కీచులాడుకొని ఎం సాధిస్తారు? What will you achieve by quarrelling?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YjKyGjAOZN4
Transcript:
(00:01) ప్రేమించుకున్నారు పెళ్లిళ్లు చేసుకున్నారు. పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. వయసు వేడిలో ఒక సంవత్సరం గడిచిపోయింది. మెల్లమెల్లగా ఒకళ్ళ మీద ఒకళ్ళకి స్వతంత్రం ఆటోమేటిక్ గా వస్తుందండి. ఇప్పుడున్న జనరేషన్ లో అంతకుముందు జనరేషన్ లో కాకుండా ఎవరికి వాళ్ళకి స్వతంత్ర అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అవి వ్యక్తపరుస్తూ ఉంటారు.
(00:33) దాంతో ఒకళ్ళనొకళ్ళు ఖండించుకుంటూ ఉంటారు. నీ తప్పు అంటే నీ తప్పు అంటూ ఉంటారు. తప్పు లేదండి తప్పు లేదు ఎందుకంటే మనసులోని భావాలని వ్యక్తపరిస్తే తప్ప పెళ్లిఅయిన తర్వాత వాళ్ళంటే ఏమిటో వీళ్ళకి తెలియదు వీళ్ళంటే ఏమిటో వాళ్ళకి తెలియదు ఓకే ఆ భావాలను వ్యక్తపరచుకోవడం కూడాను ఒక కళేనండి ఒక కళే నేను చాలా వీడియోలో చెప్పాను ఏది చెప్పాల్సి వచ్చినా కూడాను లౌడ్ గా చెప్పొద్దు అసర్టివ్ గా చెప్పండి మెల్లగా చెప్పండి ఎసర్టివ్ గా చెప్పండి.
(01:13) లౌడ్ గా చెప్పడం అంటే మూర్ఖంగా చెప్పడం అన్నమాట గట్టిగా చెప్పడం నేను ఇంతే నేను ఇంకా మారను అని చెప్పడం అది పొరపాటు నువ్వు మారతావా మారమా అన్నది నీ వ్యక్తిగతం ఎందుకంటే నువ్వు సంసారంలోకి వచ్చేసావు ఇక్కడ దాంపత్యంలోకి వచ్చేసావు నేను మారను అంటే కుదరదు అమ్మాయి అయినా మారాల్సిందే అబ్బాయి అయినా మారాల్సిందే పిల్లలు పుట్టారు అనుకోండి ఇంక నేను మారను అని గనుక ఇద్దరు అనుకుంటే నేను సూటిగా వాళ్ళకి ఒకటే ప్రశ్నిస్తున్నా అది ఎందుకు అన్నారు పిల్లల్ని మీ అహాలకి వాళ్ళని బలి చేయడానిక ఒక్కటి గుర్తుపెట్టుకోండి
(01:57) మిమ్మల్ని నడిపించినవి మీ బాల్యంలోని ముద్రలే మీ తల్లిదండ్రుల సంస్కారమే అలాగే మీ పిల్లల్ని కూడాను మీ ప్రవర్తనే నడిపిస్తుంది. మీ ప్రవర్తనే వాళ్ళలో ముద్రలుగా పడిపోతాయి. మీ ఇద్దరి మధ్య జరుగుతున్న తతంగానికి వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు అదే జీవితం అనుకుంటారు వాళ్ళు కాబట్టి వాగ్వివాదాలు ఉండాలండి కోపతాపాలు ఉండాలండి.
(02:36) అవి ఉంటే తప్ప వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాన్ని చాటుకోలేరు కదా ప్రతి వాడి జీవితంలోన అదే జరుగుతుంది కానీ ఏది స్థాయికి మించి ఉండకూడదండి స్థాయికి మించి ఉండకూడదు. నేను తగ్గను నేను ఇంతే అని నువ్వు అన్నప్పుడు అవతల వ్యక్తి కూడా అంటాడుగా నేను కూడా ఇంతే నేను తగ్గను అని చివరికి మీరేం సాధించినట్టు చెప్పండి. నా బాధ ఏందంటే మధ్యలో పిల్లలు నరిగిపోతారు భయభ్రాంతులకు గురైతారు ఒక తెలియని ఇన్ఫీరియారిటీ [నవ్వు] కాంప్లెక్స్ వస్తుంది.
(03:07) రేపు పొద్దున దీన్నే వారసత్వ సంపదగా ఎన్నుకొని జనాల్ని సతాయిస్తే తప్ప మాట వినరు కదా కాబట్టి మనం సతద్దామ అన్న ఒక నిర్ణయానికి వస్తారు. అంతా తెలుసుకునే లోపల వాళ్ళకి పిల్లలు పుట్టి మీరు తాతలు అయిపోతారు. కాబట్టి ఏం చేయాలి అన్నదే ఈ వీడియోలోని విషయంఅండి ఈ వీడియోలోని విషయం ఒక్కటండి ఎన్నో సమస్యలు వస్తుంటాయి అసలు సమస్యలు వస్తే తప్ప మనిషి రాడు తేలడు కదా సముద్రం ఉదృతంగా ఉంటాయి కదా పడవ నడిపేవాడు నైపుణ్యాన్ని సంతరించుకోడు కాబట్టి సమస్యలు వస్తూనే ఉంటాయండి
(03:53) సమస్యలు లేకపోతే దాన్ని సంసారం అనరు సమస్యలు లేకపోతే ఎవరు వ్యక్తిగా ఎదగలేరు నేను చాలాసార్లు చెప్పాను జీవితం అంటే ఒక సమస్య నుంచి ఇంకో సమస్యను చేసే ప్రయాణం అలాగే ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి చేసే ప్రయాణం అని చెప్పేసి కాబట్టి సమస్య వచ్చింది అది తీవ్ర రూపం దాల్చింది ఓకే మరి కొన్ని కొన్ని సమస్యలు తీవ్ర రూపం దాలుస్తాయి కదా దాల్చినప్పుడు మాట మాట అనుకున్నారు ఓకే ఇప్పుడు ఎవరు తగ్గాలి అన్నదే ప్రశ్న అంతే కదా కానీ ఆ ఆవేశం అనేది ఎంత మాయ కప్పుతుంది అంటే ఎవరికి వాళ్ళు నేనే కరెక్ట్
(04:38) అనుకుంటారండి నేనే కరెక్ట్ అనుకుంటారు. ఒక రోజు రెండు రోజులు కూడాను భీష్మించి కూర్చుంటారు. నా సూడి ప్రశ్న ఏంటంటే ఎంత కాలం కూర్చుంటారండి అలాగా ఎంతకాలం కూర్చుంటారు చెప్పండి మీరు చదువుకున్న చదువు కలిసి కూర్చొని చర్చించుకోవడానికి మాట్లాడుకోవడానికి అవసరమైతే సారీ చెప్పడానికి ఉపయోగపడదా ఆలోచించండి ఇంకొకటి సమస్య వచ్చింది నిజమే ఆ సమస్యతోనే మీ జీవితం బాగుపడిపోదు కదా ఆ సమస్య తేలిపోతే ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది సమస్య వచ్చింది ఎవరు ఆ కంక్లూషన్ కి రాలేదు ఎవరి దగ్గరికి పోతారు చెప్పండి
(05:22) ఎవరి దగ్గరికి పోతారు మిత్రుల దగ్గరికి అయితే మీరు పోరుగా ఎందుకంటే చీప్ అయిపోతారు. కదా మరి ఎవరి దగ్గరికి పోవాలి తల్లిదండ్రుల దగ్గరికి పోవాలి. తల్లిదండ్రులు దగ్గరికి పోతే న్యాయం జరుగుతుందన్న గ్యారెంటీ ఉందా? నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే జీవితానుభవంతో వాళ్ళు కొన్ని విషయాలు చెప్తారు. కదా అవి చెప్పినప్పుడు మీకు రుచించవు రుచిస్తే చాలా మంచిది.
(05:58) అట్లా రెండు మూడు సార్లు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ సమస్యలు మీరే పరిష్కరించుకుంటారు కానీ ఈ జనరేషన్ గ్యాప్ లో ఏమవుతుంది అంటే వాళ్ళు చెప్పినవి మీకు రుచించవు కాబట్టి వాళ్ళు ఒకటే చెప్తారు మేము చెప్పవలసింది చెప్పామఅమ్మ వర్చువల్ గా మీ జీవితాన్ని మీరే లీడ్ చేయవలసి ఉంటుంది కదా కాబట్టి ఏమన్నా సద్దుబాట్లు ఉంటే మీరే చేసుకోండి.
(06:26) పొరపాట్లు ఏమన్నా జరిగితే వాటిని అధిగమించండి. లేదు సమస్య వచ్చింది మాట మాట అనుకున్నారు. ఒక గంట వ్యవధి ఇవ్వండి నిశిద్ధంగా ఉండండి తర్వాత ఎవరో ఒకరు సారీ చెప్పేసుకోండి. కావాలనే చెప్పుకోండి సారీ సారీ చెప్పుకుంటే ఏమవతుందిఅంటే రెండు విషయాలు జరుగుతాయి ఎస్ నా మాట ఒప్పుకున్నాడని అమ్మాయి అనుకోవచ్చు లేకపోతే అబ్బాయి అనుకోవచ్చు అంటే ఎవరో ఒకరు సారీ చెప్తే లేదు సరేలే జరిగింది ఏదో జరిగిపోయింది నేనే ఆవేశానికి గురయ్యాను ఓకే ఇంక ఇప్పుడు ఇట్లా జరగదులే అని అమ్మాయో అబ్బాయో అన్నారనుకోండి ఆటోమేటిక్ గా మిగతా వాళ్ళలో కూడాను
(07:10) రియలైజేషన్ వస్తుంది అబ్బా అనవసరంగా వాదలాడుకున్నామే అని ఇంకొకటి మీరు వాదులాడుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఆ పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాతనో లేకోతే నిద్రపోయిన తర్వాతనో తలుపులు వేసుకొని వాదులాడుకోండి. పిల్లలు ఏం తప్పు చేశారని వాళ్ళ ప్రమేంత వాళ్ళు వచ్చారు భూమి మీదకి రాలేదు కదా మీ ప్రేమ ఎంత వచ్చారు కదా వాళ్ళు అటువంటప్పుడు [గొంతు సవరించుకోవడం] ఇవ్వాల్సింది ఏదనా ఉంటే మంచి ఇవ్వాలి వాళ్ళకి అంతేగన కీచులాటలు ఇచ్చేసి అహాలను ఇచ్చేసి ఆస్తిగా 30 ఏళ్ల తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అప్పటికి పరిస్థితులు ఇంకా మారిపోయి వాటినే పట్టుకొని ఏలాడితే వాళ్ళు జీవితంలో
(07:52) ఏం బాగుపడతారు చెప్పండి. కాబట్టి నేను కంక్లూషన్ కి వచ్చేస్తా లేండి ఊరి నేను సాగ తీయను ఒకటి మీ అభిప్రాయాలు మీరు వ్యక్తపరుచుకోండి అవసరమైతే వాటిని బలంగా చెప్పండి నేను ఇందాక చెప్పాను కదా లౌడ్ గా ఏమి చెప్పక్కర్లే పక్కింటి వాళ్ళకి వినపడేటట్టుగా లౌడ్‌గా చెప్పొద్దు అసర్టివ్ గా చెప్పండి చూడు మిస్టర్ ఇది నా అభిప్రాయం నేను దీని మీద నిలబడతాను నువ్వు ఏమ అనుకోవద్దు నన్ను మార్చాలని ప్రయత్నించుకో ప్లీజ్ ఓకే అనుకుంటే అవతల వ్యక్తి ఫీల్ అయినంత వరకు అగ్రెసివ్ కాడండి ఆలోచనలో పడతాడు లేదు ఇంకొక విధంగా
(08:38) చెప్పొచ్చు ఇగో నా అభిప్రాయం చెప్పాను కదా మనం కాసేపాగి సాయంత్రం దీన్ని డిస్కస్ చేసుకుందాం ఓకే డిస్కస్ చేసుకొని ఒక కంక్లూషన్ కి వచ్చేద్దాం అని నిజంగా గనుక అనుకున్నట్లయితే అది ఎంత విజ్ఞతతో కూడుకున్న విషయం అండి కదా అతే ఈ ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళలోనే ఏమైతున్నది అంటే ప్రేమించుకుంటున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధిపత్యం చలాయి ఇస్తూనే ఉంటారుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు స్వతంత్రం కలిగి ఉంటారు కదా ఆ స్వతంత్రపు వేడిలో ఆ ఇన్ఫాక్చుయేషన్ మోజులో పొరపాట్లు జరిగిన ఎవరో ఒకరు తగ్గి ఉంటారుగా తగ్గి ఉంటారు కదా తగ్గి ఉన్నప్పుడు అనుకోకుండా సరే పెళ్లి
(09:24) చేసుకుంటారు సరే పెద్దవాళ్ళు ఒప్పుకున్నారా లేదా అనేసి అనవసరం పెళ్లి అయితే చేసుకున్నారు ఓకే పెళ్లి చేసుకున్న తర్వాత ఏమవతుంది మీరు ఆలోచించారా అసలు అమ్మాయి అనుకుంటుంది ఈ అబ్బాయి నా సొంతం అని అబ్బాయి కూడా అలాగే అనుకుంటాడు కదా ఈమె నా సొంతం అని ఎప్పుడైతే ఒకళ్ళకఒకళ్ళు నా సొంతం అని అనుకున్నారో అప్పుడే సమస్య ప్రారంభం అయిపోయిందండి ఎలా ప్రారంభం అవుతుంది అన్నదానికి నేను మంచి ఉదాహరణ చెప్తాను అదేంటంటే కష్టపడి డబ్బులు దాచుకొని కొంత ఏదో లోనికి వెళ్లి ఒక మంచి కార్ కొనుకున్నారు పోనీబిmడబ కార్ అనుకుందాం.
(10:04) దాన్ని కొద్ది రోజులు ఏం చేస్తారు రోజు మూడు సార్లు తుడుస్తారు తలత మెరుస్తూ ఉండాలి అందులో మీ ప్రతిబింబం కూడా కనపడాలి మురిచిపోతారు. ఆ డ్రైవ్ చేసేటప్పుడు కూడాను అద్భుతంగా డ్రైవ్ చేస్తారు నలుగురికి చూపెట్టాలని నలుగురు చూడాలని డ్రైవ్ చేస్తారు వాళ్ళు లోపల కుళ్ళుకుంటూ ఉంటే మీరు సంతోషపడతారు. మెచ్చుకుంటూ ఉంటే ఎస్ నేను అనుకున్నాను అనుకున్నా సాధించాను అని చెప్పి గర్వంగా పొంగిపోతూ ఉంటారు ఇవన్నీ దొరుకుతూనే ఉంటాయి కదా ఎంత కాలం తుడుస్తారు ఎంత కాలం రోజుకి మూడు సార్లు తుడుస్తారు చెప్పండి 10 రోజులు తుడుస్తారు 15 రోజులు తుడుస్తారు 20 రోజులు
(10:35) తుడుస్తారు తర్వాత మీరు బయటికి తీసినప్పుడు తుడుద్దాంలే అని అనుకుంటారు కదా ఒక 10 రోజుల తర్వాత తీశరు అనుకోండి ఇప్పుడు దుమ్ము ఉంటుంది కదా అప్పుడు తుడుస్తారు రోజు తుడవరు కదా ఎందుకు తుడవరు మీరు ఆలోచించారా ఇది నా కారే నన్ను దాటిపోదు నేను ఉపయోగిస్తేనే అది కదులుతుంది. ఇది నా సొంతం అని అనుకుంటారు కాబట్టి మెల్లగా శ్రద్ధ తగ్గిపోతుందండి.
(11:03) సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు నా సొంతం అని ఒకళ్ళకఒకళ్ళు అనుకుంటూ ఉంటే ఏమైతుంది అంటే మెల్లమెల్లగా శ్రద్ధ తగ్గిపోతుంది. ఆ శ్రద్ధ తగ్గిపోతుంది. మరి అరేంజ్డ్ మ్యారేజ్ లో పరిస్థితి ఎలా ఉంటుందఅంటే అరేంజ్డ్ మ్యారేజ్ లో కూడా పరిస్థితి ఇలాగే ఉంటుంది. కాబట్టి నా సొంతము అని అనుకున్న తర్వాత నా చేయి జారి పోకూడదు అని అనుకోవాలి.
(11:29) నా చేయి జారి పోకూడదు అని అనుకున్నప్పుడు ఏమవుతుందంటే సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతారు అంతే తగ్గలేదు అనుకోండి మూర్ఖత్వమేగా తగ్గలేదు మూర్ఖత్వమే కదా తగ్గకపోతే ఏమవుతుంది జీవితం అనే కారు పాడైపోతుంది పాడైపోతుంది అద్భుతంగా ఉపయోగించుకోవాలి అని అనుకున్నప్పుడు 10 రోజుల తర్వాతనైనా శుభ్రంగా నీట్‌గా తుడిచి హాయిగా దాన్ని నడుపుకుంటే చూడడానికి బాగుంటుంది ఎంత నీ సొంతం అయినా జీవితం కూడా అంతేనండి నా సొంతం అనుకోవడం వరకు ఇబ్బంది ఏమి లేదు కానీ కేర్లెస్ గా దాన్ని అవతలు పడేసి నాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆడుకుంటాను అంటే ఇట్లాగా అంటే
(12:11) జీవితం అనేది అవసరం కాదండి అవసరం కాదు ఒకవేళ గనుక మీరు పెళ్లి చేసుకొని ఇలాగే గనక ప్రవర్తిస్తే మీరు ఆ పెళ్లిని అవసరం కోసం చేసుకున్నారు అబ్బాయి అమ్మాయి కోసం అమ్మాయి అబ్బాయి కోసం అవసరం కోసమే చేసుకున్నారు అవసరం ఏంటండి అవసరం పెళ్లి లేకపోతే బతకలేరా పెళ్లి లేకపోతే బతకలేరా ఏమిటి అవసరం అంటే ఇన్‌ఫాక్చువేషన్ అంతే 99% లవ్ మ్యారేజ్స్ అన్నీ కూడాను రెండేళ్ళు ప్రేమించుకున్న తర్వాత ఒకవేళ మ్యారేజ్ గనుక అయితే ఈ కారణాల వల్లే అంటే స్థాయికి మించి స్వతంత్రాన్ని ఉపయోగించుకోవడం వల్లే పాడైపోతున్నాయండి పాడైపోతున్నాయి ప్రేమించుకోవడం తప్పు కాదు
(12:56) పెళ్లి చేసుకోవడం తప్పు కాదు అని పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరినొకరు సమస్య వచ్చినప్పుడు కూర్చొని చర్చించుకొని 24 అవర్స్ లో ఎవరో ఒకరు సారి చెప్పేసి మళ్ళీ మామూలుగా నవ్వుతూ ఉండాలండి. లేకపోతే నష్టపోయేది మీరే చివరికి అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రులు బాధపడతారు. వాళ్ళ దగ్గరికి పోయినా ప్రయోజనం ఏం లేదండి.
(13:22) ప్రయోజనం ఏం లేదు అరే నాన్న సమస్య మీది మేము చెప్పాల్సినంత వరకు చెప్పాము వింటారా వినండి లేకపోతే లేదు ద బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీరే సర్దుబాటు చేసుకోండి కూర్చోండి ఆలోచించుకొని చర్చించుకోండి. ఎక్స్ట్రీమ్ కి పోతాను అంటారా పోండి మాకు సంబంధం ఏముంది ఇప్పుడు మేము చెబితే ఆగుతారా మీరు ఆగారు కదా ఎక్స్ట్రీమ్ కి పోయి మీరు ఏం చేసుకోవాలనుకుంటున్నారో అది చేసుకోండి.
(13:44) కానీ దాని వల్ల ఉపయోగం లేదని మేము చెప్తున్నాం. ఇప్పుడు నేను అమ్మ కూడా ఎన్నో సార్లు డౌడమ అనుకున్నాం అనుకున్నాం కానీ పిల్లల కోసం బతికాం సమాజం కోసం బతికాం మీరు కూడాను పిల్లల కోసం బతకండి సమాజం కోసం బతకండి కనీసం కనీసం కనీసం బతకండి. ఆ తర్వాత మీరిద్దరు ఆర్థికంగా స్వతంత్రులే బాధ్యతలు అయిపోయినాయి అనుకున్న తర్వాత మీ ఇష్టం మీ జీవితం అంతేగానీ ఒక వారసత్వాన్ని సమాజానికి అందించేటప్పుడు అద్భుతమైన పిల్లలని అందివ్వాలి వాళ్ళు మీ పేరుని నిలపాలి కనీసం దేశం పేరు నిలపకపోయినా
(14:28) అంతేగానీ పనికిరాని వారసత్వాన్ని సమాజానికి అందిస్తే వాళ్ళు మీకు పనికిరారు సమాజానికి పనికిరారు. అందుకనే వివాహం అనేది అవసరం కాదు అదిఒక ఆధ్యాత్మికత అని నేను మొన్న ఎప్పుడో వీడియోలో చెప్పానండి. కాబట్టి ఆలోచించండి పెళ్లిలు చేసుకున్న ఈ కొత్త దండలకి నేను చెప్పేది ఇదే అంతకంటే ఏం లేదండి నలుగురికి పంచండి నలుగురికి [గొంతు సవరించుకోవడం] పంచండి ఎందుకో మళ్ళీ చెప్పకుండా ఉండలేకపోతున్నానండి [నవ్వు] అనుకోండి మాట మాట అనుకోండి కానీ ఒక గంట తర్వాత ఒక పూట తర్వాత ఎవరో ఒకరు మళ్ళీ దగ్గరికి వచ్చి బోధ ఇచ్చేసి సారీ అనండి అబ లైఫ్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో మీకు
(15:09) తెలియదండి అహానికి పోవద్దండి అహం అనేది విషం విషం జీవితాలనే కాదు దేశాలను కూడాను ముంచేస్తున్నదండి ఆహం అనేది చూస్తున్నాం కదా ఇప్పుడు ఒక అమెరికా ఒక ఇరాన్ ఇంకో పక్క [నవ్వు] ఇజ్రయేల్ ఆ వీటన్నిటికీ మూలం అహమే కదా అహం ఉండాలండి నేను కాదంటలేదు కానీ ఉండవలసిన స్థాయిలో ఉండాలండి అది గనుక ఎక్కువ అయితే సమాజము వ్యక్తి కుటుంబము దేశము అన్ని నాశనం అయిపోతాయండి.
(15:43) నేను ఒకటి చెప్తున్నాను చూడండి మీ తల్లిదండ్రులైనా ఇదే మాట చెప్తారు నేనైనా ఇదే మాట చెప్తాను ఈవెన్ మటాధిపతి దగ్గరికి వెళ్ళండి ఇదే మాట చెప్తాడు చర్చి ఫాదర్ దగ్గరికి వెళ్ళండి ముల్లా దగ్గరికి వెళ్ళండి శృంగేరి పీఠాధిపతి దగ్గరికి వెళ్ళండి ఇవే చెబుతాడు అమ్మ కుటుంబ వ్యవస్థ బాగుండాలమ్మా బాగుంటే సమాజం బాగుంటుందఅమ్మా సమాజం బాగుంటే దేశం బాగుంటుంది తల్లి అని చెప్తాడా లేదా ఇంతకుమించిన జడ్జిమెంట్ ఏమనా ఉంటుందా అండి ఉండదు కదా కాబట్టి ఆలోచించండి ఆలోచించండి కొత్తగా పెళ్లి చేసుకున్నవాళ్ళు కానీ ఏదో ఆలోచనలు తన్నుక వస్తున్నాయండి నాకు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక వాగువేదం
(16:23) జరిగినప్పుడు ఆ పిల్లలు బిక్కు బిక్కుగా ఏం మాట్లాడలేని అసహాయ స్థితిలో ఉన్నప్పుడు మీ పోట్లాట అయిపోయిన తర్వాత పిల్లలు కూడా నిద్రపోయిన తర్వాత ఒక్క నిమిషం ఆ లేత లేత లేత లేత లేత ఆ పిల్లల మొహాల్ని గుర్తుకు తెచ్చుకోండి పసివాళ్ళు పాపం అమాయకులు బిక్కు బిక్కుమని చూస్తుంటారు జడ్జ్మెంట్ ఇవ్వలేరు ఏదనా మాట్లాడితే అరుస్తారేమో అన్న భయం మీ పిల్లలు కదండి ఏడుప వస్తుందా లేదా మీకు చెప్పండి ఏడుప వస్తుందిగా ఆ పిల్లల్ని తలుచుకున్నప్పుడు ఆ చిన్న చిన్ని మనసుల్లో ఈ మన కోపాన్ని మన విద్వేషాన్ని మన అహాన్ని మన పట్టుదలని నాటేస్తున్నాం ఏంటిరా బాబు ఆ
(17:07) పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు అని చాటుగా ఏడుస్తారండి మీరు నేను చెప్తున్నాను చాటుగా ఏడుస్తారు. మీకు తెలియదు అట్లా ఏడిచిన వాళ్ళు కూడా ఉన్నారండి పిల్లల కోసం బతకాలండి పిల్లలే భావి భారత్ పౌరులుండి కదా వాళ్ళని ఒక స్థాయికి తీసుకొస్తే అభాగ్యం నాదుకునే వృద్ధాశ్రమాలు వాళ్ళే పెడతారండి వాళ్లే పెడతారు. సో ఇంతకంటే ఎక్కువ చెప్పడం కూడా అనవసరం అండి ఏదో ఆవేశతో చెప్పాను సో ఇంతేనండి వినందుకు కృతజ్ఞతలు ఒకటే ఒక మాట షేర్ చేయండి షేర్ చేయండి పెళ్లి చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకే పనికొస్తుంది అంటే
(17:50) ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి పనికవస్తుంది. అట్లాగే తల్లిదండ్రుల మాట విని పెళ్లి చేసుకునే వాళ్ళకే పనికొస్తుంది చేసుకొని కొంత దూరం వెళ్ళిన వాళ్ళకి పనికొస్తుంది ఆ మాటక వస్తే టీనేజ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడాను పనికొస్తుందండి వీడియో అందరికీ పనికొస్తుంది వివాహ వ్యవస్థలో ఉన్న అందరికీ పనికొస్తుందండి.
(18:08) సో దయచేసి వీలైనది ఎక్కువ మందికి షేర్ చేయండి అంతేనండి నమస్కారం
No comments:
Post a Comment