💖💖💖
💖💖 *"526"* 💖💖
💖💖 *"శ్రీరమణీయం"* 💖💖
🌼💖🌼💖🌼💖🌼
🌼💖🕉💖🌼
🌼💖🌼
🌼
*"మాయకు ప్రభావితం కాకుండా శుద్ధమనసును సాధించుకునే మార్గం ఏముంది ?""*
*"ఏ విషయంపైన వ్యామోహం లేకుండా, ఎవరు ఈ సృష్టిలో తానొక అంతర్భాగంగా నిర్లిప్తతతో ఉంటారో వారిది శుద్ధమనసే అవుతుంది. తత్కాలంలో ఒక విషయంపైకి వెళ్ళని మనసు ఆ విషయంలో శుద్ధమనసే అవుతుంది. మనసులో ఏ విషయమైతే లేదో దాని విషయంలో వాడికి మాయే ఉండదు. అప్పుడు ఆ విషయంలో ఆతనికి వైరాగ్యం కలిగినట్లే. అలా అన్ని విషయాల్లో నిశ్చలత సాధిస్తే అది శుద్దవైరాగ్యం. వైరాగ్యంలో దేన్ని వద్దని తిరస్కరించడం ఉండదు. ఏదీ కావాలని కోరుకోకపోవటమే ఉంటుంది. ఎందుకంటే ఫలానాది వద్దనుకోవటం కూడా తనకిష్టమైన దాన్ని కావాలనుకోవటమే అవుతుంది !"*
*"{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}"*
No comments:
Post a Comment