Thursday, July 21, 2022

మన పండుగల గొప్పతనం

🙏 మన పండుగల గొప్పతనం 🙏
ఉగాది:- కష్టము,సుఖము,సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
శ్రీరామ నవమి:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.
వ్యాస (గురు)పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికి పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
పితృ అమావాస్య :- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.
బతుకమ్మ:- ఊళ్లోని వాళ్లంతా ఆట పాటలతో కలిసిపోతూ సంతోషంగా గడపమని.
దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమనెడి.
సంక్రాంతి:- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
మహా శివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
కామదహనం:- కోరికలు తగ్గించమని.
హోళీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు ,వివిధ అనుభూతులను పిల్లా పెద్ధ అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని మన  పండుగల అంతరార్దం.
🙏🙏🙏🙏🙏
సేకరణ

No comments:

Post a Comment