Saturday, January 1, 2022

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులైన మీకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు మా ఇంటి దైవం రామభక్త వినుకొండ శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు మరియు తిరుత్తని సుబ్రమణ్య స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...
మంగళ వారం --: 21-12-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు

ప్రపంచంలో పగటికి సూర్యుడు రాత్రికి చంద్రుడు ఉన్నట్టుగానే ప్రతి మనిషికి ఒక ప్రాణ స్నేహితుడు ఉండాలి . అప్పుడే ఒక రోజు నిండుతుంది . ఒక జీవితం నిండుతుంది .

మనం మాట్లాడే నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది . మన వల్ల ఇబ్బంది పడే వారికి మన నుండి దూరం కోరుకునే వారిని ఇబ్బంది పెట్టకుండా మనమే దూరంగా ఉండటం మంచిది . మనం ఒకరిని ఎక్కువగా నమ్మడం వలన రెండు రకాల ఫలితాలు ఎదురు కావచ్చు ఒకటి మనకు జీవితాంతం తోడుండే ఓ మిత్రుడు మరోక్కటి మనకు జీవితాంతం గుర్తుంచుకో దగిన గుణపాఠం .

ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నది వారి నిజస్వరూపం మనముందు ఎలా ఉన్నారో మన వెనకాల కూడా అలా ఉన్నవారే మనల్ని నిజంగా అభిమానించేవారు . అలాంటి వారిని ఎప్పుడూ వదులుకోకూడదు

సేకరణ ✒️ మీ ... AVB సుబ్బారావు 🤝🕉️💐🌹

సేకరణ

No comments:

Post a Comment