Monday, September 26, 2022

ఆధునిక ఆధ్యాత్మికత అంటే ఏమిటి ?

 ఆధ్యాత్మికత
     ఈ ఆధునిక యుగంలో వైజ్ఞానిక శాస్త్రం భూమి నుంచి పైకి రాకెట్లు పంపుతుంటే, ఆధ్యాత్మికత పైన వున్నాయి అనబడే స్వర్గం,నరకం, వైకుంఠం నుండి క్రీందకు దిగింది.
   ఆధునిక ఆధ్యాత్మికత అంటే ఏమిటి ?
1) దుఃఖం, దుఃఖ కారణం, నివారణ గురించి చెపుతుంది.
2) ఒక దానిని పొందటం ద్వారా వచ్చే తృప్తి, సంతోషం కాక సహజసిద్ధమైన, స్వేచ్ఛా ఆనందం పొందాలంటుంది.
3) నేను ఎవరిని అని అన్వేషణ చేసి అందులోని డొల్లతనం గుర్తిస్తూంది.
4) అశాంతి , దోపిడి, అసమానతలు,  అహింస, దౌర్జన్యం,  వివక్ష, రహిత  జీవన విధానాన్ని నేర్పుతుంది.
5) మనస్సు ని శుద్ధపర్చి, ప్రవర్తన అతడికి, ఇతరులకు హాని, కీడు, దుఃఖం, నష్టం, కష్టం,కలగ నివ్వదు.
6) మనం చేసే చర్య/కర్మ యెక్క పర్యవసానాలు శాస్త్రీయంగా చర్చించి,సరైన, చర్య చేసే లాగా మనలను ప్రోత్సాహ పరుస్తుంది.
7)  ఇంద్రియ సుఖాల వెంటపడే మనస్సు ని మరల్చి, నైతికత వైపు త్రిప్పి తుంది.
8) మనలో దాగిన జంతు ప్రవృత్తిని, అమానవీయతని, ఖండించి మనలను మానవీయంగా మారుస్తుంది.
9) అందరిని ఆధ్యాత్మికత వైపు ఆకర్షించి, అన్ని సమస్యలకు ఆధ్యాత్మికతే సరైన పరిష్కారం అంటుంది.
  మీరేమంటారు??మీరు ఎటు వైపు,? ఆధునిక వైపా?,లేక పురాతన వొపా?
ఇట్లు
ఆధునికుడు లేని ఆధునికత

No comments:

Post a Comment