ గా స్టేబుల్ గా మనల్ని మనం ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లేలాగా మనల్ని మనం ఎప్పుడు కూడా రెడీగా ఉంచుకోవాలి. ఎవరో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత మనం సినిమాల్లో లాగా తయారవ్వడం కాదండి ఎప్పుడు ఎనీ టైం మనం రెడీగా ఉండాలి ఎవరు మనల్ని వదిలేసి వెళ్ళినా సరే మనం తట్టుకొని నిలబడిగే శక్తిని మనం ఎప్పుడు కూడా రెడీగా స్టాక్ గా పెట్టుకోవాలి.
(02:04) ఏమంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మోటివేషనల్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment