Thursday, September 22, 2022

ఓ మనిషీ కళ్ళు లోపలికి త్రిప్పు, చూడు ఏం జరుగుతుందో..అదే ధ్యానం.

 మనం రకరకాల మనుషులతోటి రకరకాలుగా వ్యవహరిస్తాము, ప్రవర్తిస్తాము.
   ఇలా ప్రవర్తిస్తుండటానికి కారణం లేదా ప్రేరణ,లేదా బేస్ ఏమిటి?
   అది మన అనుకొనే, కులం,మతం,చదువు, ప్రాంతం, హోదా, కుటుంబ, సామాజిక నేపథ్యం, వయస్సు, లింగం (Gender). వీటి ఆధారంగా మనం మన మీద మనం వేసుకున్న అంచనా, ముద్ర.
      మనం ఇతరులకు ఇచ్చే గౌరవం, లేదా అగౌరవం మర్యాద లేదా చులకన, చూపే ప్రేమ, చూచే చూపు, పలికే పలకరింపు,సంబోధన, సాపేక్ష మైనది.
   ఒక వైపు మనం, అనగా నాపై నేను వేసు కున్న ముద్ర. ఇది అవతలి వ్యక్తిని అనుసరించి హెచ్చుతూ తగ్గుతూ వుంటుంది.
    ఉదా.అవతల వ్యక్తి నా కన్నా పెద్ద కులస్థుడు అయితే, నాకన్నా ఎక్కువ పలుకుబడి వాడైతే, నాకన్నా ఎక్కువ షావుకారు అయితే లేక నాకన్నా తక్కవ చదువుకున్న వాడైతే,నా ఊరు కాని వాడైతే,నా హోదా నా స్థితి మార్పు చెందుతుంది.
తదనుగుణంగా నా ప్రవర్తన వుంటుంది.
  అనగా నేను వ్యవహారించేది తోటి మనిషితో,మనిషిగా కాదు.
    ఇక్కడ సంబంధం మనుషులు మధ్య కాదు.
కులాల, హోదాల , ప్రాంతాల,లింగాల,మతాలు, ఆస్తి పాస్తుల మధ్య.
    ఓ మనిషీ కళ్ళు లోపలికి త్రిప్పు, చూడు ఏం జరుగుతుందో..అదే ధ్యానం.
ఇట్లు
మనషితనం లేని మనిషి. 

No comments:

Post a Comment