Friday, September 23, 2022

*ఉచిత వైద్య శిబిరం* అన్న బోర్డ్ చూసిన చాలామందికి తమకు ఏ ఆరోగ్య సమస్య లేదని తెలిసినా దాన్ని ఒక సర్టిఫికెట్(రిపోర్ట్) రూపంలో చూడాలని తహతహలాడిపోయి అక్కడికి చేరిపోతారు. అలాచేరిన క్షణం వాళ్ళ జీవితాలను మలుపుతిప్పే క్షణాలని ఎవ్వరూ ఊహించరు.

 *ఉచిత వైద్య శిబిరం* అన్న బోర్డ్ చూసిన చాలామందికి తమకు ఏ ఆరోగ్య సమస్య లేదని తెలిసినా దాన్ని ఒక సర్టిఫికెట్(రిపోర్ట్) రూపంలో చూడాలని తహతహలాడిపోయి అక్కడికి చేరిపోతారు. అలాచేరిన క్షణం వాళ్ళ జీవితాలను మలుపుతిప్పే క్షణాలని ఎవ్వరూ ఊహించరు. అంతవరకూ మామూలుగా ఆరోగ్యంగా ఉన్నమనిషికి కాస్తా పేషంట్ అన్న ముద్ర పడుతుంది. ఇది రెండు రకాలుగా జరుగుతుంది. మీరు డయాబెటిస్/హార్ట్ స్పెషలిస్ట్ నడిపే ఫ్రీ క్యాంపుకు వెళితే మీకు ఉచితంగా చేసిన బ్లడ్ టెస్ట్ రిపోర్టులు చూసి డాక్టరుగారు "మీకు అన్నీ బావున్నాయండీ ఒకే ఒక చిన్న ప్రాబ్లెమ్ ఉంది. ఈ మాత్రలు ఒక నెల పాటి వాడి ఒకసారి వచ్చి కలవండి" అని ఒకే ఒక టాబ్లెట్ తో ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఒక్క సంవత్సరం లోపు మీచేత ఒక 10 రకాల టెస్టులు చేయించి కనీసం ఒక్కసారి మిమ్మల్ని హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేటట్లుచేసి మీ చేత 4-5 రకాల మందులు రోజూ తినే స్థితికి తీసుకెళ్లి, మీరు మందులు, డాక్టర్లు లేకుండా బ్రతకలేని స్థితికి తీసుకెళ్లిపోతారు.

అదే మీరు ఆర్థోపెడిక్ లేక జనరల్ ఫిజీషియన్ నడిపే ఫ్రీ క్యాంపుకు వెళితే "మీకన్నీ బావున్నాయండీ కాస్త ఎముకలు వీక్ గా ఉన్నాయి, ఈ పేకెట్ వారానికి ఒకసారి ఎనిమిదివారాలు వాడి ఒకసారి వచ్చి కలవండి" అని మొదలెట్టి సంవత్సరం తిరక్కుండానే మీరూ కనీసం 4 రకాల మందులు లేనిదే బ్రతకలేని స్థితికి తీసుకెళతారు. 

ఇవన్నీ ఒక పద్దతిగా వ్యాపారాన్ని పెంచే విధానాలు. ప్రైవేటు డాక్టర్లకు, మందుల కంపెనీలకు మీకేదో సేవచేసేయలన్న తీట ఉండదు. ఒక కంపెనీ తమ వ్యాపారాన్ని పెంచాలంటే కొత్త పేషెంట్లను add చేసుకోవాలి, ఒక డాక్టరుతో ఒప్పందం చేసుకొని ఆ ఉచిత క్యాంపులో చేసే పరీక్షలకు అయ్యే ఖర్చు భరిస్తాయి, ఆరోజు వచ్చే వాళ్లలో కనీసం 60 శాతం మందికి వాళ్ళ డయాబెటిక్/కోలెస్టరాల్/విటమిన్ డీ రాయాలని ఒప్పందం చేసుకొంటారు. ఒక్కసారి ఈ మందులు మొదలెడితే ఇక ఆపే పరిస్థితి ఉండదు, ఆ మందులు మీ చేత ఇంకో 4 రకాల మందులు తీసుకొనేలా చేస్తుంది. డాక్టర్లకు కొత్త పేషంట్లు add అవుతారు. ఒక క్యాంపు నుండి 10 మంది పేషెంట్లు add అయినా చాలు, వాళ్ళు నెల నెలా టెస్టులు, ఫీస్ అని చాలా ఆదాయం చేకూరుస్తారు. 

ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, నిజంగా ప్రజలకు మేలు చెయ్యాలనుకునే క్యాంపులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని హాస్పిటల్ కు రమ్మని పిలువవు. పల్లెల్లో, బీదవాళ్ళు ఉండే కాలనీలలో, ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు నిజంగా కమ్యూనిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేసేవి. వాటిలో అందించే సేవలను బీదవాళ్ళు తప్పక తీసుకోవాలి. అవి కాకుండా హాస్పిటళ్లలో నిర్వహించే శిబిరాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. ఎవరైనా అస్వస్థత పోందినప్పుడు డాక్టరు దగ్గరికెళ్లి వారు చెప్పిన విధంగా పూర్తి వైద్యం తీసుకోవాలి. మీలో అస్వస్థత లేనంతవరకూ ఎవ్వరి మాటలూ వినకుండా, తేనెతొట్టెను కదపకుండా సంతోషంగా ఆల్ ఈజ్ వెల్ అనుకొంటూ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యండి.
~~~~Forwarded~~~~

No comments:

Post a Comment