Thursday, January 27, 2022

నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ?

నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ?
???????????????
చాలా సార్లు చాలా సందర్భాలలో మనము పై వాక్యము విని ఉంటాము. చాలా మంది దగ్గర. అలా అనే వాళ్ళకే ఇంకా ఇంకా సమస్యలు వస్తాయి. ఎందుకు ఇలా అనే దానికి గురుదేవులు ఈ క్రింద కథలు చెప్పారు.

ఒకేసారి పార్వతి దేవి వ్యాహ్యాళికి వెళ్తూ తన దృష్టిని భూలోకముపై సారించింది. అక్కడ ఒక పేద భార్య భర్తలను చూసింది. ఆ భర్త జీవించటానికి చాలా కష్టము చేస్తాడు. కానీ వాళ్లకి ఆ ధనము సరిపోదు. అతను భార్యతో నేను ఎంత కష్ట పడినా మనకి ధనము లభించటం లేదు. మనము ఎప్పుడు ధనవంతులము అవుతామో తెలియటం లేదు. అసలు భగవంతుడు వున్నాడా అని అనిపిస్తుంది. ఎందుకంటె మన దగ్గర లేదు ఇంకా ఏదో ఒక రూపములో మన దగ్గర నుండి తీసుకుంటున్నాడు అని అంటాడు . అప్పుడు భార్య అలా అనవద్దు. మన పూర్వ జన్మ కర్మ వలన మనము ఇలాంటి పరిస్థితిలో ఉన్నామేమో? భగవంతుడు వున్నాడు. అంతా ఆయనే చూసుకుంటాడు బాధ పడవద్దు అంటుంది.

పార్వతి మాత ఈ మాటలు వింటుంది. ఆ స్త్రీ మంచి మనసు కలిగిన దానిలా వుంది. అతను కూడా మంచిగానే కనిపిస్తున్నాడు. వీళ్ళకి ఏదన్నా చెయ్యాలి. కానీ అమ్మకి ఒక ప్రశ్న వస్తుంది. వీళ్ళు ఇద్దరు ఇంత మంచి వాళ్ళుగా వున్నారు కానీ ఎందుకు ఇంత కాస్త పడుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానము చెప్పకలిగినవారు ఒక్కరే అది మహాదేవులే అని తలచి శివుని దగ్గరకు వెళ్తుంది.

అమ్మ అంటుంది "మీరు ఎందుకు ఈ సృష్టిని ఇలా సృష్టించారు. (చూడండి అమ్మ ఇంకా గుర్తించలేదు తాను ఎవరు అని. అమ్మకి ఇంకా శిక్షణ నడుస్తుంది. మనలాగా !) . ఎందుకు మీ సృష్టిలో ఇంత అసమానత వుంది. వున్న వాళ్లకి ఇంకా ఇస్తున్నారు. లేని వాళ దగ్గర నుండి తీసుకుంటున్నారు. (మీరు వినేవుంటారు "ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు అని. చూడండి అమ్మ అన్ని ప్రశ్నలు అడిగేసింది. అంటే సమాధానము ఇప్పటికే సిద్ధముగా వుంది. ) . అప్పుడు శివ అన్నారు సిద్ధాంత పరముగా తెలుసుకోవాలి అనుకుంటున్నావా లేక ఆచరణ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నావా ? అప్పుడు అమ్మ ఆచరణ ద్వారా తెలుసు కోవాలి అని అనుకుంటున్నాను అన్నది. నేను అనుభవించాలి అనుకుంటున్నాను అన్నది.

ఇద్దరు భూలోకము వెళ్లారు. పార్వతి దేవి అన్నది చూడండి ఇతను చాలా పేదవాడు. మీరు కావాలి అనుకుంటే ఏమైనా ఇవ్వచ్చు. అతనికి సహాయము చేయండి అని అన్నది. శివయ్య అతని విధి లో అది లేదు అన్నారు. అమ్మ అతని విధి లో లేకపోయినా మీరు ఇవ్వతలుచుకుంటే ఇవ్వచ్చు ఇవ్వండి అని అడుగుతుంది. సరే అని శివయ్య ఒక బంగారు నాణెములు వున్న సంచి ఒకటి వాళ్ళు వచ్చే దారిలో విసిరివేస్తారు.

