Sunday, February 12, 2023

దుష్టుడి సహాయం దుఃఖాలకు మూలకారణం.

 🌷 *జై శ్రీమన్నారాయణ* 🌷

 *దుష్టుడి సహాయం దుఃఖాలకు మూలకారణం.* 

🌱🪷🌱🪷🌱🪷🌱🪷🌱

ఆపత్కాలంలో (కష్టకాలంలో)కూడా ఆశ్ర యించ  కూడనివారు.
1-షండుడు:సకాలంలో స్నానం చేయని వాడు,దేవతలను, తల్లిదండ్రులను గౌరవింపనివాడు.

2.మార్జానుడు:-అహంకారం తోను,నిర్లక్ష్యం తోను,జప,తపాలు చేసేవాడు.

3:-అఖువు:-కావలసినన్ని సంపదలు ఉన్నా తాను తినక,ఇతరులకు పెట్టని వాడు.

4:-కుక్కుటుడు:-పక్షపాతం తో తీర్పులు చెప్పేవాడు.

5:-పతితుడు:-తన ధర్మం  విడిచి  పరధర్మం ఆచరించేవాడు.

6:-అపవిద్దుడు:-గో హత్య,స్త్రీ హత్య మొ:లగు పాతకాలు చేసే వాడు.

7నగ్నుడు.:-దైవ భక్తి లేనివాడు.

8:-ఛండాలుడు:-ఎంతో ఆశతో వచ్చినవానికి,తాను సహా యపడక ,ఇతరులు కూడా సహాయపడకుండా  అడ్డుపడే వాడు,మరియూ శరణు కోరి వచ్చేవానిని  గాలికి వదిలేసేవాడు.

9:-అధముడు:-బంధువులు, స్నేహితులు, ఉత్తములు  మొదలగువారికి దూరమైనవాడు.
ఇలాంటి వారిని ఎంత కష్టదశలో ఉన్నా  వారిని ఆశ్రయించరాదు అని విజ్ఞులైన మనపెద్దలచే చెప్పబడింది.

🪷 *జై శ్రీమన్నారాయణ* 🪷

No comments:

Post a Comment