*🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*
భక్తులు భగవంతునికి సమర్పించవలసినది పువ్వులు, ఆకులు, పండ్లు మరియు ఇతర తినదగినవి కాదు! ఇవన్నీ తాత్కాలికమైనవి. మార్పు చెందేవి. మార్పు చెందనిది ఏదైతే ఉందో అది భగవంతునికి సమర్పించుకోవాలి. అదే మన హృదయం, మనస్సు. అయితే మనస్సు నిండుగా కోరికలను నింపుకుని భగవంతునికి అర్పిస్తామంటే అది అంత సులువుగా కదలదు! మనస్సు అన్నింటినీ కాల్చివేసిన బూడిద వలె కోరికలు లేకుండా మరియు నిర్లిప్తంగా మారాలి. ఆ విధమైన స్వచ్ఛమైన మనస్సునే దేవుడికి అర్పించాలి. అదే సరైన నివేదనం..🌴
No comments:
Post a Comment