ఆ భార్య భర్త మాట్లాడుకుంటూ వస్తున్నారు. భార్య ఒక ఉదాహరణగా చెప్తుంది చూడండి మీరు జీవితములో చాలా లేవు అని బాధపడుతున్నారు. కానీ కళ్ళు లేని వాళ్ళని చూడండి. వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో? అప్పుడు భర్త అవును అవును మనకి కళ్ళు వున్నాయి. వాళ్ళు కళ్ళు లేకుండా జీవించటం నిజముగా ఒక సవాలు. వాళ్ళకంటే మన జీవితము నయమే. వాళ్ళు ఎలా నివసిస్తున్నారో అంటాడు. అప్పుడు భార్య ఇవ్వాళా నువ్వు భగవంతుని గురించి చాలా అన్నావు. ఒక పని చేద్దాం. మన కళ్ళు మూసుకుని వాళ్ళు ఎలా అనుభవము పొందుతారో మనము అలా అనుభూతి పొందటానికి ప్రయత్నిద్దాం అంటుంది. వాళ్ళు ఆవిధముగా నడుస్తూ ఆ సంచి దాటి ముందుకు వెళ్ళిపోతారు. అప్పుడు శివయ్య నవ్వుతారు. చూడు నేను ఇచ్చాను కానీ వాళ్ళు తీసుకోలేదు అంటారు.

(గురుదేవులు అంటున్నారు చాలా సార్లు మీరు ఇలానే చేస్తారు. నేను ఇస్తాను కానీ మీరు దానిని గుర్తించకుండా వదిలేసుకుంటారు అని. గురుదేవ మా విన్నపము మళ్ళీ మేము ఇటువంటి తప్పు చేయకుండా దయచేసి మాకు మీ కరుణ, దయ ప్రసాదించి మీరు ఇచ్చేది మేము గుర్తించే విధముగా మమ్మల్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాము )..

మనకి ఇంతవరకు తెలుసు. ఇది కథ యొక్క ఒక భాగము. కానీ కథ యొక్క ఇంకొక భాగము మీరు వినివుండరు అంటున్నారు గురుదేవులు. అది ఈ క్రింది విధముగా చెప్పారు.

పార్వతి అంటుంది. సరే కానీ నేను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. నాకు అర్ధము అయ్యింది అతని విధిలో అది లేదు కాబట్టి అతనికి దక్కలేదు. కానీ నేను ఇది తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు. ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు. శివ అంటారు సరే అలాగే మన రూపాలు మార్చుకుందాము.

ఇద్దరు మనుష్య రూపము ఎత్తి గ్రామములో ప్రవేశించి ఒక చిన్న ప్రదేశములో ఆ రాత్రికి విశ్రమిస్తారు. కానీ వాళ్ళు మనుష్యులుగా వచ్చారు కాబట్టి మనుష్యులగానే జీవించాలి కదా ? అప్పుడు శివ అంటారు. ఒక పని చెయ్యి. మనము ఈ రాత్రి ఈ భూలోకములో వున్నాము కాబట్టి నువ్వు వంటచెయ్యి నేను భుజిస్తాను అంటారు. అప్పుడు మాత అంటుంది ఇది నీ నాటకము కాబట్టి నీవు వంటకు సరిపడా వస్తువు తీసుకురా నేను వంట చేస్తాను. శివ సరే అని వెళ్తారు. అప్పుడు అమ్మ పొయ్యి తయారు చేయాలి అని అనుకుంటుంది. దానికి ఇటుకలు , మట్టి కావాలి. ఇటుకల కోసము అమ్మ ఊరిలోకి వెళ్తుంది. అలా వెళ్తూవుంటే దారిలో ఒక కొంత పడిపోయిన ఇల్లు కనపడుతుంది. అక్కడ ఇటుకలు వున్నాయి. అమ్మ అక్కడనుండి ఇటుకలు తీసుకు వచ్చి పొయ్యి తయారు చేస్తుంది.

