Wednesday, December 28, 2022

*****అమ్మాయిలు జాగ్రత్త... నీవు ప్రేమించడం తప్పు లేదు... నీవు ప్రేమలో మోసపోవడం తప్పు...

 అమ్మాయిలు జాగ్రత్త...

నీవు ప్రేమించడం తప్పు లేదు...
నీవు ప్రేమలో మోసపోవడం తప్పు..

నీవు పెళ్లి చేసుకోవడం తప్పు లేదు...
నీ మతం కాని వారితో వివాహం చేసుకొని ఇబ్బందులు పడటం తప్పు...

నీ ప్రేమ మధ్యలో ఉన్న మీ తల్లిదండ్రులను గుర్తించాలి...

నీ తల్లిదండ్రులకు... 
నీ ప్రేమ వ్యవహారం తెలియజేయాలి...

ఎందుకంటే అబ్బాయిలు కంటే అమ్మాయిలు ఎక్కువగా ప్రేమలో మోసపోతున్నారు...

సంపాదన పని మీద అవగాహన...
కుటుంబం మీద అవగాహన...
లేని అబ్బాయిలు వలన అమ్మాయిలు ప్రేమలో మోసపోతున్నారు...

నీ స్కూలు మీద నమ్మకముతో ఒంటరిగా నీకు స్కూలుకు పంపిస్తున్నారు...

నీ స్కూల్ ఎగ్జామ్ సెంటర్ కు... 
నీ జాబ్ కంపిటిటివ్ సెంటర్ కు...
నీ ఫ్రెండ్స్ పుట్టిన రోజులకు...
నీ ఫ్రెండ్స్ పెళ్లిల్లు కు...
నీ విహార యాత్రలకు...
నీ దూరం చదువులకు...
నీ దూరంగా ఉన్న హాస్టల్ కు...
నీకు నచ్చిన సినిమాకు...
నీకు తోడుగా...
నీ తల్లిదండ్రులు...
నీ అన్న తమ్ములు...
నీ పెళ్ళైన అక్కలు నీతో ఉండవలసిన పరిస్థితి...

ఎందుకంటే...
నీవు అమ్మాయి కాబట్టి...
నీకు ఎదిరించే శక్తి లేదు కాబట్టి...
నీకు సిగ్గు ఎక్కువ కాబట్టి...
నీవు సమాధానం చెప్పలేవు కాబట్టి...

నీకు తోడుగా...
నీ తల్లిదండ్రులు...
నీ అన్న తమ్ములు...
నీ పెళ్ళైన అక్కలు నీతో ఉండవలసిన పరిస్థితి...

నీ వెంట ప్రేమించి తిరిగే వాడు...
అల్లరి వాడు కావచ్చు...
సోమరితనం కావచ్చు
ఏ పని లేని వాడు కావచ్చు...
చదువు లేని వాడు కావచ్చు...
మూర్ఖత్వం కలవాడు కావచ్చు...
అబద్ధాలు ఆడే వాడు కావచ్చు...
జూదగాడు కావచ్చు...
మత్తుపదార్ధాలు సేవించే వాడు కావచ్చు...
ఇతర అమ్మాయిలను ప్రేమించే వాడు కావచ్చు అని...

నీకు తోడుగా...
నీ తల్లిదండ్రులు...
నీ అన్న తమ్ములు...
నీ పెళ్ళైన అక్కలు నీతో ఉండవలసిన పరిస్థితి...

నీవు ప్రేమించే వాడు...
నీ వరస బంధువు అయి ఉండాలి...
నీ కులం అయి ఉండాలి...
నీ మతము అయి ఉండాలి...
అని గమనించడం మంచిది...

ఎందుకంటే...
నీవు పెరిగే వాతావరణం...
నీ అమ్మ చేతి వంటలు...
నీ తల్లిదండ్రులు ప్రేమ జీవితం...
నీ కులం జీవన శైలి...
నీ మతం ఆచార వ్యవహారాలు...
నీవు పూజించే దేవుళ్ళు...
నీ జీవితం పై ప్రభావం ఉంటుంది కాబట్టి...

నీ మతము మారితే...
నీ కులము మారితే...

నీ అలవాట్లు నీ చేతిలో ఉండవు...
నీ పూజలు నీ చేతిలో ఉండవు...
నీ ఆహారం నీ చేతిలో ఉండవు...
నీ వంటలు నీ చేతిలో ఉండవు...
నీ దైవ దర్శనం నీ చేతిలో ఉండవు...
నీ తల్లిదండ్రులు నీ చేతిలో ఉండరు...
నీ బంధువులు నీ చేతిలో ఉండరు...
కాబట్టి...
నీవు ఇబ్బందులు పడే అవకాశం ఉంది...

నీవు గమనిస్తే...
నీ జీవితం...
నీ అదుపులో ఉంటుంది...

అబ్బాయిలకు మీసాలు... గెడ్డాలు... మాత్రమే వస్తాయి...
 వాటిని తీసుకోవడం సులభం...
ప్రెగ్నెంట్ రాదు అని గమనించాలి...
  
అమ్మాయిలని లవ్ చేసి ఇద్దరు పిల్లలను కన్నాక...
అమ్మేసిన అబ్బాయిలు వార్తలు...
చంపేసిన వార్తలు...
వేరే అమ్మాయితో తిరిగే వార్తలు...
నిత్యం గొడవలు పడే వార్తలు...
విడిచిపెట్టి పారిపోయే వార్తలు...
మత్తులో పడే భర్త వార్తలు...
దొంగతనం చేసే భర్త వార్తలు...
చూస్తున్నారు...

ప్రేమ అంటూ అమ్మాయిల వెంట తిరిగి... అమ్మాయిలు జీవితాలను నాశనము చేస్తున్న అబ్బాయిలు చూస్తున్నారు...

మోసపూరిత ప్రేమ వ్యవహారం పై...
ప్రతి తల్లిదండ్రులకు...
అమ్మాయిలకు...
అబ్బాయిలకు...
కుల పెద్దలకు...
మత పెద్దలకు...
కౌన్సెలింగ్ ప్రభుత్వం ఇవ్వడం మంచిది...

మా అమ్మాయి...
మా అబ్బాయి... 
అలాంటిది కాదు... ఇలాంటిది కాదు... అని అశ్రద్ధ చేయడం తల్లిదండ్రులు చేయడం పద్దతి కాదు... 
ప్రేమ వ్యవహారం లో చేతులు కాలాక ఆకులు పట్టుకోవడము వలన లాభము లేదు...

యవ్వన వయస్సు లో ఉన్న పిల్లలకు అంతా మంచిగానే కనపడతారు....

తెలిసి తెలియని వయస్సులో ప్రేమలో మోసపోతారు...

ప్రేమలో పడే పిల్లలు కాపాడే బాధ్యత ప్రభుత్వం పైన... సమాజము పైన వుంది... 

మీ పిల్లలను కాపాడే బాధ్యత...
నీ చేతిలో ఉంది...

ప్రేమలో మోసాలు...
వ్యక్తిగత భావ వ్యక్తీకరణలు... వంటివి పాఠ్య పుస్తకాల్లో ఒక శాస్త్రం గా తీసుకుని రావాలి...

అప్పుడే పిల్లలకు...
అవగాహన పెరుగుతుంది ...
ఆలోచనలు పెరుగుతుంది...
భద్రత పెరుగుతుంది...

ప్రేమించడం తప్పు కాదు...
ప్రేమలో మోసపోవడం తప్పు...

సత్యమేవ జయతే...
జగదీష్...
70759 66111

No comments:

Post a Comment