Thursday, January 27, 2022

నదుల నుండి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక అంశములు

నదుల నుండి మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక అంశములు:-

1. Commitment
2. Detachment
3. Flexibility
4. Service

1. Commitment:- అనగా లక్ష్యం. నది ఎక్కడ జన్మించినా దాని అంతిమ లక్ష్యం ఏమిటంటే - సముద్రాన్ని చేరే దాకా దాని పయనం ఆపదు.
➡️ ఇదే విధంగా మనం, మన ఆత్మ తత్వంలోకి చేరే దాకా మన సాధన ఆగకూడదు.

2. Detachment:- అంటకుండా ఉండటం. సముద్రానికి పయనమైన నది, మార్గమధ్యంలో అందమైన ప్రకృతి ప్రదేశాలను లేదా రాళ్ళు రప్పలు, ముళ్ల మీద కూడా పయనమవుతూ ఉంటుంది. అంతేగాని ప్రకృతి బాగుంది కదా అని అక్కడే ఉండదు, ముళ్లబాట అనీ వెళ్లకుండా ఉండదు.
➡️ అట్లే మనం కూడా మన జీవితంలోని సంతోషాలైన, కష్టాలెదురైనా దేనికి అంటకుండా మన జీవితాన్ని సాగించవలెను.

3. Flexibility:- మార్పుని ఏకీభవించడం. నది విశాల ప్రదేశంలో విశాలంగాను, సన్నటి మార్గంలో సన్నగాను, లోతైన ప్రదేశములో లోతుగా ఇమిడిపోయి ప్రయాణించును.
➡️ అదేవిధంగా మనం కూడా దేహానుగుణమైన, కాలానుగుణమైన, ఆర్థికపరమైన మరి ఏ విధమైన మార్పునైన ఏకీభవిస్తూ జీవించాలి.

4. Service:- నిస్వార్థమైన సేవ. నది తను వెళ్ళే దారిలో
మనకు చేసే నిస్వార్థమైన సేవలు - తాగడానికి, వాడుకోవడానికి, స్నానాలకు, పంటలకు మొదలైనవి.
➡️ అదే విధంగా మన కార్యకలాపాలను నిర్వర్తిస్తూ మనం వేరే వారికి మనం వెళ్లే దారిలోనే నిస్వార్థమైన సేవను అందించాలి.

మనం నిరంతర ఆధ్యాత్మిక, ధ్యాన సాధన ద్వారా అంతిమ లక్ష్యమైన ఆత్మతత్వంలో చేరే దారిలో - దేనికి (భవబంధాలకు) అంటకుండా,
మార్పులను ఏకీభవిస్తూ, నిస్వార్ధమైన ధ్యాన, ఆధ్యాత్మిక ప్రచారాన్ని చేయాలి.

సేకరణ

No comments:

Post a Comment