శివయ్య వస్తారు కానీ వట్టి చేతులతో వస్తారు. సామగ్రి ఏవి అని అమ్మ అడుగుతుంది. నీ ప్రశ్నకు సమాధానము వచ్చింది కాబట్టి నేను ఇంకా అవి తీసుకు రాలేదు. మనము ఇంకా వెళ్లిపోవచ్చు కదా అంటారు. అప్పుడు అమ్మ నాకు సమాధానము ఎప్పుడు వచ్చింది అంటుంది. స్వామి అంటారు నీ ప్రశ్న ఏంటి అని ? "పేద వాళ్ళు ఇంకా ఎందుకు పేదవాళ్ళు అవుతున్నారు. వాళ్ళ దగ్గర నుండి ఎందుకు ఇంకా లాక్కోపడుతున్నాయి ? ధనవంతులు ఇంకా ధనవంతులు ఎందుకు అవుతున్నారు ?" అప్పుడు శివ అంటారు నువ్వు ఇటుకలు ఎక్కడ నుండి తెచ్చావు అని? అమ్మ అంటుంది అక్కడ ఒక పడిపోయిన ఇల్లువుంటే అక్కడనుండి తెచ్చాను అని చెప్తుంది.
అప్పుడు శివయ్య అక్కడ నుండి ఎందుకు తెచ్చావు. బలముగా వున్న ఇంటి నుండి తీసుకు రావచ్చు కదా ! ఇల్లు ముందే పడిపోయివుంది నువ్వు దానిని ఇంకా ఎందుకు పడగొట్టావు అని అంటారు? అప్పుడు పార్వతి కానీ గట్టిగ వున్న ఇంటి నుండి ఎలా తీసుకు వస్తాను అంటుంది. దానిని ఎలా పడగొడతాను అని అంది.

ఎవరైతే వాళ్ళ సంరక్షణ సరిగా చేసుకోలేరో వాళ్ళు పడిపోతారు. అందరు వాళ్ళ నుండి తీసుకు వెళ్తారు. ఎవరైతే వాళ్ళ సంరక్షణ సరిగ్గా చేసుకుంటారో వాళ్ళని ఎవరు పడెయ్యలేరు. వాళ్ళ దగ్గరనుండి ఏది తీసుకోలేరు. ఎందుకంటె వాళ్ళని వాళ్ళు చాలా జాగ్రత్తగ చూసుకున్నారు.

గురుదేవులు అడుగుతున్నారు ఏవిధముగా జీవించాలి ? మనము కనుక మనలని అంత బలమైన స్థితిలో ఉంచుకుంటే ఎవరు ఒక్క ఇటుక కూడా తీసుకోలేరు. ఒకవేళ మనము బలహీనమైన స్థితిలో ఉంటే అందరు వచ్చి మనదగ్గర నుండి తీసుకు వెళ్తారు.

అంటే సత్సంగము ఏమి చేస్తుంది అంటే ఈ మరమ్మత్తు చేస్తుంది. విరిగిన మన ఇటుకలు సత్సంగము వలన ఇంకా గట్టిగ అతుక్కుని బలముగా తయారుచేస్తుంది. ఇది తెలుసుకోలేకపోతే రేపటి రోజు మనుషులు రావచ్చు, దేవతలు రావచ్చు , మృత్యువు రావచ్చు. అన్ని మననుండి తీసుకు పోవచ్చు. కానీ ఒకవేళ నువ్వు నీ గురించి బాగా జాగ్రత్త తీసుకుంటే అప్పుడు మృత్యువు కూడా నీ నుండి ఏమి తీసుకు వెళ్ళలేదు. ఈ జాగ్రత్త ఎలా తీసుకోవాలి అంటే దీనికి సత్సంగములు, ధ్యానము, గురు సన్నిధి అన్ని సహాయపడుతాయి.

బలహీనులు ఇంకా బలహీనులు ఎందుకు అవుతున్నారు అంటే అజ్ఞానముతో వుండటము వలన. ఏవిధముగా వాళ్ళని వాళ్ళు బలపరుచుకోవచ్చో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు చాలా మంచి జీవితము అనుభవిస్తారు.

కాబట్టి మనము ఎలా జీవించాలి అని అనుకుంటున్నామో ఆలోచించుకోమంటున్నారు గురుదేవులు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment