Thursday, January 26, 2023

శ్రీరమణీయం: ఆశ లేకుంటే శాంతి వస్తుంది అంటున్నారు, మరి చేసే ప్రతి పనిలో ప్రతిఫలం ఆశించటం సహజం కదా ?

 💖💖💖
       💖💖 *"450"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
     
*"ఆశ లేకుంటే శాంతి వస్తుంది అంటున్నారు, మరి చేసే ప్రతి పనిలో ప్రతిఫలం ఆశించటం సహజం కదా ?"*

*"మనలోని ఆశను తగ్గించుకుంటూ పోయేకొద్దీ శాంతి వెల్లివిరుస్తుంది. స్వీటు మనం తయారు చేసుకుని తిన్నా, మరొకరు చేసి ఇచ్చినా అదే తియ్యదనం ఉంటుంది. అలాగే కోరికలేని స్థితిలోనే పరమశాంతి ఉన్నదని మనం ధ్యానంలో తెలుసుకోలేక పోయినా, అది తెలుసుకుని బోధించే గురువుగారి పట్ల విశ్వాసంతో ఈ విషయాన్ని పాటించినా సరిపోతుంది. అడగటం అనేది మన అల్పత్వం. ఆ అల్పత్వం పోయిన తర్వాత ఉండే అద్భుత మానసిక స్థితిపేరు ధ్యానం. బాహ్య జీవనంలో 'వస్తువులేని ఫలం, ఫలంలేని క్రియ' ఉండవు. మనం క్రియ చేస్తున్నామంటేనే ఏదో ఒక ఫలాన్ని ఆశిస్తున్నామని అర్థం. ఇలా ప్రతివస్తువును ఫలంతో ముడిపెట్టి ఆలోచిస్తాం. ఫలం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. కనుక అశాంతి తప్పదు. శాంతి చెడకుండా వస్తువులతో ఎలా ఉండాలో మన అంతరంగంలో (ధ్యానస్థితిలో) తెలుసుకొని అలా మసలు కోవటమే నాగరికత !"*

*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
             

No comments:

Post a Comment