🙏🕉🙏 ..... *"శ్రీ"*
🪷🪷 *"44"* 🪷🪷
🪷🪷 *"కర్మ - జన్మ"* 🪷🪷🪷
🌼🪷🌼🪷🌼🪷🌼
🌼🪷🕉🪷🌼
🌼🪷🌼
🌼
*కర్మల బట్వాడా*
****************
*"ఈ జన్మలో అనుభవించిన ప్రారబ్ధ కర్మలు పోను, మిగిలిన పూర్వ జన్మల్లోని సంచిత కర్మలని, ఈ జన్మలో చేసిన ఆగామి కర్మలన్నింటినీ ఆఖరి శ్వాసతో ప్రతి జీవి తర్వాతి జన్మకి తీసుకువెళ్తుంది. వాసనలని గాలి ఎలా తీసుకువెళ్తుందో, అలా కర్మలన్నింటినీ శ్వాస తీసుకువెళ్తుంది. సూక్ష్మ శరీరం ఈ కర్మలతో ఏర్పడుతుంది. అదే జడ శరీరాన్ని ఆవరించుకుని ఉండేది."*
*"అర్థా గృహే వివర్తంతే స్మశానే మిత్ర బాంధవా*
*సుకృతం దుష్కృతం చైవ గచ్ఛన్తమనుగచ్ఛతి*
*భావం:-*
**********
*మరణించిన మనిషి సంపద తన ఇంట్లోనే ఉంటుంది. బంధు మిత్రులు స్మశానం దాకే వస్తారు. వెంట వచ్చేవి మనిషి చేసుకునే దుష్కర్మలు, సుకర్మలు మాత్రమే.*
*కర్మని బట్టే పునర్జన్మ*
**********************
*"కర్మ వల్లే జన్మ అనేది వస్తుంది. ఓ జన్మలో ఓ జీవి చేసిన కొంత కర్మ తాలూకు ఫలాన్ని ఆ జీవి ఆ జన్మలో అనుభవించగా ఇంకా కొంత మిగిలితే, ఆ శేష కర్మ ఫలాన్ని అనుభవించడానికి మరో జన్మని తీసుకుంటాడు."*
*"మళ్ళీ ఆ రెండో జన్మలో ఈ ఫలాన్ని అనుభవిస్తూ చేసే కొత్త కర్మని అనుభవించడానికి మళ్ళీ కొన్ని పునర్జన్మలని పొందుతాడు. ఇలా కర్మ, జన్మ, మళ్ళీ కర్మల చక్రంలో జీవులమైన మనమంతా ఎంతో కాలంగా చిక్కుకుని తిరుగుతున్నాం. ఈ కర్మ చక్రం గురించి శ్రీ ఆది శంకరాచార్య భజగోవిందంలో ఇలా చెప్పారు."*
*''పునరపి జననం పునరపి మరణం*
*పునరపి జననీ జఠరే శయనం"*
*భావం:-*
*********
*"మళ్ళీ మళ్ళీ పుడతారు, మరణిస్తారు, తిరిగి తల్లి గర్భాన పడతారు".*
*"మనిషిలో మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే దాన్ని బట్టి తర్వాతి జన్మ లభిస్తుందని (గీత 14 -15) శ్రీకృష్ణుడు చెప్పాడు. తమో గుణ ప్రధానులకి జంతు జన్మలు వస్తే, రజో గుణస్థులు మనుషులుగా పుడతారు. సత్వ గుణస్థులు ఆథ్యాత్మిక సంపద అధికంగా గల ఇళ్ళల్లో పుడతారు."*
*"రజసి ప్రలయం గత్వా కర్మసంగిషు జాయతే*
*తథా ప్రలీనస్తమసి మూఢయోనిషు జాయతే"*
*భావం:-*
**********
*"రజోగుణం వృద్ధి చెందినప్పుడు మరణిస్తే, అతడు కర్మంటే ఆసక్తి గల మనుషుల్లో పుడతాడు. అలాగే తమో గుణం అధికమైనప్పుడు మరణించిన మానవుడు పశు పక్షి కీటకాది నీచ యోనుల్లో పుడతాడు".*
*"సత్వగుణ సంపన్నులు వచ్చే జన్మలో ఎలా పుడతారు?"*
*"యదా సత్త్వే ప్రవృద్ధే తు ప్రళయం యాతి దేహభృత్*
*తదోత్తమవిదాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే"*
- గీత 14-14
*భావం:-*
***********
*"సత్త్వ గుణం ఎక్కువగా ఉన్నప్పుడు మరణిస్తే అతడు ఉత్తమ కర్మలని ఆచరించేవారు చేరే నిర్మలమైన స్వర్గం మొదలైన దివ్య లోకాలని చేరుతాడు."*
*"యోగ భ్రష్టుడు స్వర్గం మొదలైన దివ్య లోకాలలో అనేక సంవత్సరాలు గడిపాక పవిత్రులు, ధనవంతులు ఐనవారి ఇంట్లో పుడతాడు. (8-41) ఒకోసారి పై లోకాలకి పోకుండానే అతను జ్ఞానులైన వారి కుటుంబంలో పుడతాడు."*
