[4/10, 07:09] +91 73963 92086: 🌹 శ్రీ రమణీయం - 17🌹
👌దైవానుగ్రహాన్ని గుర్తించటమూ తపస్సే...👌
✍️ శ్రీ గెంటేల వెంకటరమణ
నమో వేంకట రమణాయ,
అద్వైత నిధయే నమః
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
🌈 17. దైవానుగ్రహాన్ని గుర్తించటమూ తపస్సే🌹
✳️ దైవానుగ్రహం నిరంతరాయంగా మనపైనా, ఈ సృష్టి అంతటా కురుస్తూనే ఉంది. దాన్ని గుర్తించి ఎల్లప్పుడూ స్మరించడం తపస్సే అవుతుంది. కానీ మనలో స్వార్థం, సంకుచితత్వం వల్ల ఆ పని చేయలేకపోతున్నాం. మన వేలికో, కాలికో వచ్చిన బాధను గుర్తిస్తున్నాం గానీ, మిగిలిన శరీరమంతా బాగుందన్న సత్యం గ్రహించలేకపోతున్నాం. ప్రతి చిన్న కష్టానికి దేవుడి దయ లేదంటూ మన అజ్ఞానాన్ని చాటుకుంటున్నాం. శరీరధర్మాలకు, మనసు పోకడలకు భిన్నంగా ఉండటం ఎంతో కష్టసాధ్యం.
✳️ *సామాన్యుల స్థాయిలో సమదృష్టి ఎలా సాధ్యం.... మన సుఖదు:ఖాలను, సంతోషవిచారాలను ఒకేలా ఎలా స్వీకరించ గలుగుతాం?*
✳️ కష్టసుఖాలు, సుఖదు:ఖాలు కలిసే ఉంటాయని అర్థంచేసుకొని స్వీకరించడం ద్వారా అది సాధ్యం అవుతుంది. మన శరీరంలోనే అనారోగ్యంగా ఉన్న భాగాలతో పాటే ఆరోగ్యంతో ఉన్న భాగం కూడా ఉన్నా.. మనం రోగాన్నే తలచుకుంటాం. ఆరోగ్యాన్ని గుర్తించం. వెలుగు చీకట్లను ఎలా సహజంగా అంగీకరిస్తామో మన జీవితంలో ఉన్న అన్ని ద్వంద్వాలనూ అలా స్వీకరించడమే సమదృష్టి. మనలో స్థిరాస్తిగా ఉన్న దైవం ఈ మనోదేహాలనే చరాస్తులుగా మారటం ప్రకృతిలో అంతర్భాగమే. సైన్స్ మాటల్లో చెప్పితే.. స్థితిశక్తిగా ఉన్న ఆత్మ ఈ శరీరం, మనసులు చేసే పనుల కోసం గతిశక్తిగా మారుతుంది. *నిప్పురవ్వ బొగ్గును తగలగానే రగులుకొని అంతటా వ్యాపించినట్లే మనలోంచి ఆత్మశక్తి ఈ శరీరమంతటా శక్తిగా, చైతన్యంగా వ్యక్తమౌతుంది. నిప్పురవ్వగా ఉన్నప్పుడు లేని అనేక లక్షణాలు అది బొగ్గును తగలగానే సంక్రమించినట్లే మనలో జనించే అహంకారం పుడుతుంది. మనలో ఉన్న ఆ ఆత్మస్థానాన్ని తెలుసుకునే ప్రయాణంలో మంత్రజపం వాహనంగా పనిచేస్తుంది. శ్రద్ధగా సాగే మంత్ర జపంలో అది ఎక్కడనుండి వస్తుందో అదే హృదయస్థానమనీ, మన మనోమూలమని తెలుసుకుంటాం.
✳️ స్థితిశక్తిగా ఉన్న శరీరానికి, ఆత్మబిందువు సామర్థ్యం అఖండంగా ఉంటుంది. మన ఆ మనసుకు అందే గతిశక్తి ఈ ఆత్మశక్తి నుండి నిరంతరాయంగా వ్యక్తమయ్యే కిరణాలేనని తెలుసుకోవాలి. యోగి తానే ఆ స్థితిశక్తిగా మారతాడు. రగులు తున్న మంటలాంటి మనసు అడుగున ఉన్న ఆ ఆత్మరేణువును తెలుసు కోవాలంటే ముందు ఈ జ్వాలలు తగ్గాలి. మనసు విస్తృతిని తగ్గించిన కొద్దీ అంతర్ముఖమై అది తన నిజస్వరూపమైన ఆత్మను తెలుసుకుంటుంది. సూర్యుడు చెక్కుచెదరకుండా ఈ లోకాన్ని తన కిరణాలతో పోషించినట్లే మనలోని ఆత్మ తాను చలించకుండా తన కిరణమైన శక్తితో, చైతన్యంతో ఈ మనోదేహాలను నడుపుతుంది. మనలోని ఆత్మశక్తిగా ఉన్న దైవం మన శరీరంతో చేసే పనులు చూస్తున్నాం గానీ, దానికంటే ముందే మన శరీరంలో ఉండి చేసే పనులు గుర్తించడంలేదు. విశాలదృక్పథంతో ఉన్న దైవానుగ్రహాన్ని ముక్కలుముక్కలుగా అర్థం చేసుకుంటున్నాం. అమ్మాయికి వివాహం జరిగితేనే దేవుని దయ అని తలిచే తల్లిదండ్రులు అసలా యువతి తమకు జన్మించడం, పెరగటం పెళ్లికి సిద్ధంచేయడం అంతా ఆ దైవానుగ్రహమేనని మర్చిపోతున్నారు.
✳️ సముద్రపు అలలుచూసి దాని స్వరూపస్వభావాలు నిర్ణయించడం ఎంత తప్పో, కేవలం మన పరిమిత దృష్టితో ఈశ్వరుని దయను, స్వరూపాన్ని కొలతలు వేయడం అంత తప్పు. ఆత్మనుండి వెలువడ్డ కిరణాలతోనే ఈ శరీరంగా రూపుదిద్దుకున్న ప్రకృతివల్ల దేహాత్మభావన, దేహాభిమానం జనిస్తున్నాయి. యోగి ఆత్మననే అహంతో ఉండటంచేత దేహంలోని ప్రతికణం ఆత్మస్వరూపం గానే ఉంటుంది. మనం పూజలుచేస్తే దేవుని దయ వస్తుందని అనుకుంటున్నాం. అసలు ఆ పూజ చేయగలగటమే దైవానుగ్రహంకదా! పక్షవాతం వచ్చిన రోగికీ, కోమాలో ఉన్నవాడికీ లేని ఆ అవకాశం నీకు కల్పించడం ద్వారా నీపై అపార అనుగ్రహం అప్పటికే ఉందని అర్థం చేసుకోవాలి. దైవాన్ని ఎక్కడో వెతుకుతాం రెండు చేతుల రాపిడి నుండి పుట్టే వేడి ఆ భగవంతుని ఉనికినే తెలుపుతుంది. జీవించినంతకాలం ఆగకుండా కొట్టుకునే మననాడి ఆ దైవానుగ్రహమేనని మనం మర్చిపోతాం. స్థితిశక్తి గతిశక్తిగా మారే ప్రక్రియలో అయస్కాంతక్షేత్రం జనిస్తుంది. అలానే మనలోని ఆత్మ మనసుగా మారే ప్రక్రియలో ప్రకృతిపై ఆకర్షణ ఏర్పడుతుంది. అందుకే జీవలక్షణాలు రాగానే కోర్కెలు ఉద్భవిస్తాయి.
