*నేటి మంచి మాట.
చీకటి దాటి కదలాలంటే*
*ఓపిక ఉండాలి...*
*అలుపే ఎరుగక అడుగులు*
*ముందుకు సాగాలి.*
*ముళ్ళూ పూలూ ఏవైనా*
*ఒకటే తీరున వేగం ఉండాలి.*
*గాయం చూస్తూ గమనం ఆపితే*
*గమ్యం చేరే దెప్పటికి?*
*రాలిన పూలే చెట్టును చేరవు*
*కొత్త చివురులే రావాలి*
*మనసు గడియ తీసి*
*మేలు ఘడియలు గడపాలి*
*మధువనం పరిమళం*
*పంచినట్టుగా మంచితనం పంచాలి* .
*మబ్బుల్లో నీళ్ళన్నీ*
*నేలపైనే కురిసినట్టు ప్రేమను* *పెంచాలి*
*సృష్టి లోని అందాలన్నీఆస్వాదిస్తే*
*ఆనందపు మకరందాలే* *జీవనమంతా*
*నవ్వుతూ నవ్విస్తూ*
*ఆడుతూ పాడుతూ జీవితముంటే*
*నిరంతరమూ వసంతాలే!*
*జీవన పయనపు సారం పెంచి*
*జీవించడంలో స్వారస్యం నింపే*
*ప్రశాంతమైన ఉదయానికి*
స్వాగతం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం
No comments:
Post a Comment