*ప్రతి అక్షరం బీజమే*
*పలికే ప్రతి అక్షరం మంత్రమే. ఒక్కో అక్షరం మంత్రం లాగా జపం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనం తెలుసుకుందాం. ఆ ధ్వని వల్ల కలిగే అద్భుతమైన ఫలితాన్ని పొందుదాం.. "అచ్చులు ".*
*1."అ"కార శబ్ధధ్వని నుండి వచ్చే మంత్రసాధన విశ్వములో వుండే అతీతశక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది.*
*1.అ - అకార శబ్దము -థైరాయిడ్ గ్రంధి సమస్యలు, డిప్రెషన్ తగ్గించు కోవడానికి సహాయపడుతుంది.*
*2."ఆ" - *ఆకార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన సాధకుడు చేయుచున్న మంత్రములో శక్తి ఉత్పన్నం అవుతుంది.*
*ఆ "కార శబ్దము హార్ట్ బీటింగ్ లో వుండే కొన్ని సమస్యలను " ఎక్టోపిక్ బీట్" లాంటివి తగ్గించు కోవడానికి సహాయం చేస్తుంది.*
*3. "ఇ" - ఇకార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవుడికి కలుగు భౌతిక సమస్యలు ఊహించని విధముగా సంతోషకరముగా జరగటానికిసహాయము చేస్తుంది.*
*"ఇ" ఇకార శబ్ద ధ్వని - ఐరన్ డెఫిషియన్సీ వ్యాధి వలన కలుగు. స్త్రీలలో హృదయ భాగంలో ఎండిపోవటం, జుట్టు రాలటం, కాళ్ళు, చేతులు పీక్కుపోవటం, నివారణకు సహాయం చేస్తుంది.*
*4. "ఈ " - తన శక్తి సామర్ధ్యములు తెలుసుకోవచ్చు. *కొన్ని మంత్రాక్షరములు సంపుటిచేత కుటుంబ సభ్యుల మనోభావములు అంతర్ముఖముగా తెలుసుకోవటానికి సహాయం చేస్తుంది.*
*"ఈ" - కార శబ్ధ ధ్వని స్త్రీలకు మెనోపాజ్ సమయంలో వచ్చే కొన్ని ఇబ్బందుల నివారణకు సహాయం చేస్తుంది. ఈస్ట్రోజన్ తగ్గడం వలన యోని సైడ్ వాల్స్ వీక్ అవుతాయి. ఈ సమస్య చేత లైంగిక సమయంలో బాధాకరంగా వుంటుంది. ఇటువంటి సున్నిత సమస్యలు నివారణకు సహాయం చేస్తుంది.*
*5. "ఉ"- "కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జరగబోయే కాలములో జీవుడు చేయు భౌతిక కర్మలు జయాపజయములు అంతర్ముఖముగా తెలుసుకోవుటకు సహాయం చేస్తుంది.*
*"ఉ" కార శబ్ధ ధ్వని జీర్ణకోశ వ్యవస్థ లోపాలు సరిదిద్దు కోవటానికి సహాయం చేస్తుంది.*
*6. "ఊ"కార శబ్దధ్వని వల్ల మంత్రసాధన ప్రేతాత్మలు ఆవహించిన వారివి గుర్తించవచ్చని పాశ్చాత్య పండితుల తంత్రగ్రంధములు, భారతీ పురాతన దత్తాత్రేయ,సిద్ధనాగార్జున తంత్రగ్రంధములు తెలియచేస్తున్నాయి.*
*"ఊ" కార శబ్ధ ధ్వని ఆస్తమా లాంటి దీర్ఘకాల వ్యాధుల నివారణకు సహాయం చేస్తుంది.*
*7. "ఋ" కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన ఆకాలమృత్యువు, అపమృత్యువు, యాక్సిడెంట్ల నివారణకు సహాయంచేస్తుంది.*
*"ఋ" కార శబ్ధ ధ్వని స్పాండిలోసిస్ అనబడే వెన్నుపూస సమస్యల నివారణకు సహాయం చేస్తుంది.*
