ప్రాణమున్నంత కాలం శివం...
ప్రాణం పోయినంతనే శవం..
ఎంత సులువుగా మనుషులు వారి ఆలోచనలు మారిపోతాయో కదా.
అప్పటిదాకా మనముందు మాట్లాడుతూ ఉన్న మనిషి,
మనకు బాగా కావలసినవారు, ఆత్మీయులు, స్నేహితులు, బంధువులు...
కన్నుమూయగానే ఒక శవం..
ఒక శరీరంగా కనిపిస్తారు.
మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా ఉన్న వ్యక్తి ప్రాణం పోయినంతనే భయం కలుగుతుంది.
అమ్మో అంటారు.
మైల అంటారు.
కోట్లకు అధిపతైనా మంచంమీదనుండి నేలమీద పడుకోబెట్టేస్తారు.
లేదా ఐస్ పెట్టెలో..
అయ్యో..
మన మనిషి... చనిపోయాక కూడా మనవారే అని అనిపించదా.. దూరంగా నిలబడతారు.
కనీసం వారింట మంచినీరు కూడా తాగరు..
దినాల భోజనం కూడా అందరికీ పడదు, నచ్చదు. వద్దు అంటారు.
శుభకార్యంలో భోజనానికి,
దినాలకి పెట్టే భోజనానికి తేడా ఏముంటుంది.
చనిపోయిన వ్యక్తి సంస్మరణలో తినే భోజనం ప్రసాదం లాంటిది.
శుభకార్యాలు ఎంతో ఈ దినాల కార్యక్రమాలు, భోజనాలు వాటి ప్రాముఖ్యత కూడా అంతే..
రేపు లేదా ఎల్లుండి మనం కూడా పోయేవాళ్లమే.
పోయేటప్పుడు కట్టుకపోయేదేమీ లేదు..
అందుకే పెద్దవాళ్లని,
మనవాళ్లని అందరినీ అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండండి.
ఏమో...ఎప్పుడు మాయమవుతారో....!!
మీ... సూర్య మోహన్ 🌞
No comments:
Post a Comment