*అవతార పురుషుడు సృష్టికి కేంద్రమై ఉండడము అంటే...*
*Avatar, Being the Center of the Universe means...*
*~~~*
- సద్గురు శ్రీ మెహెర్
చైతన్యజీ మహరాజ్
(Part - 10 )
*గురుదేవులు:: అసలు "బాధానుభవం" అనేటువంటిది జీవుని యొక్క పురోగమనకు సహాయం చేస్తుందని గదా సిద్ధాంతం! ఈ "బాధానుభవం" ద్వారానే జీవుడు ఉద్ధరింపబడతాడని గదా సిద్ధాంతం! అటువంటప్పుడు, అలా నలుగుడు లేకుండగా– ఆ బురుజు దగ్గరకు చేరినటువంటి గింజలకు ఏమి వినియోగం ఉంటుంది అంటే, బాబా తెలియజేసారు:*
"అది కేవలము
నీకు అర్థమవ్వడం కోసము
ఉదాహరణగా చెప్పిందే
గానీ, అది పారమార్థిక
సత్యం కాదు"
*అని తెలియజేసారు.*
*ఎవరైతే సృష్టికి కేంద్రమై ఉన్నటువంటి అవతార పురుషుణ్ణి చేరి ఉంటారో, వారికి-*
- ఏ విధమైనటువంటి
సాధన గానీ,
- ఏ విధమైనటువంటి
నలుగుడు గానీ, అంటే
నలిగి ఆ పొల్లు
పోగొట్టుకోవలసినటువంటి
అవసరము గానీ
లేదనిన్నీ,
*ఆయనను చేరడము ద్వారానే, చేరడము కారణముగానే "సంస్కారములు" అన్నీ వాటంతట అవి రహితమైపోతవనిన్నీ తెలియజేసారు బాబా.*
*ఆ విధముగా, సృష్టికి కేంద్రమైనటువంటి అవతార పురుషుణ్ణి చేరినటువంటి ఆత్మలు– సంస్కార భూయిష్టమైనటువంటివా, కర్మ భూయిష్టమైనటువంటివా అని విచారించనవసరం లేదు.*
_రోగగ్రస్థుడైనటువంటి వ్యక్తి, సమర్థమైనటువంటి ఒక వైద్యుని దగ్గరకు చేరితే, ఇంక ఆ రోగమేం చేస్తుంది ఆ వ్యక్తిని? అదే విధముగా,_
_*సమర్ధుడైనటువంటి*_
_*ఈ అవతార పురుషుణ్ణి*_
_*ఆశ్రయించుకున్నటువంటి*_
_*వ్యక్తులకు,ఈ కర్మలు,*_
_*ఈ సంస్కారములు*_
_*ఏమి చేస్తవి?*_
_*ఏమి చేయగలవు?*_
_(ఏమీ చేయలేవు!) అందుకు కూడా కారణమున్నది అని చెప్పారు బాబా._
*(ఏమిటంటే,) జీవుడు అనుభవించడానికి కారణమైనటువంటి "సంస్కారము" తనే కనుక, అంటే అవతారుడే గనుక– ఎందుకని (కారణము) అవతారుడయ్యాడు? ఏం డాక్టరుగారూ! ఆయన ఎందుకు కారణమయ్యాడు? సంస్కారమే తానై ఎందుకు ఉన్నాడు? (అంటే)*
_ఆదిలో తానే యిది_
_ఊహించుకున్నాడు_
_గనుక,_
_(తాను)_
_ఊహించుకున్నటువంటి_
_"ఊహే"- చివరకు_
_సంస్కారమై,_
_ఈ జీవితంగా_
_వ్యక్తమవ్వడం,_
_ఈ జీవులు_
_ఈ విధమైనటువంటి_
_జీవితానుభవాల్ని_
_అనుభవించడం_
_అనేటువంటిది_
_జరుగుతున్నది కనుక,_
_"సంస్కారము" కూడా_
_తానే గనుక,_
_తనను తాను_
_ఏమి చేసుకోగలడు_
_గనుక?_
*అందుచేత, ఆయనను ఆశ్రయించినటువంటి జీవులకు ఈ సంస్కారములు, కర్మలు ఏమీ చేయవు.*
*మరి మానవులందరూ ఏదో రూపంలో ఆయనను ఆశ్రయించినటువంటి వారే కదా? అవతార పురుషుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించినటువంటి వారే గదా? మరి వారికి ఈ కష్టములు, నష్టములు ఎందుకు సంప్రాప్తమౌతున్నవి? ఈ "కర్మానుభవం" అనేటువంటిది ఎందుకు తప్పడం లేదు అంటే–...*
To be contd.....
No comments:
Post a Comment