✳️ మనసును అదుపుచేయాలంటే మరోపరికరం, ప్రక్రియ అక్కర్లేదు. నెయ్యిని చల్లారిస్తేనే గట్టిపడ్డట్లు వివేకంతో విచారణచేస్తే మనసు తన చపలత్వాన్ని వదిలి దృఢపడుతుంది. మనసు ఆలోచనా పరంపర తగ్గిస్తే ఆత్మస్వరూపమైన స్థితిశక్తిగా ఉంటుంది. మంటపై ఏది వేడిచేసుకున్నా దానితో ఆ మంటకు ఏ సంబంధం ఉండదు. వేడి చేయడం దాని స్వభావం అలాగే ఆత్మ చైతన్యంగా మారటం దాని స్వభావమే తప్ప తెచ్చిపెట్టుకున్న లక్షణం కాదు. మంత్రసాని ఎలాగైతే గర్భిణిస్త్రీకి పసికందుని ప్రసవించడంలో సహకరిస్తుందో అలానే గురువుకూడా మనలోనే ఉన్న ఆత్మ వెలుగును తెలుసుకోవడంలో సహకరిస్తాడు. మనలో కోర్కెలు పుట్టించే మనసుకు మూలంలో ఉన్నది భగవంతుడే. కనుక ఆ కోర్కెలు తీర్చేందుకు ఎన్ని జన్మలైనా ఇస్తూనే ఉంటాడు.
[4/10, 07:09] +91 73963 92086: కోర్కెలు ఉన్నంత వరకూ మనకి భిక్షాపాత్రలాంటి ఈ దేహం తప్పదు.
✳️ మనం మనలోని భగవత్ శక్తిని గమనించకుండా అంతా మన ప్రమేయంతోనే జరిగి పోతుందని భావిస్తున్నాం. 'నాకంతశక్తిలేదు' అని అనటంలోనే ఆశక్తి మన ఇష్టానుసారం ఉండదని అర్ధం అవుతుంది. నిద్రలేచినా, పనులుచేసినా, ఆలోచించినా ప్రతీది నీలోనుండి వెలువడే ఆత్మశక్తే చేస్తుంది. ఆ శక్తి విషయంలో మనకి స్వతంత్రం లేదు. యోగిమాత్రమే ఆశక్తిని స్వతంత్రంగా అనుభవించగలడు. మనం ఆ శక్తిగా మారేంతవరకూ ఏదీ మనం చేసేదికాదు, కేవలం దేహభావనతో కలిగే కర్తృత్వమే మన అజ్ఞానమని అర్థమైతే అహంకారం తగ్గుతుంది.
✳️ మన మనసు మెళకువపడి దేహంతో మమేకమై ఉంటుంది. కలలో దేహంనుండి విడివడినా దేహభావనతోనే ఉంటుంది. గాఢనిద్రలో మాత్రమే ఏదీలేని శుద్ధ మనసుగా తాను ఉంటుంది. మనసును మనసుతోనే జయించాలి. తత్వచింతన ముల్లును ముల్లుతోనే తీసి ఆ రెంటినీ పారేసినట్లే చేయాలి. గమనింపు అనే మనోశక్తితోనే మనసు వికారాలు గుర్తించి వాటిని వదిలించుకోవాలి. మనను మనం ఉద్దరించుకున్న తర్వాతే మరొకరిని ఉద్ధరించమని చెప్పటమే ఇంటగెలిచి రచ్చగెలవడం అంటే. చేయాలనుకునే
మనసు, చేసే శరీరం, చేయించే శక్తి, అన్నీ ఆత్మకిరణాలేనన్న సత్యం మనకు అర్థమైతే అది నిరంతర తపస్సు అవుతుంది.
✳️ ఆత్మకి భిన్నంగా ఏదీ లేదన్న సత్యానుభవమే మోక్షం. ఈ సృష్టిలో ప్రతి ఉపాధి ద్వారా పనిచేసేది పరచైతన్యమేనని తెలుసుకుంటే ఇక అహంకారం ఎక్కడ ఉంటుంది. నిలబడే శక్తి లేని వాడికి ఊతమిచ్చే కర్రగానీ, మనిషిగానీ మరోశక్తి రూపాలేకదా! ప్రాణశక్తి తగ్గి వ్యాధి వస్తే ఔషధం ద్వారా తిరిగి అందించేది ఆ శక్తినే. ఇలా అంతటా శక్తిగా ఉన్నది ఆ దైవానుగ్రహమేనని తెలుసుకున్నరోజు నిత్యానందస్థితి మన సొంతం అవుతుంది.
🙏 ఓం నమోభగవతే శ్రీరమణాయ🙏
సేకరణ:
✳️🌹🌹🌹🌹✳️🕉️✳️🌻🌻🌻🌻✳️
No comments:
Post a Comment