భగవంతునికి దగ్గర కావాలన్నా , భగ్వద్ అనుగ్రహం పొందాలన్నా మనో నిగ్రహం కావాలన్నా అది ఎలా సాధ్యం......???
🌿పగలు, రేయి ఎన్నడూ కలిసి ఉండవు, అలాగే భగవదాకాంక్ష, ప్రాపంచిక ఆకాంక్ష అనేవి రెండూ సహజీవనం చేయవు,
🌸అందుకే, భగవంతుణ్ణి పోందగోరే వారిని కామనారహితులుగా ఉండాల్సిందిగా శాస్రాలు ఉపదేశిస్తున్నాయి.
🌿"కర్మ చేత, సంతతి చేత, లేక ఐశ్వర్యం చేత అమరత్వం సిద్ధించదు, పరిత్యాగం చేత మాత్రమే అమరత్వాన్ని పొందగలం."
🌸శ్రీరామకృష్ణులు కోర్కెలను ఎలా వదిలించుకోవాలో తమ శిష్యులకు ఇలా బోధించారు...
🌿ధర్మమార్గం ఎంతో సూక్ష్మమైనది, జాడమాత్రమైన కోర్కె ఉన్నాసరే, భగవత్సాక్షాత్కారం పొందలేము...
🌸ఒక పోగు విడివడి ఉన్న దారాన్ని సూదిలోకి ఎక్కించలేం ఇదీ అంతే. "కామినీ కాంచనాలను త్యజించకుండా ఆధ్యాత్మిక పురోగతి అసాధ్యం.
🌿నేతి పాత్రను పూర్తిగా ఖాళీ చేసినప్పటికీ పాత్ర అంచుల్లో నెయ్యి అంటుకొని ఉన్నట్లుగా మనలోపల ఎల్లప్పుడూ కోరికలు అనేటివి దాగి ఉంటాయి.
🌸ఒక వ్యక్తి వద్ద ఖాళీ నేతి పాత్ర ఉంది, పొరుగునున్న వ్యక్తి కొంచెం నెయ్యి ఇవ్వమని అడిగాడు.
🌿నెయ్యి లేదని ఇతడన్నాడు, అప్పుడు పొరుగు వ్యక్తి, ఎండలో పాత్రను కాసేపు ఉంచి చూడకూడదా అని చెప్పాడు,
ఎండలో ఉంచిన కొద్దిసేపట్లోనే నెయ్యి కరిగి వచ్చింది...
🌸ఆ విధంగానే కోర్కెలు మనస్సులో ఘనీభవించిన స్థితిలో ఉంటూనే ఉంటాయి...
🌿వాటికి సూర్యరశ్మి తగిలినప్పుడు, అంటే ఇంద్రియ సుఖాలను ఇచ్చే వస్తువులతో సంసర్గం ఏర్పడినప్పడు అవి అభివ్యక్తమవుతాయి.
🌸కాబట్టి సంయమం పాటించి జ్ఞానాగ్నిని పెంపొందించుకొoటే సమస్తమైన కోరికలూ బూడిదలా దగ్గమైపోతాయి.
🌿ధ్యానం చేసేటప్పడు, ప్రథమావస్థలో ఇంద్రియ విషయాలన్నీ మనస్సులో మెదలుతాయి.
🌸కానీ ధ్యానం ప్రగాఢమవగానే అవి సాధకుణ్ణి ఇక ఇబ్బందికి గురి చెయ్యవు, మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు మన మనస్సులలో చెడు ఆలోచనలు సహజంగానే తలెత్తుతాయి.
🌿రామకృష్ణ పరమహంస వారు వారి సాధనలో ని అనుభవం గూర్చి ఇలా వివరించారు
🌸ధ్యానం చేస్తున్నప్పడు ఎన్నో రకాల వస్తువులు నాకు కనిపించేవి.
ధనరాశి, శాలువా, ఒక పళ్ళెం నిండా తీపి తినుబండారాలు,
🌿 ముక్కున నత్తులు ధరించిన ఇద్దరు స్త్రీలు.. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశాను...
నా మనస్సును ఇలా ప్రశ్నించాను.. 'నీకు ఏం కావాలి.. వీటిలో
🌸దేనినైనా అనుభవించాలనుకొంటే చెప్పు... అందుకు నా మనస్సు, నాకు ఏదీ వద్దు, భగవంతుడి పాద పద్మాలు తప్ప అన్యమైనది ఏదీ నాకు అక్కర్లేదు' అని జవాబిచ్చింది.
🌿ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక కోరిక బద్ధ శత్రువు, ఈ శత్రువును తుదిముట్టించడానికి శాస్రాలు ఎన్నో మార్గాలను వివరించి చెప్పాయి.
🌸వాటిలో కొన్ని త్యాగాగ్ని, జ్ఞానాగ్ని, యుక్తాయుక్త విచక్షణ, నిష్కామకర్మ భగవంతుని పట్ల భక్తిశ్రద్ధలు..
🌿రామకృష్ణులు తమ భక్తులను ఇలా హెచ్చరించారు...ధ్యానం చేస్తున్నప్పడు నీ మనస్సులో ఏదైనా ప్రాపంచిక కోరిక మొదలడం గమనిస్తే, ధ్యానం నిలిపివెయ్యి..
🌸హృదయ పూర్వకంగా భగవంతుణ్ణి ఇలా అడుగు...
ఓ ఈశ్వరా.. ప్రాపంచిక కోరికలు నా మనస్సులోనికి రానీయకుండా చూడు" అని ప్రార్థించు
🌿ప్రార్థనలో నిజాయతీ ఉంటే భగవంతుడు తప్పక మన ప్రార్థనలను వింటూడు...
No comments:
Post a Comment