Thursday, July 21, 2022

ప్రయోజనం కలిగించే విషయాల్లో కంటే మనసు ఇతర విషయాలపై శ్రద్ధ చూపటాన్ని ఎలా నిరోధించాలి ?

 💖💖💖

        💖💖 *"286"* 💖💖

💖💖 *"శ్రీరమణీయం"* 💖💖

     


*"ప్రయోజనం కలిగించే విషయాల్లో కంటే మనసు ఇతర విషయాలపై శ్రద్ధ చూపటాన్ని ఎలా నిరోధించాలి ?"*

**************************


*"అందుకే పూజలు, ఆరాధనలు అవసరం అవుతాయి. ప్రతిపనిలో శ్రద్ధగా ఉండగలగటమే కాదు అవసరమైతే ఆ పని నుండి అంత సులభంగా తప్పుకోగలగటమే నిజమైన యోగం. టివీ చూస్తున్నప్పుడు కరెంట్ పోయినా, తెలిసిన వారు వచ్చినా అంతరాయం కలుగుతుందని విసుగుచెందుతాం. ఇష్టమైన విషయాల్లోనే కాదు, మనకు ఇష్టం లేకున్నా అవసరాన్ని బట్టి శ్రద్ధ పెట్టటం మనసుకు అలవాటు చేయాలి. మన మనసుకు ఏకాగ్రత అనే లక్షణం సహజంగానే ఉంది. కాకపోతే అది మనం కోరుకున్న విషయంలో నిలువకుండా తనకు ఇష్టం ఏర్పడిన విషయంలో ఉంటుంది. విద్యార్థికి ఫలాన్ని ఇచ్చేది చదువు. కానీ వాడి ఇష్టం సినిమాపై ఉండటంచేత ఏకాగ్రత చదువుకన్నా సినిమాపైనే ఎక్కువగా నిలుస్తుంది !"*


*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

           🌼💖🌼💖🌼

                 🌼🕉🌼

No comments:

Post a Comment