*🌺🙏🏻 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🏻🌺*
*_🌴" మానవుని హృదయం ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటుంది. కానీ కోరికలు అనే మురికి చేరటం వలన దాని స్వరూపము మారిపోతున్నది . జేబు రుమాలు తెల్లగా ఉంటుంది, కానీ నిరంతరం ఉపయోగించడం వల్ల మురికిగా మారుతుంది. మీరు దానిని ఉతికినపుడు మరలా తెలుపుగా అవుతుంది. అయితే మీరు రుమాలును తెలుపుగా చేయలేదు. కేవలం రుమాలుకు అంటుకున్న మురికిని మాత్రమే తొలగించారు! తెల్లటి గుడ్డను ఉతకడం ద్వారా మాత్రమే మురికిని తొలగించగలరు తప్ప కొత్తగా తెలుపుగా చేయలేరు. ఎందుకంటే తెలుపు దాని గుణం కాబట్టి! అలానే మనిషి హృదయము ఎల్లపుడూ స్వచ్ఛంగా, తెలుపుగానే ఉంటుంది. స్వచ్ఛత అనేది దాని నిజ స్వరూపం! అయితే కోరికలు అనే మురికి స్వచ్ఛతను కప్పివేస్తుంటాయి. వీటి కారణమున హృదయములో చెడు గుణములు అన్నీ చేరి కలుషితము చేస్తుంటాయి. అయితే ఈ కోరికలనే మురికిని ప్రేమ అనే సబ్బు పెట్టి, వైరాగ్యమనే నీటితో ఉతికివేయాలి. అప్పుడే మీ హృదయం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా మరియు శుభ్రంగా ఉంటుంది. స్వచ్ఛమైన హృదయమే దేవుని అసలైన నివాస స్థలం."🌴_*
No comments:
Post a Comment