Trust before love ముందు నమ్మకం. ఆ తర్వాతే ప్రేమ
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YXfFeP5ZgpQ
Transcript:
(00:00) విమానం ఎక్కుతాం కదండి మనం పైలట్ ఎవరో తెలియదు అందులో సిబ్బంది కూడా తెలియదు. ఆ మాటక వస్తే ఆ ఏరోప్లేన్ కంపెనీ అధినేత కూడా ఎవరో తెలియదు. ఆ విమానాన్ని ఎవరు తయారు చేశారో కూడా తెలియదు కదా తీరా ఎక్కిన తర్వాత ఎంత స్పీడ్ తో వెళ్తుందో తెలియదు ఎంత ఎత్తులో వెళ్తున్నది కూడా తెలియదు. ఏదో మనిటర్ లో చూపెడితే తప్ప కదా పోనీ ఎక్కే ముందు ఇంజన్ సరిగా ఉందా లేదా అన్న విషయాన్ని మనం కనుక్కున్నామా తెలుసుకున్నామా తెలుసుకోలేదు ఎందుకంటే మనక అసలు నాలెడ్జ్ కూడా లేదు కదా కాకపోతే ఏంటంటే ఒక నమ్మకంతో ఫ్లైట్ ఎక్కాము రెండు గంటలు అద్భుతంగా ప్రయాణం చేశము ఎంజాయ్ చేశం కూడా ఇక్కడ మనం
(00:46) వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే మరి వైవాహిక జీవితం అనే విమానాన్ని మనం ఎందుకు ఎక్కలేకపోతున్నాము అంతేనండి అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుందంటే [గొంతు సవరించుకోవడం] అంటే చాలా చోట్ల జరిగే పొరపాటు ఏంటంటే మీ జీవితంలోకి ప్రవేశించే జీవిత భాగస్వామికి మీరంటే తెలియకపోవడం అలాగే మీకు కూడాను ఆ జీవిత భాగస్వామి గురించి సరిగ్గా తెలియకపోవడం అంటే ఇక్కడ మిస్ అవుతున్నది ఏంటంటే నాలెడ్జ్ అలాగే వివరాలు కొద్దో గొప్ప నమ్మకం కదా నమ్మకం లేకపోవడమే తీరా నా జీవితంలోకి వీళ్ళు ప్రవేశిస్తే ఎట్లా ఉంటుందో నా జీవితం అని మీరే కాదు వాళ్ళు కూడా అనుకోవచ్చు కదా
(01:30) సో మరి ఏంటి పరిస్థితి అంటే నేను ఏమంటానఅంటే ఈ నాలెడ్జ్ మీకు ఉండాలి ఈ నమ్మకం మీకు ఉండాలి ఈ వివరాలు కూడాను మీకు తెలిసి ఉండాలండి మరి ఏం చేయాలి సింపుల్ మీ అందరికీ తెలుసు పరిచయాలు పెంచుకోవాలి కదా ఏ వ్యక్తినైతే మనం జీవితంలోకి ఆహ్వానిస్త స్తున్నామో ఆ వ్యక్తి యొక్క పరిచయాన్ని ముందు మనం పెంచుకోవాలి. వ్యక్తిత్వం తెలుసుకోవాలి అలాగే కుటుంబ నేపథ్యం గురించి కూడా తెలుసుకోవాలి అలవాట్లు అభిరుచులు కూడా తెలుసుకోవాలండి.
(02:04) ఇవేం తెలుసుకోకుండా వివాహం అనే ఫ్లైట్ ఎక్కి చేసామ అనుకోండి తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మ్యారేజ్ బూరో వాళ్ళ దగ్గరికి వెళ్తారు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి పర్టికులర్స్ కానీ ఎవ్వరి వివరాలు కూడాను వాళ్ళకి డీప్ గా తెలియదండి వాళ్ళు అవసరానికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళు నోట్ చేసుకున్నారు.
(02:30) ఏదో బేసిక్స్ కుదిరాయి కాబట్టి మీరు మీరు చూసుకోండి అంటారు వాళ్ళు అంతకంటే ఏం చేయలేరు కూడా వాళ్ళు లేదు ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తారు. తెల ఆ తెలిసిన వాళ్ళకి వాళ్ళ గురించి డీప్ గా తెలుసా పిల్లల గురించి తెలుసా తెలియదు కారణం ఏంటంటే చిన్న కుటుంబాలు ఎవరి పరుగులో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఓవరాల్ గా మంచి కుటుంబం అంటారు కానీ అట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు వేస్తారంటే పాపం వాళ్ళు కూడా వేయలేరు కాబట్టి విషయం ఎక్కడ దాగుతుందంటే తల్లిదండ్రులు గాని లేకపోతే పిల్లలు గాని వివరాలన్నీ తెలుసుకొని ఉండాలండి లేకపోతే చాలా కష్టం వైవాహిక జీవితం అనే ఫ్లైట్ క్రాష్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది క్రాష్
(03:12) అవుతున్నాయి కూడా కదా కాబట్టి ఇది వ్యక్తిగత బాధ్యత అండి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ ప్రేమించండి తప్పులేదు కానీ ఆ ప్రేమించడం ఎలా ఉండాలంటే ఇందాక నేను చెప్పాను కదా అన్ని వివరాలు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాతనే ఒక నిర్ణయానికి రావాలి. అంతేనండి విమానం ఒక నమ్మకం మీద ఎక్కేస్తున్నాం కానీ వైవాహిక జీవితం అనే విమానాన్ని కూడాను ఎన్నో వివరాలు సేకరించి కొంతకాలం ఓపిక పెట్టి మనుషులని మనసులని అర్థం చేసుకని అప్పుడు ఈ విమానం ఎక్కాలండి ఇది చాలా ముఖ్యంండి సో ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నది వినందుకు కృతజ్ఞతలు నమస్కారం వీలైనంత ఎక్కువ మందికి షేర్
(03:59) చేయండి
No comments:
Post a Comment