Thursday, September 29, 2022

జీవనంలో ఉంటూ ఆలోచనలు ఆపకుండా బాధలను అధిగమించటం ఎలా ?

      💖💖 *""* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     

*"జీవనంలో ఉంటూ ఆలోచనలు ఆపకుండా బాధలను అధిగమించటం ఎలా ?"*
*****

*"మనకి ఏ ఆలోచన లేనప్పుడు ఏ బాధ కలగటంలేదు. బాధకు ప్రాధమిక కారణం ఆలోచన. ఏ ఆలోచన లేకపోతే హాయిగా నిద్ర సుఖాన్ని అనుభవిస్తాం. అలాగని అసలు ఆలోచన లేనిదే జీవనమేలేదు. మరి అలాంటప్పుడు ఆలోచనలను ఆపడం ఎలా సాధ్యం ? అందుకు భగవాన్ శ్రీరమణమహర్షి చూపిన తరుణోపాయం ఆలోచనలకు మూలం ఏమిటో అన్వేషించటం. సాధారణంగా తన ముందున్న ప్రపంచాన్ని మనసు గమనిస్తుంది. ఆ గమనింపుతోనే జీవనాన్ని కొనసాగిస్తుంది. అందుకు పరిమితమైన ఆలోచన సరిపోతుంది. కానీ మనసుకు కోరిక కలిగినప్పుడు దాన్ని తీర్చుకోవటం కోసం అదనపు ఆలోచన మొదలు పెడుతుంది. ఎప్పుడో నాటిన మామిడి టెంక కాలంలో వృక్షమై సంవత్సరాల తరబడి పంట ఇచ్చినట్లే కోరిక అనే ఒక విత్తనం మనలో నిరంతరంగా వర్తమానంలో అవసరంలేని ఆలోచనలను పుట్టిస్తూనే ఉంటుంది. మూలంలో ఉన్న ఆ విత్తనాన్ని పెకలిస్తే తప్ప ఈ ఆలోచనల పరంపరను అరికట్టలేము !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
            

No comments:

Post a Comment