Thursday, January 26, 2023

24-01-2023 తేదీ… *శ్రీమార్కండేయ మహర్షి జయంతి*

 230123h1830.    240123-4.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నేడు… 24-01-2023 తేదీ…

*శ్రీమార్కండేయ మహర్షి జయంతి*
                  ➖➖➖✍️

*’మార్కండేయుడు’ ‘మృకండు మహర్షి’ యొక్క సంతానం.    బాలుని గానే   యముని జయించి, శివుని ఆశీస్సులతో చిరంజీవత్వాన్ని పొందిన సద్గుణుడు.*


*మృకండు మహర్షి తపస్సు :*

*మృకండు మహర్షి సార్థక నామధేయుడు. ఆయన తపస్సులో లీనమై నిశ్చలుడై ఉన్న సమయంలో ఆయన శిల వలె ఉండడం వల్ల మృగములు వచ్చి తమ కండుయాన్ని (దురద పోవడానికి జంతువులు రాళ్లకు శరీరాన్ని రాపిడిచేయడం) తీర్చుకొనేవి.*

*మృగముల కండుయాన్ని తీర్చినవాడు కాబట్టి ఆయనను ‘మృకండు మహర్షి’ అని పిలిచేవారు.  ‘మరుద్వతి’ అనే మహాసాద్వి ఆయన భార్య.*

*వారికున్న ఏకైక లోటు సంతానం లేకపోవడం.*

*పుత్రులు లేకపొతే పై లోకాలలో ఉన్నత గతులు ఉండవు అని భావించి వారణాశి కి    తపస్సు    చేయడానికి సతీసమేతంగా బయలు దేరుతాడు.* 

*వారణాశిలో వారు రెండు లింగాలు ప్రతిష్ఠించి , శివుని గురించి ఘోర తపస్సు చేస్తారు.* 

*మహాదేవుడు వీరి తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై ‘మృకండ మహర్షి’ ని మరోమారు పరీక్ష చేయడానికి…, “సద్గుణుడై 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు కావాలా? లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా?” అని ప్రశ్నించగా…* 

*మృకండు మహర్షి… “సద్గుణుడైన 16 ఏళ్ళు బ్రతికే పుత్రుడు చా” లంటాడు.* 

*మహదేవుడు సంతసించి “పుత్రుడ్ని ఇచ్చాను” అని పల్కి అదృశ్యమౌతాడు.*


*సప్తర్షులు ఆశీర్వచనం:*

*మహాదేవుని మాట ప్రకారం మరుద్వతి గర్భవతి అయి 9 నెలలునిండాక దివ్యతేజస్సు కలిగిన పుత్రుడ్ని ప్రసవించింది.*

*మృకండు మహర్షి కొడుకు కావడం వల్ల వానికి 'మార్కండేయుడు' అని నామకరణం చేశారు. 7 సంవత్సరాలు 3 నెలలు నిండిన వెంటనే మార్కండేయుడికి ఉపనయనం చేశారు. * 

*రోజులు ఇలా జరుగుతుండగా ఒకరోజు సప్తఋషులు ‘మృకండ మహర్షి’ని చూడడానికి వస్తారు. * 

*మార్కండేయుడు సప్తఋషులకు నమస్కరించిన వెంటనే సప్తఋషులు ‘చిరంజీవా!’ అని దీవిస్తారు.* 

*మృకండు మహర్షి ఇది విని… “తనకొడుకు నిజంగా చిరంజీవి అవుతాడా?” అని అడుగగా … సప్తఋషులు దివ్యదృష్టితో శివునికి మృకండునికి జరిగిన సంవాదాన్ని గ్రహిస్తారు. * 

*వీరు మార్కండేయుడుని బ్రహ్మ దగ్గరకు తీసుకొనిపొయి బ్రహ్మ చేత కూడా ‘చిరంజీవ’ అని దీవింపచేస్తారు.* 

*ఆ తరువాత దివ్యదృష్టితో మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంగతి తెలుసుకొని మార్కండేయుడిని నిరంతర శివారాధన చెయ్యమని చెప్పి బ్రహ్మ కూడా శివుని గురించి తపస్సు చేసి మార్కండేయుడుడిని చిరంజీవి చెయ్యమని అడుగుతాడు.*


*#నారదుడు యముడిని; మార్కండేయుడుని కలవడం:*

*మృకండు మహర్షికి శివునికి మధ్య జరిగిన సంవాదాన్ని సప్తఋషులు, బ్రహ్మ పలికిన ఆశీర్వచనాలు గురించి నారదుడు యముడు కి చెప్పి 16 ఏళ్ళు నిండిన వెంటనే మార్కండేయుని ప్రాణాలు తీయ్యకపొతే ప్రపంచానికి యముడి భయం పొతుందని చెప్పి మార్కండేయుని దగ్గరకు వెళ్తాడు. *

*నారదుడు మార్కండేయునికి నిరంతర శివారాధన చెయ్యమని చెప్తాడు.*


*#మార్కండేయుడు చిరంజీవి అవడం:*

*విష్ణువును పూజిస్తున్న మార్కండేయుడు 16 సంవత్సరాలు నిండిన రోజు యముడు తనకింకర్లు ని మార్కండేయుడి ప్రాణాలు తీసుకొని రమ్మని పంపుతాడు. * 

*యమకింకరులు మార్కండేయుడి తేజస్సు చూసి మార్కండేయుడి ప్రాణాలు తేవడం తమవల్ల కాదు అని యముడికి చెబుతారు.*

*వెంటనే యముడు తన దున్నపోతుమీద మార్కండేయుడి ప్రాణాలు తీయడానికి బయలుదేరతాడు.*

*యముడు వచ్చేటప్పటికి మార్కండేయుడు అకుంఠిత భక్తితో శివారాధన చేస్తున్నాడు.* 

*యముడు తన యమపాశాన్ని విసిరేటప్పటికి మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని ‘శివామహాదేవా కాపాడు!’ అని మార్కండేయుడు అన్నవెంటనే శివలింగం నుంచి మహాదేవుడు ఉద్భవించి కాలరూపుడై యముడిపైకి వస్తాడు.* 

దీన్ని చూసి యముడు భయపడిపొయి “మహాదేవా క్షమించు, కరుణించమంటాడు. 

శివుడు యముడ్ని క్షమించి మార్కండేయునితో… “నాయనా చిరంజీవి ! నువ్వు పుట్టినప్పటి నుంచి చిరాయుర్ధాయం కలవాడివి. నీ తండ్రి పుత్రుడిన్ని కోరుకోమన్నప్పుడు పుత్రుడ్ని ఇచ్చాను అని చెప్పాను కాని 16 ఏళ్ళు మాత్రమే బ్రతికే పుత్రుడ్ని ఇచ్చాను అనలేదు.

ఇప్పటికి కూడా చిరంజీవిగా ఉన్నాడు.


*యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము:

*చంద్రశేఖరాష్టకం:*

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌ |
చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌| 1

రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం |
శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం |
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 2

పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం |
ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం |
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 3

మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం |
పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్‌ |
దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 4

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం |
శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్‌ |
క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్‌ |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 5

కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం |
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్‌ |
అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 6

భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం |
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్‌ |
భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 7

భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం |
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |
సోమవారినభోహుతాశనసోమపానిలఖాకృతిం |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 8

విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం |
సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్‌ |
క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం |
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 9

మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ |
యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్‌ |
పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం |
చంద్రశేఖర యేవ తస్య దతాతి ముక్తిమయత్నత:| 10

                      ➖▪️➖
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment