Saturday, September 24, 2022

గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది ! కాదు కనుమరుగు చేశారు . ఇది ఒక పథకం ప్రకారం జరిగింది !

 *గుడిలో పూజారిని పోషించే వ్యవస్థ కనుమరుగయ్యింది !*
 కాదు కనుమరుగు చేశారు .
ఇది ఒక పథకం ప్రకారం జరిగింది ! 
.
గుడిలో పూజారికి కడుపునిండకపోతే ఆ దేవుడు చూపిన వేరే దారి వెతుక్కుంటాడుగానీ పూజారిగా ఉండడు! 
.
అప్పుడు గుడి ఉండదు దేవుడిపూజలూ ఉండవు!
.
 మనం గొప్పగా చెప్పుకునే భారతీయ సంస్కృతి అసలే ఉండదు ! ...ఎందుకంటే గుడులే సంస్కారకేంద్రాలు కాబట్టి ! 
.
పూజారికి కానుకలు వేయవద్దు అని బోర్డులు ! బాగుంది ! 
.
మరి ఆయనకు జీతమెంత ఇస్తారు ఆలోచించారా ? 
.
ఎక్కువలో ఎక్కువ 5000 / 
ఆడబ్బుతో పెళ్ళానికి చీరలేకొంటాడా ? 
పిల్లాడికి చదువులేచెప్పిస్తాడా ? 
రోగంరొష్టువస్తే వైద్యమే చేయించుకుంటాడా ? 
.
అసలు విషయం మరచిపోయా ఇంటి అద్దె కట్టి కడుపునింపుకొని గుడ్డలుకొనుక్కొన్న తరువాత కదా పైన చెప్పినవి ! 
.
గుడులు ఆదాయకేంద్రాలు కాదు అవి సంస్కారకేంద్రాలు ! అక్కడ పనిచేసేవారి జీవితం జీవనం సుఖసంతోషాలతో ఉంటేనే ! సంస్కృతి సంప్రదాయం నిలబడేది !
.
పూజారిగారికి దక్షిణ ఇవ్వండి ! వారి జీవితాలలో వెలుగు నింపండి ! అప్పుడే భారతీయసంస్కారాలు పదికాలాలు నిలబడతాయి !
సేకరణ..మీ రాధసాగర్ కోమ్ముల 🌷🌷🌷🌷🌷

No comments:

Post a Comment