Thursday, December 29, 2022

వానప్రస్థం *"** ప్రేమకు పరాకాష్ట , భార్యా భర్తల చరమావస్త ..."వార్ధక్యమే

 వానప్రస్థం
*"**
                                            
ప్రేమకు పరాకాష్ట , భార్యా భర్తల చరమావస్త ..."వార్ధక్యమే " ... 

 ఒకరికొకరు తోడుగా నీడగా.. 
 ఓ గూటి  కాపురమే శ్రుతి లయగా
వెళ్లబుచ్చే అనురాగ జీవానాలు

మొదట ప్రేమాకర్షణల వలయంలో
తరువాత బరువు బాధ్యతల చక్రంలో
 చివరగా ఇక వాటేసుకున్న
 వానప్రస్త  జీవన సరళి లో....

తల్లి తండ్రులై ....బిడ్డలా ఆలనా పాలనల్లో మనసా అంకితమయేరు
ఈ రోజు ఆ బిడ్డల తలపుల్లో..
.వారి దూరంలో...అలవాటు పడుతూ
 ఒకరికొకరు తోడూ-నీడలై మిగిలేరు

భార్యగా నిరంతరం "గృహమే స్వర్గ సీమ   
చేశే ను...
భర్తగా ఆసాంతం కమ్మని
 "జీవన మాధుర్యం " ఇచ్చేను...

ఈ రోజుకీ "చిలకా-గోరొంక " లై అన్యోన్యంగా గూటి కాలక్షేపం లో,
 కరిగి పోతూ "ఒకరికొకరి  ఆత్మీయ
శీతల సామీప్యం , సాన్నిహిత్యం..అవే వారి మాధుర్యపు శ్వాస లై... 
సాగిస్తున్న జీవన యానం

వయో వృద్ధు లైనా....
పతి  ధ్యాసలో భార్య ,
  పత్ని   బాగు లో భర్త...
అర్ధనారీశ్వర దాంపత్యమై 
పగలు-రేయీ , వెలుగు-నీడల చందంగా...అంటిపెట్టు కునీ...

నేడు....
కరిగి పోతున్న కొవ్వొత్తులై, పంచుకునే వెలుగులతో , పంచుకుంటున్న ప్రేమసుధల.. వారి జీవన సంధ్య లో
అంకిత అర్పిత జీవనాలు .

No comments:

Post a Comment