Sunday, March 5, 2023

 *🌺🙏ఓం నమఃశివాయ 🙏🌺*


*_🌴 సంసార సాగరంలో మునిగిపోతూ మనశ్శాంతి లేకుండా నిత్యమూ ఏదో ఒక చింతతో సతమతమవుతూ  ' మా పరిస్థితి ఇంతేనా! మేము ఇలా ఉండిపోవల్సిందేనా!! మాకు ఉద్దరింపబడే మార్గం లేదా!!? ' అని చింతించేవారు ఒకసారి తెలుసుకోండి.*
 *పుష్కరాలు సమయంలో నదిలో స్నానం చేసినపుడు నది ప్రవాహానికి కొట్టుకుపోకుండా ఉండడానికి నదిలో ఇనుప గొలుసులుతో పొడవాటి త్రాడువంటి నిర్మాణాలు ఏర్పాటు చేస్తారు.*
 *స్నానం చేసేవారు ఆ గొలుసులు పట్టుకుని స్నానం చేస్తారు.  అలాగే సంసారము అనెడి నదిలో ఉండి కూడా వాటి బంధాలనే ప్రవాహానికి కొట్టుకుపోకుండా  ఉండడానికి భగవంతుడు భగవన్నామ స్మరణ అనే గొలుసు ఏర్పాటు చేశాడు.*
  *ఈ గొలుసు గట్టిగా పట్టుకుని ఉన్నంత వరకూ ఈ సంసారపు చింతల ప్రవాహం  మనల్ని ఏమీ చేయలేదు.*
 *ప్రవాహం వేగముగా ఉన్నపుడు గొలుసును మరింత దృఢముగా పట్టుకోవాలి తప్ప వదిలేయకూడదు.*.
 *ఎంత దృఢముగా పట్టుకుంటే అంత రక్షణ.*
 *కనుక అనవసర చింతలు మానివేసి భగవంతున్ని స్మరిస్తుండండి.*
 *సకల చింతలు రూపుమాపేది ఒక్క సర్వేశ్వర చింతనే అన్న సత్యమును మరువకండి.🌴_*

No comments:

Post a Comment