*దైవ స్మరణ మహిమ*
🥀🪷🥀🪷🥀🪷🥀🪷🥀🪷🥀
🪷 దైనందిన కార్యక్రమాల్లో ప్రార్థన ముఖ్యమైనది. స్నానానంతరం శుభ్రమైన దుస్తులు ధరించి దైవారాధన చేయడాన్ని కర్తవ్యంగా భావిస్తాం. నిత్యపూజ సంగతలా ఉంచితే నిరంతరం మదిలో దైవాన్ని స్మరిస్తూనే ఉండాలి.
🪷 *ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల..* చందాన, బాహ్య శుభ్రత ఉన్నంతలో సరిపోదు. మనసు నిర్మలంగా ఉంటేనే ప్రార్థన సఫలమవుతుంది. శారీరక శుభ్రత ప్రధానమే అయినప్పటికీ అతి శీతల ప్రాంతాల్లో ఉదయాన్నే స్నానం చేయడానికి శరీరం సహకరించకపోతే, నీళ్లు తలపై జల్లుకుని దైవాన్ని స్మరించవచ్చు. కొన్నిసార్లు పుణ్యతీర్థాల్లో స్నానమాచరించే అవకాశం లేనప్పుడు తలపై నీళ్లు చిలకరించుకుని దైవాన్ని ప్రార్థించడమే శరణ్యం. మనకు తెలిసీతెలియక చేసిన పాపాలు దైవస్మరణంతో హరిస్తాయి.
🪷 దొంగతనం, దోపిడీలు లాంటి పాపకర్మలెన్నో చేసే అజామీళుడు సదా దైవస్మరణ చేసేవాడు. తన పుత్రుడికి ‘నారాయణ’ అని పేరు పెట్టడం వల్లే నిరంతరం నారాయణ నామాన్ని తలవడం సాధ్యమైంది. అలా చివరి క్షణాల్లోనూ నారాయణ నామస్మరణ చేస్తూ తుదిశ్వాస విడిచాడు. పాపాత్ముడైన అజామీళుణ్ణి నరకానికి తీసుకెళ్లాలని యమకింకరులు వచ్చారు. కానీ దేవదూతలు వారిని అడ్డగించి, అజామీళుడిని స్వర్గానికి తీసుకెళ్ళారు. దైవస్మరణకు ఉన్న మహిమ అలాంటిది. అందుకే, *'నారాయణ నామ మహత్యం పొగడతరమా...!* అంటారు.
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు
*సేకరణ:*
No comments:
Post a Comment