*🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏*
*భగవంతుణ్ని పూజించడంలో అనేక పద్ధతులు ఉన్నాయి.*
🌷 *మనసులో భగవంతుని రూపాన్ని ధ్యానించడం,*
🌹 *దేవునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించడం,*
🔆 *కూతురితో ప్రవర్తించిన విధంగానే కోడలితోనూ ప్రవర్తించడం.*
‼️ *ఎవరినీ ద్వేషించకుండా ఉండడం.*
👉 *ఎదుటివాళ్లు మనకేమిచ్చారనే ఆలోచనలను వదిలి మనం వాళ్లకేమివ్వగలమోననే ఆలోచన చేయడం.*
🙏 *భగవంతుడి నామ సంకీర్తన చేయడం వంటివన్నీ భగవంతుని పూజా విధానాలే.*
*👉1. కృతయుగంలో ధ్యానం*
*👉2. *త్రేతాయుగంలో యజ్ఞాలు*.
*👉3. ద్వాపర యుగంలో అర్చనలు*.
*👉 4. కలియుగంలో భగవన్నామ సంకీర్తనం*.
*👉~భగవంతుని అనుగ్రహానికి మేలైన మార్గాలు. మోక్షప్రాప్తికి తగిన సాధనాలు అని శాస్త్రాలలో చెప్పారు.*
*ముక్తి సాధనాలు గా కర్మయోగం, రాజయోగం,* *భక్తియోగం,* *జ్ఞాన యోగం*
*అని నాలుగు యోగాలు, శాస్త్రాలలో తెలిపారు.*
🖋️ *సాధారణంగా లాభాపేక్షతో జనులు కర్మలు చేస్తారు. ఫలాపేక్ష వదలి కర్మలు చేయాలని అదే నిష్కామ కర్మయోగమని గీతాచార్యుడు బోధించాడు.*
*🌾*దీని వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. నిష్కామకర్మ బంధం నుండి విడిపిస్తుంది.*
🌸 *ప్రతి పనిని భగవత్ కైంకర్యమనే భావంతో చేయాలి. ఇదే కర్మయోగం.*
No comments:
Post a Comment