Tuesday, April 11, 2023

::: ఇంద్రియాలు బరువు మోస్తూ వుండటం :::

 *::: ఇంద్రియాలు బరువు మోస్తూ వుండటం :::*
      కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం,  అనే ఈ ఐదు ఇంద్రియాలు ఎల్లప్పుడూ  బరువును మోస్తూ వుంటాయి. ఇది ఎలాగో చూద్దాం.
ఉదాహరణకు.....
    1)  ఒక వస్తువును కన్ను చూచినప్పుడు ,చూచిన దానిని  గుర్తు పెట్టాలి అంటే కన్ను ఆ వస్తువును అంతకు ముందు చూచినదై వుండాలి. ఈ  అనుభవాన్ని ఉపయోగించి కన్ను చూచిన దానిని గుర్తు పుడుతుంది.మెదడు సహాయంతో. దీని వలన మనకు ఇబ్బంది లేదు.
      2) కన్ను  అంతక ముందే చూచిన వాటి పట్ల ఇష్టం, అయిష్టం ,నాది, నీది,  అలా ఎందుకు, ఇలా ఎందుకు అనే అభిప్రాయాల, ఉద్దేశాల, సిద్ధాంతాల, అలాగే అప్పుడు కలిగిన అనుభూతి, కలిగిన ఉద్వేగం, మొదలగు జ్ఞాపకాల బరువును కలిగి వుండి వస్తువు లను, సంఘటనలను,ఆ కోణం లో చూడటంతో, వక్రీకరణ చెందుతుంది .  ఇది మనలను తప్పు దారి పుట్టిస్తుంది.
  ధ్యానం బరువు దించుతుంది.
*షణ్ముఖానంద 9866699774*

No comments:

Post a Comment