🙏🕉🙏 ...... *"శ్రీ"*
*ఆత్మజ్ఞానం..*
*గ్రంథాలలో...*
*"లభిస్తుందా..!?"*
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"శ్రీరమణమహర్షి సందేశం"*
*"నిర్వ్యాపారంగా వుంటడం కన్నా పుస్తకం చదువుకోవడం మంచిది. సాధుజన సాంగత్యం లభించని చోట సాధు పురుషులు వ్రాసిన గ్రంథాలు పఠించడం కూడా సాధుసాంగత్యంగానే భావించవచ్చును. కానీ పుస్తకాలు చదవడం ద్వారా ఆత్మజ్ఞానం లభిస్తుందను కోవడం వ్యర్థం."*
*"పుట్టిన ప్రతి మనిషీ ఒక పుస్తకమే. ప్రతి మనిషిలోనూ మానవ చరిత్ర యావత్తూ నిక్షిప్తమై ఉన్నదంటారు శ్రీజిడ్డు కృష్ణమూర్తిగారు. తమ తమ మనసు పుటలను విప్పి చదవడానికి పూనుకుంటే, మనిషి మనసే సమస్తాన్ని విశదీకరిస్తుందంటారు ఆయన. అయితే ఈ మనసును నిశితంగా చూడాలంటే, దాని ప్రతి చలనాన్ని జాగ్రత్తగా గమనించాలంటే, మనకు ఏ అభిప్రాయమూ ఉండకూడదు. అభిప్రాయాలతో చూచే మనసూ, ఒక పక్కకు ఒరిగి ఉండే తప్పుడు త్రాసు వంటిది, రెండు ఒకటేననచ్చు. పక్షపాతంతో నిండిన మనసూ, తూకం తప్పు చూపించే త్రాసూ, ఈ రెంటిలో నుండి న్యాయం కానీ, ధర్మం కానీ ఎలా ఆశించగలం ?"*
*"అలాగే మనసుకు అన్నిటినీ పలు తెఱగులుగా విభజించే లక్షణముంటే, దాని వీక్షణ సరిగా ఎలా ఉంటుంది ? మనిషిని చూడగానే ఇతడు హిందువంటుంది ; ముస్లిం, సిక్కు, క్రిస్టియన్ అని గుర్తిస్తుంది. ఇలా గుర్తించిన మనసుకు ఈ ‘మత చీటీల’ వెనుక ఉన్న అసలు మనిషి కనిపిస్తాడా అనేది ఒక ప్రశ్న. మనిషి గనక కనిపిస్తే ‘మతం చీటీ’ ఊడిపోతుంది; మతం చీటీయే ప్రముఖంగా కనిపిస్తే మనిషి మఱుగవుతాడు. తాడు కనిపిస్తే, ఇక సర్పం లేదు, సర్పమే కనిపిస్తుంటే తాడు ప్రస్తావన లేదు. మనసు ఏ రకమైన, భ్రాంతికి లోనైనా 'ఉన్నది ఉన్నట్లు కనిపించదు."*
*"మనసు, తన పూర్వానుభవంతో చూచినా, కనిపించేవన్నీ ఆ అనుభవాన్ని అనుసరించే ఉంటాయి, నేను ఓ భాషా ప్రాంతంలో నివసించి, అక్కడి వారివల్ల కొన్ని అనుభవాలు గడించి ఉంటే, ఆ అనుభవాలు నా 'చూపును' ప్రభావితం చేస్తే. ఆ వర్గం వారందరూ చాలా మంచివారనో, చాలా చెడ్డవారనో అనిపిస్తుంటుంది. ఇక నాకు ఉన్నది ఉన్నట్లు కనిపించే దెలా ?"*
*"నేను పుట్టి పెరిగిన వాతావరణం, నా పెద్దవాళ్లు నాకు నూరి పోసిన అభిప్రాయాలు, నా పరిసరాల్లో నేను సేకరించిన అనుభవం, మానసికంగా నాకు అయిన గాయాలు, ఇతర్ల గురించి నాకుండే దురభిప్రాయాలు, నేను నేర్చిన చరిత్ర, ఇవన్నీ కలిసి నాకో దృష్టిని కలిగించినాయి. వీటన్నిటినీ నేనెప్పుడూ విమర్శగా, విశదంగా చూచిన సందర్భం లేదు. ఇలాంటి అస్తవ్యస్తమైన మనస్సుతో దేనినైనా సరిగా, తిన్నగా చూడగలను అని అనుకోవడం, తప్పుడు థర్మామీటరుతో జ్వరాన్ని కొలవడానికి ప్రయత్నించడమే అవుతుంది."*
*"వీటన్నిటినీ వదులుకున్న మనసుతో చూడడం నేర్చుకుంటే, మానవ చరిత్ర యవత్తూ మనలోనే కనిపిస్తుందంటారు "శ్రీజిడ్డు కృష్ణమూర్తి" గారు. దీనికి పుస్తకాలు చదవడం ఎందుకు అంటారు. ఆయనే కాదు, పుస్తకాల చదువు నిష్ప్రయోజమని అరుణాచల శ్రీరమణులు కూడా ఎన్నోమార్లు చెప్పారు."*
*"మనిషికి విముక్తి లభించాలంటే గ్రంథ పఠనం వల్ల ఏమైనా ప్రయోజనం ఒనగూరుతుందా, అని ఎవరో రమణుల వారిని అడిగినప్పుడు, “మది నెమ్మది పఱచడమే ముక్తి మార్గమని శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. అందువల్ల ముందు మదిని శాంతింప జేయక తప్పదు. ఈ విషయం గనక సరిగా అర్థమైతే అంతులేని గ్రంథ పఠనం అనవసరం. ఈ మదిని శాంతింపజేయడానికి, తానెవరో తెలుసుకునే ప్రయత్నం మొదలెడితే చాలు."*
*"ఈ 'నేనెవరు’ అనే వెతుకులాట గ్రంథాల్లో ఎలా చేస్తావు ? మనిషి తనని తాను కనుగొనడానికి తన విజ్ఞాన చక్షువునే వినియోగించాలి."*
*"ఈ 'ఆత్మ' పంచకోశాలలోన ఉన్నది. కానీ పుస్తకాలేమో వీటికి వెలుపల ఉన్నాయి. పంచకోశాలను పక్కకు నెట్టి ఆత్మ విచారం చేయాల్సి ఉండగా, ఇందుకై పుస్తకాల్లో వెతికితే ఏమి కనిపిస్తుంది ? మనిషి నేర్పినదంతా విస్మరిస్తే కానీ అసలు స్వరూపం కనిపించదు” అని సమాధానమిచ్చారు."*
*“ఆత్మను కనుగొనడానికి మనిషి నేర్చినదంతా విస్మరించాలి” అని శ్రీరమణుల వారు అన్న మాటని కీలక వాక్యంగా గ్రహించాలి. మనిషికి "తెలిసిన దాని నుండి” పూర్తిగా విముక్తి సాధిస్తే గానీ, ఏదీ సరిగా కనిపించదు. ఈ మహనీయులు చెప్పిన ఆప్త వాక్యాన్ని అనుసరించి జీవించి చూడాలి. అలా చేసి జీవితంతో ఏది దర్శిస్తే జన్మ సార్థక మవుతుందో దానినైనా కనుగొనవచ్చును ; కాదనుకుంటే గ్రంథ పఠనంతో, పాండిత్యంతో సంతృప్తిని పొందవచ్చును."*
*"సాధన లక్ష్యం :"*
*"వస్తుతః సాధన లక్ష్యం అజ్ఞాన నివృత్తిగాని, జ్ఞాన సముపార్జన కాదు. ఎందుకంటే, జ్ఞానం ఎప్పుడూ ఉన్నదే కానీ క్రొత్తగా సంపాదించ వలసింది కాదు. ఒకప్పుడుండి, ఒకప్పుడు లేక కొత్తగా సంపాదించ వలసిన దానికి శాశ్వతత్వం లేదు. అట్టి దానిని సంపాదించి ప్రయోజనం లేదు !!"*
🌼💖🌼💖🌼
🌼🕉️🌼
No comments:
Post a Comment