💖💖💖
💖💖 *"337* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
*"మన జీవనానికి, జ్ఞాపకాలు, కోరికలకు మధ్యవున్న సంబంధంను ఏ విధంగా స్వీకరించాలి ? "*
*************************
*"వాటి మధ్య అసలు సంబంధమే లేదు ! ఈ ప్రపంచంలో మనకు తెలిసినదంతా జ్ఞాపకమే. మనకి విషయాలు తెలుస్తున్నకొద్దీ, అవి కావాలనిపించటం పెరుగుతుంది. ఎలాగంటే, ఏ చప్పుడు వినిపించ కూడదని గదిలో కూర్చుంటే వాటిని ఇంకా బాగా వినాల్సి వస్తుంది. శబ్దాల మధ్య ఉండి కూడా వాటిని పట్టించుకోని స్థితి సాధిస్తే అది ధ్యానం అవుతుంది. మనసు ఎదుర్కొనే గొడవల మధ్యే మనసు బాగుపడాలి గాని ఒంటరిగా ఉండి కాదు. మన చుట్టూ వస్తు ప్రపంచం ఉన్నప్పటికీ మనసుని చదరనివ్వకపోవటం ఏకాంతం. వస్తువుల నుండి తప్పించుకోవటం కేవలం ఒంటరితనం అవుతుంది. దానివల్ల మనసు గుణాలు దాటలేదు. మనకి కోరిక, కోపం వంటి ఏ గుణం తెలియాలన్నా ప్రపంచంలో ఉంటేనే సాధ్యమవుతుంది. ప్రపంచంలో ఉండి దాటితేనే శాంతి, అదే ధ్యానం. లేదంటే అది నిద్రతో సమానం. శాంతి కావాలంటే సమబుద్ధి అవసరం. మనం విషయాల నుండి తప్పించుకొని దాన్ని శాంతి అనుకుంటున్నాం. ఉన్న అశాంతిని తొలగిస్తేనే శాంతి అనే గుణం దొరుకుతుంది. అంతేగాని అశాంతి నుండి పారిపోతే శాంతి దొరకదు. జీవనానికి, జ్ఞాపకాలకు, కోరికలకు సంబంధం లేనిస్థితి శాంతి !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*
No comments:
Post a Comment