Friday, March 3, 2023

కాబట్టి ఒకరి జీవితాన్ని విమర్శించి, తప్పులు వెతగడం అందరికి చాలా తేలిక. కానీ అదే ఒకరి జీవితాన్ని సరిచేయడము మాత్రం చేతకాదు ఎవ్వరికి...

 🕉️🌞🌎🏵️🌼🚩

*ఒక వ్యక్తి పెయింటింగ్ కోర్సు పూర్తి చేశాడు ..* 
 *3 రోజులు కష్టపడి ఒక అద్భుతమైన పెయింటింగ్ గీశాడు.దాని మీద ప్రజల అభిప్రాయం కూడా తెలుసుకోవాలి అనుకున్నాడు .*  

 *నాలుగు రోడ్లు కల్సే చోట దానిని ప్రదర్శించాడు.* 
 *దాని కింద ఇలా ఒక నోటీసు పెట్టాడు.* 

 *నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు .ఎక్కడ లోపం ఉందొ అక్కడ ఒక " ఇంటూ " మార్కు పెట్టండి అని అందులో ఉంది.* 

 *దానిని అక్కడ ఉంచి తిరిగి సాయంత్రం వచ్చి చూశాడు . అతడికి ఏడుపు వచ్చేసింది. దాని నిండా* 
 *" ఇంటూలే ". ఖాళీ లేదు .* 

 *ఏడుస్తూ తనకు ఆర్ట్ నేర్పిన మాస్టారు దగ్గరకి పట్టుకు వెళ్ళాడు . " నేను పెయింటింగ్ వెయ్యడానికి పనికి రాను అని నాకు తెలిసి పోయింది " అంటూ విచారించాడు .* 

 *అప్పుడు మాస్టారు అతడిని ఓదార్చి .....అదే పెయింటింగ్ మళ్ళీ వెయ్యమన్నారు . మళ్ళీ అదే పెయింటింగ్ అలాగే వేసుకుని వచ్చాడు . ఈసారి కూడా అక్కడే పెట్ట మన్నారు  . దానికింద ఈ సారి నోటీసు ఇలా రాయించారు గురువుగారు.* 

 *నేను గీసిన మొదటి పెయింటింగ్ ఇది . ఇందులో మీకు లోపాలు కనిపించవచ్చు . ఎక్కడ లోపం ఉందో అక్కడ క్రింద నేను పెట్టిన రంగులు , బ్రష్ లతో దానిని సరి చెయ్యండి " అని ఆ నోటీసులో ఉంది.* 

 *విచ్చిత్రంగా వారం రోజులు అయినా ఒక్కరూ దానిలో లోపాలను సరి చెయ్యలేదు.* 

 *ఎందుకలా జరిగింది ?  అనుకొంటూ అతను మళ్ళీ మాస్టార్ దగ్గరికెళ్ళి జరిగింది చెప్పడంతో ....* 
 *మాస్టారు అతనికి ఇలా చెప్పడం జరిగింది...* 

 *ఎదుటి వాడిని విమర్శించడం చాలా తేలిక . సరి చెయ్యడం చాలా కష్టం" అని. ....!!* 

 *కాబట్టి ఒకరి జీవితాన్ని విమర్శించి, తప్పులు వెతగడం అందరికి చాలా తేలిక. కానీ అదే ఒకరి జీవితాన్ని సరిచేయడము మాత్రం చేతకాదు ఎవ్వరికి...* 

🕉️🌞🌎🏵️🌼🚩

No comments:

Post a Comment