Monday, January 23, 2023

శ్రీరమణీయం: నాకు సంబంధించిన వస్తువులు, విషయాలు నావే అని భావించటంలో పొరపాటు ఏముంది ?

 💖💖💖
       💖💖 *"447"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
 
*"నాకు సంబంధించిన వస్తువులు, విషయాలు నావే అని భావించటంలో పొరపాటు ఏముంది ?"*

*"ఒక కోటీశ్వరుడు కోమాలో ఉన్నాడు. అప్పుడు అతడు దేన్నీ గ్రహించలేడు. కోమా నుండి బయటికి రాగానే గ్రహింపు శక్తి వచ్చి ఈ ఇల్లు నాది అంటాడు. అలా అనేది అతని శరీరం కాదు. ఆ శరీరాన్ని నడిపే గ్రహింపుశక్తి ఆ మాట అంటుంది. కొద్దిసేపటికే అతడు మరణిస్తే అతడిలోని గ్రహింపుశక్తి పోతుంది. అప్పటివరకు ఇల్లు నాది అనుకునే ఆ గ్రహింపుశక్తి పోయింది కానీ ఇల్లు అక్కడే ఉంది. ఆ ఇంటిని ఆ గ్రహింపుశక్తి తనతో పాటుగా తీసుకెళ్ళలేక పోయింది. అలాంటప్పుడు అది తనది అనటంలో అర్థం ఏమిటి ? ఒక విషయాన్ని గ్రహిస్తూ ఉండటం మినహా మనం దాని నుండి ఏదీ పొందేది ఉండదు. ఈ విషయాన్ని, వస్తువును గ్రహింపుశక్తి తనలో కలుపుకోలేదు. తన సొంతం చేసుకోలేదు. బిపి మిషన్లో మన రక్తపోటును పాదరసం చూపిస్తుంది. పాదరసానికి ఆ రక్తపోటు అంటుకోనట్లే మనలోని గ్రహింపుశక్తికి ఏదీ అంటదు. ఈ విషయం అనుభవపూర్వకంగా అర్థమైన రోజు మనలోని ఆ వెలితి పోతుంది. అప్పుడు ఆ కోరిక, ఈ కోరిక అని కాకుండా, అసలు అన్ని కోరికలకు కారణమైన ఆశ అనే గుణమే లేకుండా పోతుంది !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*

No comments:

Post a Comment