*8. "ౠ" కార శబ్ధధ్వని - మంత్రసాధనతో అంతర్ముఖముగా సాధకుడు నిత్యయవ్వనముగా ఉండవచ్చు, బాహ్యసౌందర్యము పెంచుకోవచ్చు లింగబేధములేకుండా.*
*"ౠ" కార శబ్ద ధ్వని నెర్వ్ కంప్రెషన్, రుమాటాయిడ్ వలన కలిగే సమస్యల నివారణకు సహాయము చేస్తుంది.*
*9." ఎ" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన శత్రువులమీద విజయం సాధించడం, ఆత్మ రక్షణ కొరకు ఉపయోగపడుతుంది.*
*"ఎ" కార శబ్ద ధ్వని వంశపారంపర్య వ్యాధులు కొన్ని నివారణకు సహాయం చేస్తుంది.*
*10. "ఏ" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవుడు ఆత్మజ్ఞానము కోసం చేసే ప్రయత్నములో విజయం కలగటానికి, చేయుచున్న మంత్రసాధన అవరోధములు కలుగకుండా సహాయంచేస్తుంది.*
*"ఏ" కార శబ్ద ధ్వని పురుషులలో బెలనైటిన్ అనబడే లైంగిక సమస్య, స్త్రీలలో వైట్ డిస్చార్జ్ నివారణకు సహాయం చేస్తుంది.*
*11. "ఐ" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవునికి వాక్సిద్ది,జ్ఞాపకశక్తి పెరగటానికి, కోరుకుంటే అపరోక్ష జ్ఞానము కలుగుటకు సహాయం చేస్తుంది.*
*"ఐ " కార శబ్ద ధ్వని తల భాగంలో ఉండే కొన్ని వ్యాధులు టెంపోరల్ ఆర్టిరైటిన్, హై బి.పి., హైపర్ టెన్షన్ నివారణకు సహాయం చేస్తుంది.*
*12."ఒ"కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన దీర్ఘకాల ఆర్ధికసమస్యల నివారణకు (కోర్టు వ్యవహారాలు), శత్రువులు సాధకులకు మిత్రులగుటకు సహాయంచేస్తుంది.*
*"ఒ" శబ్ద ధ్వని డిప్రెషెన్ కొన్ని రకమైన లైంగిక పరమైన సమస్యల నివారణకు సహాయం చేస్తుంది.*
*13. ఓ" కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన జీవుడు చేయుచున్న మంత్రసాధన వేగముగా సిద్ది కలగటానికి సహాయం చేస్తుంది..*
*"ఓ " కార శబ్ద ధ్వని కొన్ని దీర్ఘకాల వ్యాధుల నివారణ కొరకు సహాయం చేస్తుంది.*
*14. "ఔ" కార శబ్ధధ్వని వల్ల వచ్చే మంత్రసాధన భూతప్రేతపిశాచములను, అన్నిరకములైన దుష్టశక్తుల నివారణకు సహాయంచేస్తుంది అని పురాతన తంత్రగ్రంధములలో వుంటుంది.*
*"ఔ " కార శబ్ద ధ్వని అన్ని రకములైన మానసిక రోగముల నివారణకు సహాయం చేస్తుంది.*
*15. "అం" కార శబ్దధ్వని వల్ల వచ్చే మంత్రసాధన భోగ, మోక్ష మంత్రసాధనలందు ఉత్తమంగా వుంటుంది. (శాక్తేయ మంత్రవిద్యల యందు).*
*"అం" కార శబ్ధ ధ్వని భౌతికవ్యాధులు గుర్తించుటకు అంతర్ముఖముగా సహాయం చేస్తుంది.*
*16. "అః" కార శబ్ధధ్వని*
*వ్యాధినిరోధక సాధనము వంటిది. దీర్ఘకాల వ్యాధులందు ఉత్తమం.*
*అక్షర పరబ్రహ్మణే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత శరణం మమ*🙏🌷
No comments:
Post a Comment