చిగురించిన వెదుళ్ళు
🚩🚩
మనసు నిర్మలంగా వుంటే జీవితం, భవిష్యత్ సాఫీగా సాగుతుందని పెద్దలంటారు.
అంతరంగంలో చెడు ఆలోచనలు
పేరుకోకుండా చూసుకోవాలి.
ఈ సందేశాన్ని బోధిస్తూ శుక మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఒక కధ
చెప్పారు
ఒక ముని వెదురు చెట్లతో నిండిన అడవి మార్గం గుండా
వెడుతూవున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా
రెండు వెదురు చెట్లు బలంగా ఒకదానితో ఒకటి రాసుకున్నాయి. ఆ రాపిడికి
మంటలు లేచాయి. అదే సమయాన తీవ్రమైన గాలి వీచడంతో ఆ అడవి మొత్తం
మంటలలో భస్మమైపోయింది.
పచ్చ పచ్చగా వున్న ఆ ప్రదేశమంతా మండి
మసి అయిపోయింది.
ఇది చూసిన ఆ మునీశ్వరుడి హృదయం ద్రవించిపోయింది.
కొన్ని మాసాలు గడిచిపోయాయి.
ఆ ముని మళ్ళీ అదే అడవి మార్గం గుండా వెళ్ళాడు. మండి బూడిదైపోయిన అయిన ఆ వనమంతొ
తిరిగి చిగురించి పచ్చగా దట్టంగా
ఎదిగింది.
ఈ పరిణామం చూసాక ఆ మునికి ఒక సంగతి అర్ధమైనది.
నేలమీద మట్టికి పైన వున్న చెట్ల భాగాలు మాత్రం అగ్నిజ్వాలలో భస్మమయ్యాయి.
భూమికి అడుగున కనపడకుండా వుండే చెట్లవేళ్ళను అగ్ని జ్వాలలు ఏమీ చేయలేదు.
అందువలన వానలు పడగానే చెట్లు మరల
చిగురించాయి. అడవి పునర్జీవం పొందింది.
మనిషి మనసు అంతే. చెడు ఆలోచనలు మనసు లోతుల్లోకి
వెళితే జీవితం అతలాకుతలం అవుతుంది.
మనసును నిర్మలంగా వుంచుకుంటే
జీవితంలో సుఖ సంతోషాలు వృధ్ధి చెందుతాయి. మనం నిర్మలమైన
మానసిక శక్తిని వృధ్ధి చేసుకునేందుకు
ప్రయత్నించాలి. చెడును దరి చేరనీయకూడదు.
No comments:
Post a Comment