*"ఐతే ఇది చాలా దుర్లభ జన్మ. (గీత 8-42) లేదా ఆథ్యాత్మికంగా వున్నత స్థితిలోని యోగి కుటుంబంలో పుట్టి తిరిగి తన సాధనని కొనసాగిస్తాడు. (గీత 8-43)"*
*"దీన్ని బట్టి మరణ సమయంలో ఏ గుణం అధికంగా వుంటే తిరిగి అదే గుణంతో, అదే గుణానికి చెందిన జీవిగా పుడతారని తెలుస్తోంది. చేసిన కర్మలు కూడా మనిషి తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి."*
*"సుకర్మలు అధికంగా ఉంటే మనిషి జన్మ, మరీ అధికంగా ఉంటే ఉత్తమ మానవ జన్మ, దుష్కర్మలు అధికంగా ఉంటే జంతువు, పక్షి, లేదా కీటకం, వృక్షాలు లాంటి జన్మలు వస్తాయి అని శాస్త్రం చెప్తోంది. మన కర్మని బట్టే దేవుడు మనల్ని సృష్టిస్తున్నాడు. (గీత 9-8)"*
*"ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః*
*భూత గ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్"*
*భావం:-*
************
*"తమ తమ స్వభావ వశంలో పరతంత్రమైయున్న భూత సముదాయాన్ని నా ప్రకృతి నాశ్రయించి మాటిమాటికీ వాటి కర్మానుసారం సృష్టిస్తున్నాను."*
*"శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో కర్మ మరు జన్మకి ఎలా దారితీస్తుందో వస్తుంది. నిష్కారణంగా భార్యని హింసించిన భర్త బాల వితంతువుగా ఏడు సార్లు పుడతాడు."*
*"ఓ పురుషుడు నలుగురైదుగురు స్త్రీలని వివాహం చేసుకుంటే, తర్వాతి జన్మలో ఆ పురుషుడు స్త్రీగా జన్మిస్తాడు. అతని మీద తమ కామ వాసనలు నశించని స్త్రీలు పురుషులుగా జన్మించి, ఆ స్త్రీని అనుభవిస్తారు. ఒకే జన్మలో ఇది జరిగితే వ్యభిచార దోషం కలుగుతుంది."*
*"వేరు వేరు జన్మల్లో వివాహం చేసుకుంటే ఆ దోషం ఉండదు. కర్మ ప్రభావాన్ని బట్టి ఇది జరుగుతుంది. భార్యాభర్తలని విడదీసిన పాతకులు స్త్రీ, పురుష జన్మ కాని నపుంసక జన్మని ఎత్తి, సంసార సుఖం అంటే ఏమిటో తెలీక మనస్థాపాన్ని అనుభవిస్తారు."*
*"తీరని తీవ్రమైన కోరిక కూడా తర్వాతి జన్మని నిర్ణయిస్తుంది. మరణించే సమయంలో మామిడి పండు తినాలన్న కోరిక కలిగితే, తర్వాతి జన్మలో మామిడి పండులో పురుగుగా పుట్టచ్చు. మరణించేప్పుడు ఆఖరి శ్వాస సమయంలో ఏ ఆలోచన కలిగితే ఆ ఆలోచన ఫలితమైన జన్మ తర్వాతి జన్మగా వస్తుంది. ఇది భగవద్గీతలోని మాట (గీత 8-6)"*
*"ఓ ప్రవచనంలో స్వామి సుందర చైతన్యానంద ఇలా అన్నారు."*
*“మన సంకల్పాలే మన తర్వాతి జన్మని నిర్ణయిస్తాయి. ఆబ్బాయిలంతా తన వెంట పడాలనే కోరిక గల అమ్మాయి సంకల్పం ఈ జన్మలో తీరకపోతే, తర్వాతి జన్మలో ఆడ కుక్కగా పుడుతుంది. మగ కుక్కలన్నీ ఏక కాలంలో ఆ ఆడ కుక్క వెంట పడుతూంటాయి.”*
*"దీన్ని బట్టి చిన్న లేదా పెద్ద కోరికలని ఉంచుకోవడం మంచిది కాదని అర్ధమవుతోంది. అందుకే వైరాగ్యానికి వేదాంతంలో పెద్ద పీట వేసారు."*
🌼🪷🌼🪷🌼
🌼🕉🌼
No comments:
Post a Comment