Thursday, January 26, 2023

మన ఆరోగ్యం…. *హృదయం విప్పండి!* ➖➖➖✍️ (గుప్తేశ్వర్ గుండెకాయ కథ) *-సూర్య ప్రకాశ్ మహావాది.*

 220123g1620.      240123-8.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*మన ఆరోగ్యం….

         *హృదయం విప్పండి!*
               ➖➖➖✍️
       (గుప్తేశ్వర్  గుండెకాయ కథ)
               *-సూర్య ప్రకాశ్ మహావాది.*

*గుప్తేశ్వర్ కు గుండె నొప్పి వచ్చింది.*

*ఇది ఎవరికీ మింగుడు పడని విషయం అయ్యింది బంధు మిత్రులలో.*

*దానికి కారణం లేకపోలేదు.*

*గుప్తేశ్వర్  పుట్టింది ఎటువంటి వాతావరణ కాలుష్యం లేని హిల్ స్టేషన్ లో. అఆ లనుండి అగ్రికల్చర్ లో డిగ్రీ వరకు అక్కడనే చదువు.* 
*ఊహ తెలిసినప్పటినుంచి ఉదయం ఐదు గంటలకే లేవడం వాకింగ్ లు, యోగాలు వగైరా వగైరా చేయటం. ఆహారం విషయంలో ఆరోగ్య సూత్రాలు పాటిస్తు చాల సాత్వికమైన ఆహారం భుజించటం చేసేవాడు.*

*సిగరెట్, మద్య పానం లాంటి దురలవాట్లు  అంటేనే తెలియని మహానుభావుడు.*

*అదృష్టం కొలది హిల్ స్టేషన్ లోనే ఉద్యోగం దొరకటంతో  ఆరోగ్యం కు ఏమీ డోకావుండదని అనుకొన్నాడు.*

*భార్యా పిల్లలతో సాఫీగా సాగుతున్న అతని జీవితంలో అరవై సంవత్సరాల వయసులో ఎడమవైపు చాతిలో నొప్పి వచ్చి హాస్పిటల్ లో అడ్మిట్ చేస్తే  ’ఓపెన్ హార్ట్ సర్జరీ’ చేయవలసి వస్తుంది. లేకుంటే ప్రాణానికి ప్రమాదం అని అన్నారు.*

*ఈ విషయం తెలుసుకున్న గుప్తేశ్వర్ తో సహా ఎవరు నమ్మలేదు.*

*’ఇదిగో నేను ముందుగానే చెప్పాను ఈ వెధవకు నాతో పాటు అప్పుడప్పుడు ఓ పెగ్ వేయరా అంటే విన్నాడా. రోజూ బాటిల్ త్రాగే.. నన్ను చూసి గుండెజబ్బు భయపడుతుంది తాగి ఆగ్లంలో తిడతానేమో’ నని ఓ దేవదాసు వాగసాగాడు.*

*’ఆ నేనూ చెప్పాను సిగరెట్ త్రాగరా. మనిషి పుట్టుక పుట్టిన తర్వాత త్రాగాలిరా. లేకుంటే వచ్చే జన్మ లో దున్నపోతువై పుడతావురా!’ అని. విన్నాడా లేదు. ఇదిగో ఏమీ ఎంజాయ్ చేయకుండానే గుండెకు కోత తెచ్చుకొన్నాడు అని ఇంకో స్నేహితుడు ధూమేశ్వర్ రావు తన అభిప్రాయం వెల్లడించాడు.*

*ఇలా తలా ఒకరు తమకు ఏదో ఒక దురలావాట్లు వున్నా తాము గట్టిగా వున్నామని ఏ దురలవాట్లు లేని గుప్తేశ్వర్ కు ఇలా ఎలా అయ్యిందని ఆశ్చర్య పోయారు.*

*ఆపరేషన్  కన్న   ముందు తనకు   ఆపరేషన్ చేసే డాక్టర్ ను కలవాలి అని అనుకొన్నాడు గుప్తేశ్వర్.*

*దానికి డాక్టర్ ఒప్పుకోవడంతో తన ఆత్మ కథ మొత్తం విరామం లేకుండా ఏకరువు పెడతాడు.*

*గుప్తేశ్వర్  ఆత్మ కథ విన్న     డాక్టర్ సందేహ రావు తన కొన్ని సందేహాలు నివృత్తి చేయమంటాడు.*

*దానికి తలకాయ ఊపుతాడు గుప్తేశ్వర్ .*

*”నీ చిన్న తనంలో నీ అమ్మతో  నాన్న తో నీకేమైనా కావాలంటే నిస్సంకోచంగా అడిగే వాడివాడివా?”*

*“లేదు!”*

*”నీ స్నేహితులతో.    నీ పర్సనల్ విషయాలు ఏమీ దాచుకోకుండా  పంచుకొనేవాడివా?”*

*”లేదు.”*

*”నీ ఆత్మకథ లో   ఎవరో అమ్మాయిని  ప్రేమించాను అన్నావు. ఆమెతో ఎప్పుడైన మనసువిప్పి మాట్లాడావా?”*

*”లేదు.”*

*”నీ కోలిగ్స్ తో కాని, నీ సభార్డినేట్స్ తో కానీ ఎప్పుడైనా అధికార హోదా చూపకుండా నవ్వుకుంటూ మాట్లాడావా?”*

*”అబ్బే లేదండి. నేను వాళ్లతోనేమిటి ఆఖరికి   నా భార్య బిడ్డలతోని కూడ చాలా రిజర్వ్ గా వుండేవాడిని.”*
***********

*”అదీ సంగతి. నాకు ఇప్పుడు అర్ధం అయ్యింది. ఏ దుర అలవాట్లు లేవని నీవు మరియు నీ వాళ్లందరూ అనుకొన్నారు. కాని వాటన్నికన్న  మించిన దురలవాటు నీలో వుందని.”*

*“ఏమిటి డాక్టర్? ఏమిటి మీరంటున్నది.”*

*”అవును. నీకు ఎవరితోను హృదయం విప్పి మాట్లాడలేని దురలవాటు వుంది. దాని కారణం వల్లనే నేడు నీ హృదయం విప్పవలసి వస్తుంది.”*

*”రిజర్వ్ డు గా    కొన్నిచోట్ల కొన్ని సమయాల్లో వుంటే ఫర్వాలేదు.*

*అదే అలవాటుగా మారి మనసు విప్పి మాట్లాడకుండా పోవటం వలన మన వారికే కాక మనకు మనమే దూరం అవుతాము.”*

*కల్మషంలేని మనసుతో మనసు విప్పి మాట్లాడతూ జీవించేందుకు ప్రయత్నిద్దాం!*

*ఎవరితోని దాపరికం లేకుండా మనసు విప్పి మాట్లాకున్నా ఫర్వాలేదు,*

*నమ్మకమైన బాల్య స్నేహితులు/ స్నేహితురాళ్ల వద్ద మాత్రం మనసు విప్పి మాట్లాడండి..!*

*సమస్యలకు..  కనీసం ఓదార్పు అయినా లభిస్తుంది. గుండె పై భారం తగ్గిపోతుంది*.

*గుండెకాయ ఎటాక్ (Heart attack)నుండి చాలా వరకు తప్పించు కొనవచ్చును*

*ఏమంటారు*✍️

.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment