Tuesday, September 27, 2022

నిజమైన క్షమాపణ, కోపంతో ఊగిపోతూ గౌతమ బుద్ధునిపై ఉమ్మి వేశాడు…

 (H16.) x2.i. 2-4.   270922-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
కోపంతో ఊగిపోతూ గౌతమ బుద్ధునిపై 
ఉమ్మి వేశాడు…

           నిజమైన క్షమాపణ
                ➖➖➖✍️

ఒకసారి, గౌతమ బుద్ధుడు తన శిష్యులతో సమావేశమై కూర్చునియుండగా, చాలా కోపంతో ఒక వ్యక్తి వచ్చాడు.

అతను బుద్ధుడు తప్పు చేస్తున్నట్లుగా భావించేవాడు. కేవలం ప్రజలను ధ్యానం చేయమని చెప్తేనే, ప్రజలు పెద్ద సంఖ్యలో అయన వైపుకు ఆకర్షించ బడుతున్నారు అని అనుకున్నాడు!

అతను ఒక వ్యాపారవేత్త, అతని పిల్లలు వ్యాపారంలో ఎక్కువ డబ్బు సంపాదించడంలో, మంచి జీవనోపాధిని పెంచుకోవడంలో నిమగ్నమై ఉండకుండా, బుద్ధుడితో ఎక్కువ సమయం గడుపుతున్నారని ఆందోళనపడ్డాడు.

ఎప్పుడూ కళ్లు మూసుకుని కూర్చుని ఉండే వారి ప్రక్కన, రోజులో నాలుగు గంటల సమయం గడపడం పూర్తిగా  వృధా అని భావించాడు.

దీనితో కలత చెంది, విసిగిపోయి,"నేను ఈ వ్యక్తికి గుణపాఠం చెప్పాలి!", అని అతను నిర్ణయించుకున్నాడు. మనసు నిండా కోపంతో బుద్ధుడి వైపు ధైర్యంగా నడిచాడు.

బుద్ధుని దగ్గరికి రాగానే అతనిలోని ప్రతికూల ఆలోచనలన్నీ మాయమైపోయాయి, కానీ అతనిలోని కోపం మాత్రం చల్లారలేదు. కోపంతో ఊగిపోతున్నాడు కానీ మాట్లాడలేక పోతున్నాడు.

తన భావోద్వేగాలను మాటల్లో చెప్పలేక బుద్ధుని ముఖంపై ఉమ్మివేసాడు.

బుద్ధుడు బదులుగా నవ్వాడు.

బుద్ధునితో పాటు కూర్చున్న శిష్యులకి                ఆ వ్యక్తిపై చాలా కోపం వచ్చింది. వారు అతని మీదకు దూకడానికి సిద్ధమయ్యారు, కానీ బుద్ధుని ఎదురుగా వారు ఏమీ చేయలేక ఆగిపోయారు.

బుద్ధుడితో ఎవరైనా అంత  అవమానకరంగా ప్రవర్తించగలరని వారు నమ్మలేకపోయారు! కానీ వారు ఏమీ అనలేకపోయారు.

అతను చేసిన పనికి చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి ఎటువంటి ప్రతిచర్య రాలేదు, పైగా బుద్ధుడు కూడా ప్రతిగా చిరునవ్వు నవ్వాడు అంతే.  ఇంక అక్కడ అతను ఎక్కువసేపు ఉండలేడని గ్రహించాడు.
"ఇంక ఎక్కువసేపు ఉంటే, బహుశా నేనే ప్రేలిపోతానేమో!", అని అనుకుని వెళ్ళిపోయాడు.

ఇంటికి తిరిగి వచ్చేసిన తర్వాత కూడా, తన మనస్సు నుండి గౌతమ బుద్ధుని చిరునవ్వుతో ఉన్న ముఖ చిత్రాన్ని చెరిపేయలేకపోయాడు. తాను చేసిన లాంటి అగౌరవమైన చర్యకు అసాధారణంగా స్పందించిన ఒక వ్యక్తిని తన జీవితంలో మొదటి సారి కలుసుకున్నాడు.
ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. అతని హృదయం పూర్తిగా పరివర్తన చెందింది. వణుకుతూ, కంపించిపోతున్నాడు, చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం కూలిపోతున్నట్లుగా భావించాడు.

మరుసటి రోజు, వెళ్లి బుద్ధుని పాదాలపై పడి, "దయచేసి నన్ను క్షమించండి!నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు." అని వేడుకున్నాడు.

దానికి బుద్ధుడు, "నేను నిన్ను క్షమించలేను!" అని సమాధానమిచ్చాడు.

అది విన్న శిష్యులందరూ అవాక్కయ్యారు. తన జీవితమంతా, బుద్ధుడు చాలా దయాగుణంతో గడిపాడు. అందరినీ, వారి గతంతో సంబంధం లేకుండా ఆశ్రమంలోకి అంగీకరించాడు. ఇప్పుడు ఈ వ్యాపారితో క్షమించలేనని చెబుతున్నాడా..?" అని అనుకున్నారు.

బుద్ధుడు చుట్టుపక్కల చూసి, అందరూ ఆశ్చర్యపోయినట్లు గమనించాడు.

బుద్ధుడు ఇలా వివరించాడు, "మీరు ఏమీ చేయనప్పుడు నేను నిన్ను ఎందుకు క్షమించాలి?
నేను నీ ప్రవర్తనను క్షమించడానికి నువ్వు చేసిన తప్పేంటి?".

వ్యాపారవేత్త బదులిస్తూ, "నిన్న నేను వచ్చి, కోపంతో మీ ముఖం మీద ఉమ్మివేసాను. ఆ వ్యక్తిని నేనే!".

గౌతమ బుద్ధుడు, "ఆ వ్యక్తి ఇప్పుడు ఇక్కడ లేడు, మీరు ఉమ్మి వేసిన వ్యక్తిని నేను ఎప్పుడైనా కలిస్తే, మిమ్మల్ని క్షమించమని చెబుతాను." అని అన్నాడు.

“నాకు - ఈ క్షణంలో ఇక్కడ ఉన్న వ్యక్తివి నీవు. నీవు అద్భుతమైనవాడివి. నువ్వు ఏ తప్పూ చేయలేదు."

జీవితంలో ఒక వ్యక్తిని మనం నిజంగా ఎప్పుడు క్షమిస్తాము?

నిజమైన క్షమాపణ అంటే ఎవరినైనా మనం క్షమించినప్పుడు, ఆ వ్యక్తి క్షమింపబడ్డాడని కూడా ఎవరికీ తెలియకూడదు. ఆ వ్యక్తికి తాను చేసిన పనికి అపరాధభావాన్ని కూడా కలిగించకూడదు.
అదే సరైన క్షమాపణ!

మనం ఎవరినైనా క్షమించి, వారి తప్పులు వారికి గుర్తుచేస్తూ, వారికి ఎల్లవేళలా అపరాధ భావాన్ని కలిగిస్తే, నిజానికి, మనం వారిని ఇంకా క్షమించలేదని అర్ధం.

ఒక వ్యక్తికి తాను తప్పు చేసినట్లు గ్రహించడమే, ఆ వ్యక్తికి తగిన శిక్ష.

                       ♾️

మనకు ఎవరితోనైనా చేదు అనుభవాలు ఎదురైనప్పుడు, వారిని మనం క్షమించినప్పుడే మన మానసిక భారం తొలగిపోతుంది. ✍️
.          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.
                     ➖▪️➖

No comments:

Post a Comment