Tuesday, July 26, 2022

హితోక్తులు

 🙏🏽🙌🏿 లక్ష్మిశ్రీవేంకటేశ్వరస్వామి జ్ఞానపీఠం రేణిగుంటరోడ్డు.తిరుపతి 
వ్యవస్థాపకులు .ధర్మఛారౄ            
'తిరుపతి' శ్రీనివాసరావు
కర్మయోగి..ప్రధాన నిర్వహకులు
9390216263..9550804092 🙏🏽🙌🏿 హితోక్తులు
     మాటలతో తీపిగా చక్కర కలిపినట్లు మాట్లాడుతూ మోసం చేసే వారిని మాత్రమే అందరూ ప్రేమిస్తారు. వాస్తవం గా మాట్లాడుతూ నిజాయితీ గా ఉండేవారిని అందరూ ద్వేషిస్తారు .
       ఎవరో కాదు అన్నీ తెలిసిన మన వారే మనకే నమ్మక ద్రోహం చేస్తారు.
*_జీవితంలో మనకెదురైయ్యేవారు, మనలను విమర్శించేవారు, మనలను ఇబ్బంది పెట్టేవారు, మనలను తక్కువచేసి మాట్లాడేవారు,మనకు సమస్య సృష్టించే వారు వీరందరూ మనకు గురువులే._*
*_ఎందుకంటే, వీరందరి వలనే నీకు జీవితమంటే తెలుస్తుంది.అంతర్లిలంగా నీ వికాసానికి కారకులు వారే.. కసిగా ప్రయత్నిస్తే విజయుడవు అవుతావు.ఆగిపోయి వారినే గుర్తుంచుకుంటూ, నిందిస్తూ కాలం వెళ్లబుచ్చువంటే పతనమౌతావు._*
*_మాటకు మాట, దెబ్బకు దెబ్బ_*
*_అన్నిచోట్లా పనిచేసే చిట్కా కాదది.._*
*_ముఖ్యంగా బంధాలలో అదో విషపు చుక్క అవుతుంది..!_*
*_కాలాన్ని బట్టి కన్నీళ్లు పెరగొచ్చు తరగొచ్చు._*
*_జీవితం చెదిరిపోతుంది. కలలు వాడిపోతాయ్._*
*_బ్రతుకు బలహీనమైపోతుంది._* 
*_అన్నింటికీ కారణం మనమున్న పరిస్థితులే._*
*_అవి అర్థం కావు, ఒక్క ఎదుర్కొనే మనసుకు తప్ప.._*
*_కానీ, లోకానికి అవేం పట్టవు._*
*_ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే,_*
*_మంచితనం, మొండితనం రెండూ ఉండాలి..☝_*
👉కన్నీటినుండే కసి పుట్టాలి.. అవమానలనుండే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి.. 
👉ఎవరైతే ఎగతాళి చేసారో వారే మనకోసం ఎదురుచూసేలా ఉన్నత శిఖరాలకి ఎదగాలి.. 
👉ఒకరి నీడలో ఎదగాలి అనుకోకు కష్టమైన సరే సొంతంగా ఎదగడం అలవాటు చేసుకో. 
ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి *నీడలో మొక్కలే ఎదగవు మనుషులం మనం ఎదుగగలమా*
👉ప్రతి పుస్తకం ఒక కొత్త విషయాన్నీ తెలియచేస్తుంది. 
ఎలా బ్రతుకాలో తెలుపుతుంది ఎలా నడుచుకోవలో తెలియచేస్తుంది. 
*చదువు అనేది కేవలం జ్ఞానాన్ని పెంచడమే కాదు సంస్కారాన్ని కూడా పెంచుతుంది.*
👉మనలోనుండి వచ్చే ప్రతి ఆలోచన మరి మనిషికి వెలుగులు చూపించేదిగా ఉండాలి, 
కానీ 
చీకట్లోకి నెట్టేసిదిగా ఉండకూడదు.
👉మనలోని రాక్షసుని బలం రోజు మొత్తం మీదా ఒక నిమిషం కన్నా తక్కువగానే ఉంటుంది. 
ఆ ఒక్క నిమిషం మనం కష్టాలను ఎదుర్కోగలిగిన మహనీయులుగా మిగిలిపోతాం. 
👉కాల గమనం లో ప్రతివారి వ్యక్తిత్వం పరీక్షించబడుతుంది. నిలబడి నెగ్గిన వాడు రాజమా ర్గం లో గమ్యం చేరుతాడు.. తప్పించుకోచూసి పక్క దారి పట్టినవాడు కొంత దూరం పొయ్యాక దారిలేక అర్ధంతరంగా ఆగిపోతాడు.. 
మనం ప్రారంభన్ని సరిగ్గా ఆరంభిస్తే ఫలితం దానంతట అదే వస్తుంది.. (*Start the work end in mind and in rt time*)
👉మన సామర్ధ్యం మీద మనకు నమ్మకం ఉన్నప్పుడు ఎంత కష్టమైన మన్ముందుకు సాగగలం
*जीना हय थो करण सीखों
कदम कदम पर मरना सीखों*
👉Be so Rich that You can buy the most Expensive thing You Desire. 
But 
Be so Expensive that No Richness on the Earth can buy You. 

No comments:

Post a Comment