Tuesday, September 27, 2022

బాహ్య ప్రపంచం (అనగా రూపం, గంధం, శబ్దం, రసం, స్పర్శ,) మన ఇంద్రియాల ద్వారా (అనగా కళ్ళు, ముక్కు,చెవి,నాలుక, చర్మం), ఎల్ల వేళలా మనలో ప్రేరణలు కలిగిస్తుంది.

 బాహ్య ప్రపంచం (అనగా రూపం, గంధం, శబ్దం, రసం, స్పర్శ,)  మన ఇంద్రియాల ద్వారా (అనగా కళ్ళు, ముక్కు,చెవి,నాలుక, చర్మం), ఎల్ల వేళలా మనలో ప్రేరణలు కలిగిస్తుంది.
  ఈ ప్రేరణలకు మనం ప్రతి స్పందిస్తాము.  ఈ ప్రతి స్పందనలే మన అలవాట్లకు, ప్రవర్తనకు ,భావోద్వేగాలకు కారణం.
   దాదాపుగా మనం  ప్రతి స్పందించే తీరు  ఒక అలవాటుని ఒక తీరుని ఒక నమూనాని కలిగి ఒక అసంకల్పిత ప్రతీకారం చర్య లాగా వుంటుంది.  మన నియంత్రణ, పట్టు వుండదు. 
    *కాని ఒక చిన్న అవకాశం వుంది.అది ఏమిటంటే. కాల వ్యవధి.*
    బాహ్య ప్రేరణకి  మన స్పందనకి మధ్య  కాలవ్యవధి.
   ఈ కాల వ్యవధి లో మనం ఎన్ని రకాలుగా స్పందించ వచ్చో, ఎలాంటి స్పందన సరితూగ గలదో,  నిర్ణయించ వచ్చు.
    *ధ్యానం* మనకు ఈ వ్యవధి ని ఇస్తుంది. 
*సతి, అంతర్దృష్టి* ఎలా స్పందిస్తున్నాం  అని చెపుతుంది 
 *ప్రజ్ఞ* ఏది సరైన స్పందనో చెపుతుంది. 
*శీలం* శీలాచరణకు దారితీస్తుంది.
*ధ్యానం* *సతి*, *అంతర్దృష్టి*, *ప్రజ్ఞ,* *శీలం* ఇవి *నిర్వాణానికి* దారి తీస్తాయి.
  *ఇట్లు*
స్పందించే వాడు *లేని* స్పందన.

No comments:

Post a Comment