Wednesday, July 20, 2022

లష్కర్ మహంకాళి బోనాల జాతర రంగం భవిష్యవాణి:-

  లష్కర్ మహంకాళి బోనాల జాతర రంగం భవిష్యవాణి:- 


 దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు.. 

 అంటు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జోగిని స్వర్ణలత.. 

 భక్తులు భక్తితో కొలవండి.. ఫోటో ఫోజుల కోసం భక్తిని నటించకండి.. 


 హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. బోనాల్లో భాగంగా 'రంగం' కార్యక్రమం నిర్వహించారు.జోగిని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. 


 ''పూజలు మొక్కుబడిగా చేస్తున్నారు. మీరు చేస్తున్న పూజలు.. మీ సంతోషానికే తప్ప నాకోసం కాదు. ఎంత సంతోషంగా చేస్తున్నారో మీ గుండెపై చేయి పెట్టి చెప్పండి. మీరు సంతోషంగా చేస్తున్నారనే నేను స్వీకరిస్తున్నా. నా గుడిలో పూజలు సరిగా జరిపించడం లేదు. 


 గర్భాలయంలో మొక్కుబడిగా వద్దు.. శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.. కడుపులో పెట్టుకుంటున్నా. ఎన్ని రూపాల్లో నన్ను మారుస్తారు? మీకు నచ్చినట్టు మారుస్తారా? స్థిరమైన రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా. నా రూపాన్ని స్థిరంగా నిలపండి. మీరేంటి నాకు చేసేది.. నేను తెచ్చుకున్నదే కదా! దొంగలు దోచినట్లు నాదే కాజేస్తున్నారు'' అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.!! 

No comments:

Post a Comment