Pasupula Pullarao ఆధ్యాత్మిక రంగంలో ఎవరు ఎవరికి ఏమి ఇవ్వలేరు.. ఎవరికి వారు కావాలన్నది పొందడం కొరకు శక్తి కావాలి, ఆ శక్తి సరైన సాధన ద్వారా మాత్రమే వస్తుంది...సరైన సాధన చేస్తూ సరైన ధ్యాన ప్రచారాలు మాత్రమే చేయాలి... సరైన సాధన చేస్తే
1. నాడిమండల శుద్ధి ద్వారా జన్మ జన్మల చెడు కర్మలు దగ్ధం
2. ఆరా విస్తరణ జరుగుతుంది.
3. మాటే మంత్రం గా మారుతుంది
4. మాంస పిండం మంత్ర పిండంగా మారుతుంది
5. అంతర్వాణి వినడం జరుగుతుంది.
6. మౌనం ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
7. మాయ నుండి బయటపడి మాయ ప్రచారాలకు దూరంగా ఉంటారు.
8. అహం అహంకారాలు పోయి ప్రేమ తత్వం, కృతజ్ఞతా భావం, క్షమాగుణం
ఆభరణలు గా
9. అద్భుతమైన ఆలోచనలు ద్వారా ఆనందకరమైన జీవితం
అందుకే ఎవరికి వారు సరైన సాధనకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వాలి, చేయాలి... అపుడే అనుభవాపూర్వకంగా ధ్యానం ద్వారా విశ్వ శక్తిని పొందుతారు.
మాయను జయించడానికే ధ్యాన మార్గంలోకి వచ్చాం.. మరల మాయ ప్రచారాల మాయలో పడి ఆగం ఆగం కాకండి.
No comments:
Post a Comment