Tuesday, November 7, 2023

ధ్యానం అంటే ఏమిటి?

 HN96. 0502.  2-9.   250223-5.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀


           *ధ్యానం అంటే ఏమిటి?*
                   ➖➖➖✍️


*ఈ ప్రశ్న ఒక పిల్లాడిని వెంటాడుతూ ఉంది. ఆ కుర్రవాడు అర్థం చేసుకోగలిగే సరళమైన భాషలో ఎలా వివరించాలో ఎంత ఆలోచించినా అతని తల్లిదండ్రులకు తెలియలేదు.*

*ఒకసారి వారు కుటుంబ సమేతంగా రమణ మహర్షి దర్శనానికి వెళ్లారు.*

*బాలుడు తన ప్రశ్నను రమణ మహర్షి ముందుంచాడు.*

*"ధ్యానం   అంటే   ఏమిటి గురువుగారూ?" అని ఆ అబ్బాయి అడిగాడు.*

*శ్రీ రమణమహర్షి తనలో తానే నవ్వుకున్నాడు. అప్పుడు చిరునవ్వుతో తన భక్తుడిని పిలిచి, వంటగదిలోంచి దోసె తీసుకొచ్చి ఆ అబ్బాయికి వడ్డించమని  చెప్పాడు.*

*ఒక అరిటాకుపై, ఒక దోసె వడ్డించారు.  రమణమహర్షి ఆ కుర్రాడి వైపు చూసి, "ఇప్పుడు నేను  ‘మ్మ్’  అంటాను. అప్పుడే నువ్వు తినడం మొదలు పెట్టాలి.     మళ్ళీ  ‘మ్మ్’ అంటాను.                 ఆ తర్వాత నీ ఆకులో చిన్న దోసె ముక్క కూడా మిగలకూడదు." అని అన్నారు.*

*ఆ కుర్రాడు  చాలా ఉత్సాహంగా ఒప్పుకున్నాడు. అందరూ కూడా చాలా నిశితంగా గమనిస్తూ ఉన్నారు.*

*ఇప్పుడు ఆ కుర్రాడు రమణమహర్షి ముఖంలోకి చూస్తూ, సంకేతం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. "మ్మ్" అని సంకేతం ఇవ్వగానే ఆ కుర్రాడు తినడం మొదలుపెట్టాడు.*

*ఇప్పుడు   అతని  దృష్టి  అంతా రమణమహర్షి పైనే ఉంది. సంకేతం ఇచ్చే ముందే  దోసె పూర్తి చేయాలనుకుని, అతను హడావిడిగా దోసెను పెద్ద పెద్ద ముక్కలుగా చింపి తింటున్నాడు కానీ, ఆ సమయమంతా అతని దృష్టి రమణమహర్షి పైనే ఉంది.*

*దోసె పరిమాణం క్రమంగా తగ్గుతూ వచ్చింది.   ఒక చిన్న ముక్క మాత్రమే మిగిలి ఉంది.  రెండో సంకేతం కోసం అతను రమణమహర్షి వైపు ఆత్రుతగా చూశాడు.* 

*సంకేతం ఇచ్చిన క్షణం, ఆ కుర్రాడు వెంటనే చివరి దోసె ముక్కను నోటిలో పెట్టేసుకున్నాడు.*

*ఇప్పుడు రమణమహర్షి అతనిని…    "ఇప్పటి వరకు నీ దృష్టి ఎక్కడ ఉంది? నాపైనా    లేక   దోసెపైనా     లేక ఇతరులపైనా?" అని అడిగారు.*

*"నా దృష్టి   మీ మీదా,    దోసె మీదా మాత్రమే ఉంది, ఇంక దేనిమీదా లేదు”, అని ఆ అబ్బాయి బదులిచ్చాడు.*

*రమణమహర్షి, "అవును... నువ్వు నా మీదే శ్రద్ధ పెట్టి, దోసె పూర్తి చేయడంలో పూర్తిగా నిమగ్నమయ్యావు.    నువ్వు అస్సలు పరధ్యానంగా లేవు.*
*అదే విధంగా,   నీవు   నీ దృష్టిని  లేదా ఆలోచనలను భగవంతునిపై నిల్పి, నీ రోజువారీ కార్యకలాపాలను చేసినప్పుడు, దానిని ‘ధ్యానం’ అంటారు."*

*"మ్మ్" అన్న రెండు సంకేతాలు పుట్టుక - మరణం. ఈ రెండు సంఘటనల నడుమ, శ్రీ రమణ మహర్షి చూపించిన విధంగా…  ‘ధ్యానం’ లో నిమగ్నమవ్వవచ్చు.*

*అయితే దీన్ని అర్థం చేసుకోవడానికి, మనమందరం పరిపక్వమై, పరిణతి చెందాలి, దీనికి ‘దైవానుగ్రహం’ కూడా అవసరం.*

*మనమందరం ఒకరికొకరు భిన్నంగా ఉంటాం, కాబట్టి ఈ గొప్ప సత్యాన్ని అర్థం చేసుకోవడానికి పట్టే సమయం కూడా వివిధరకాలుగా ఉంటుంది.*✍️

                   ♾️♾♾♾

*ధ్యానం చేసినప్పుడు, మనం ప్రాణాహుతి ప్రసారాన్ని అందుకుంటాం. ఇది హార్ట్‌ఫుల్‌నెస్ ప్రత్యేకత. ఇది మన చైతన్యాన్ని మెరుగుపరుస్తుంది. *✍️
.          *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                       🌷🙏🌷

   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:

Post a Comment