*🕉️ జై శ్రీమన్నారాయణ 🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
*_🌴" సాధన అంటే జపధ్యానాదులూ, దండకములూ, పఠించడం కాదు. సేవయే నిజమైన సాధన. సేవ కోసం మీ సంసారాలను విసర్జించమని గాని, ఉద్యోగాలను, ఆస్తిపాస్తులను వదలిపెట్టమని గాని దైవము చెప్పలేదు. దినమునకు ఇరవై నాల్గు గంటలలో ఒక్క అరగంట సేవ చేయడానికి ఎందుకు సాధ్యం కాదు? ప్రభుత్వంకోసం, వారిచ్చే డబ్బుకోసం ఎనిమిది గంటలు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. అయితే, భగవదనుగ్రహానికి ఇంత, అంత అని హద్దు లేదు. మీరు చేసినదానికంతా మీ పేరున ఒక పెద్ద నిధి ఏర్పడుతుంది. వ్యాపారం ద్వారా, ఉద్యోగంద్వారా ధనం సంపాదించుకొంటున్నట్లుగానే మీరు న్యాయంగా జీవిస్తూ సేవాకార్యంలో నిమగ్నమైనప్పుడు దానికి మించిన దైవానుగ్రహ ధనం మీకు ప్రాప్తిస్తుంది. ఇట్టి అనుగ్రహ ధనమును మీరు సంపాదించుకోవాలిగాని, తుచ్ఛమైన భోగభాగ్యములు ఎంత సంపాదించుకొని ఏమి ప్రయోజనం?! భోగములన్నీ రోగములు. సేవలన్నీ యోగములు."🌴_*
No comments:
Post a Comment