హరి: ఓం శ్రీ గురుభ్యోన్నమ: 🙏
సద్గురువును త్రికరణ శుధ్ధిగా ఆశ్రయించిన దినం అది అతని జన్మ దినం.
భౌతికమైన ... ఐహికమైన ఏ ఏ గురువులు సహాయపడ్డారో వారందరినీ ఈ సద్గురు మూర్తిలోనే దర్శించాలి.
ప్రాణ సమానమైన దెవరయ్యా ... తల్లీ ... తండ్రీ ...గురువు ... దైవం
ఈ నాలుగు ఆ సద్గురువే ఆశ్రయించిన వాడికి ...
అనేక జన్మలలో ప్రాప్తించిన సంసార ప్రీతి భంగమవుతుంది.
సత్శిష్యునికి ... సద్గురువుతో ఐక్యతా సిధ్ధి కలగాలంటే ... సంసార ప్రీతి భంగాయ.
భ్రాంతి ఎక్కడ ఉంటే అక్కడ సంసారముంది.
సద్గురు మూర్తిని ఆశ్రయించి భ్రాంతి రహితమైన జీవితాన్ని జీవించాలి.
మూడు అవస్థలు ... త్రికాలము లందు భ్రాంతి రహితంగా ఉండాలి ... వాడు సంసార ప్రీతి భంగాయ ..
నేను ... నాది ఇవి రెండూ సంసారము ..పరిపూరకం.. సంపూరకం .
సాధకుడై .. సత్ శిష్యుడైన వాడు భ్రాంతి రహిత స్థితి పొందటం చాలా అవసరం .. పాత్రోచితమై .. వ్యాపకమై ఉంటాయి ... మానవ సంబంధాలు ... నేను నాది ఉంటాయి వాటిలో.
నీ అంత:కరణ లేనిదని నిరూపితమైన రోజు సంసార ప్రీతి భంగాయ ... సంసారం తోచినంతకాలం .. నేను .. నాది
మూడు అవస్థలలో .. నేను నాది
అనే తాపత్రయం తో కూడిన సంసార ప్రీతి ఇమిడి .. అంతర్లీనంగా ఉంటుంది.
వినిర్ముక్త: .. ఎప్పటికీ అంకురించని దశలో ... స్వరూప జ్ఞానంలో ఉండాలి.
లోపల నిరశించటం .. ప్రధానం.
లోపల పండితే ... బయట చెప్పనక్కరలేదు.
ఐదు .. ఐదులుగా చెప్పబడే పిండాండ... బ్రహ్మాండ భాగాలు సమస్తాన్ని సంసార ప్రీతిగా చూడాలి.
నీవు బ్రహ్మమై ఉన్నప్పుడు అవ్యక్తానికి అవతల ఉన్నావు కదా. బ్రాహ్మీ భూత స్థితిలో ఉండాలి.
తురీయ నిష్టుడికి ... మెలకువ.. కల... నిద్రలు వచ్చిపోతుంటాయి .. వాడికి బింబ ప్రతి బింబ భావన బాటసారుల వలే ....
అంగం.. దేహాత్మ... సంగం = ఇరవై ఐదూ ఒకటైన జ్ఞాత
లింగం= సూత్రం తెలియటము
భంగం= బింబ ప్రతిబింబ న్యాయం తెగిపోతే అది భంగము.
సద్గురుమూర్తిని తల్లీ , తండ్రీ, గురువు, దైవం గా ఆశ్రయించి సంసార ప్రీతి పోగొట్టుకున్నాడో
అతడికి నేను .. నాది పని చేయవు ... అన్యమేమీ తోచదు.
అతడు కర్త అయ్యే అవకాశం లేదు ఏ కార్యమొనర్చినా .. అపవిత్రుడు కాడు కర్త లేదు కాబట్టి.
సర్వదా సర్వ కాలము లందు .. ఏకాకీ.. నిస్ప్రుహ .. త్రిపుటి రహితం గా వ్యవహారం అతీతంలో చేస్తాడు కాబట్టి ... లోక కళ్యాణ కారకం.
గురు శిష్యులిద్దరూ లేరని చెప్పటం గురుగీతా హోమం
కర్త లేకుండా చేయబడేవన్నీ లీలలే
కర్తృత్వ రహిత కర్మాచరణ లీల .. అది అమృత స్వరూపం.
ఉన్నదంతా బ్రహ్మమే అనే వ్యవహారం కలిగినవాడు ఏది చెప్పినా లోకోపకారకం అవుతుంది.
సర్వానందమయం... సర్వ సౌఖ్య ప్రదాయకం .. భుక్తి ముక్తి ప్రదాయకం అయి ఉండాలి ధ్యానం.
సృష్టి.. స్థితి... లయాలకు ఆధారమైన ప్రక్రియ ధ్యానం .. త్రిపుటికి అతీతమైనది ధ్యానం ..
శ్రీ విద్యాసాగర్ స్వామి వారు
గురుగీత --41
జై గురుదేవ 🙏
No comments:
Post a Comment