*ఆత్మ క్రియా సూన్యత్వంతో నిండి ఉంటుంది.*
*ఆత్మ వివరణకు అందనిది.*
*మనస్సు యొక్క క్రియా కలాపాలకు అతీతంగా ఉంటుంది*.
*అది ఒక అద్భుతమైన శాంతి.*
*ఒక రకమైన మహోన్నత కాంతి పుంజము.*
*అచేతనత్వంతో కూడి నిర్భయంగా ఉండేది ఆత్మ.*
బ్రహ్మత్వానికి #జ్ఞానం తోడయితే ఆత్మ అజరామరమౌతుంది. సమత్వాన్ని పొందుతుంది.
అద్వైతాన్ని తెలియని #యోగులు మనస్సును అదుపులో ఉంచుకొని నిర్భయత్వాన్ని, తిరుగు లేని శాంతిని పొందడానికి, స స్వరూప జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు.
కుశ ధాన్యపు గడ్డి పరకతో సముద్రంలోని నీరును ఒక్కొక్క నీటి బిందువుతీసేస్తూ సముద్రాన్ని ఖాళీ చేస్తున్నట్లే మనస్సు లోని కోరికలను ఒకటొకటి నెమ్మది నెమ్మదిగా తొలగిస్తూ నిరుత్సాహ పడ కుండా అత్యంత సున్నితమైన ప్రయత్నంతో మనస్సును అధీనంలోకి తెచ్చుకోవాలి.
కోరికల మీద ఉండే అనుభూతిని, అనుభవించాలనే కోరికలను వెనుకకు తీసుకొని రావాలి.
ఎందుకంటే అవన్నీ దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తాయి.
ఈ సృష్టిలో ఉన్న #సమస్తము ఆ అజరామరమైన ఆత్మ యే.
మనస్సు కనుక చేతన రహిత స్థితి లోకి పోతే దానిని లయ స్థితి నుండి లేపాలి.
ఒక వేళ ప్రక్క దారులకు పోతే దానిని సమత్వ స్థితి లోకి తేవాలి.
బంధనానికి #మొలకలు మనస్సు.
మనస్సులో లౌఖిక బంధనానికి సంబంధించిన మొలకలు ఉన్నప్పుడు దాని స్వభావాన్ని అర్ధం చేసుకోవాలి.
మనస్సు #సమత్వ స్థితిలో ఉన్నప్పుడు దానిని కదుపవద్దు.
యోగి #సమాధి మత్తులో పడిపోకూడదు. సమాధి స్థితి నుండి బయటకు రావడానికి విచక్షణతో ప్రయత్నించాలి.
సమత్వాన్ని, స్థిరత్వాన్ని పొందిన తర్వాత యోగి యొక్క మనస్సు తిరిగి భౌతిక వస్తువులను కోరినట్లయితే ప్రయత్నంతో వాటన్నిటినీ ఆత్మ గా దర్శించడం నేర్చుకోవాలి.
పరమ శాంతి, ఆత్యంతిక మైన ఆనంద స్థితి తనలోనే ఉంటుంది. అదే శాంతి స్థితి.
అదే ముక్తి. అదే జన్మ రాహిత్యము. దానినే పరంబ్రహ్మ అంటారు ఏదయితే #పునర్జన్మ లేని ఆత్మగా అవుతుందో అదే నిజమైన జ్ఞానము యొక్క గని.
ఏ జీవి ఎప్పుడూ పుట్టదు. జీవిని పుట్టించ గలిగిన కార్యం ఏదీ లేదు. ఆత్యంతికమైన సత్యం ఏమిటంటే ఏదీ కూడా ఇప్పటి వరకూ పుట్ట లేదు.
ఈ విధంగా అధ్వైత ప్రకరణం ముగుస్తుంది.
No comments:
Post a Comment